Bigg Boss Telugu 6: మొదటిసారి కపుల్స్ కి షాక్ ఇస్తున్న బిగ్ బాస్.. ఎవరు తప్పు చేసినా కష్టమే!

బిగ్ బాస్ లో ఎప్పుడు ఇలాంటి గొడవలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టం. అయితే కొంతమంది కరెక్ట్ పాయింట్ తో గొడవ పడుతూ ఉంటే మరి కొంతమంది కావాలని హైలెట్ అవ్వాలి అని అవకాశం చూసుకొని గొడవ పడుతూ ఉంటారు. ఇక బిగ్ బాస్ 6 వ సీజన్లో స్పెషల్ సెలెబ్రెటీ కపుల్స్ గా వచ్చిన రోహిత్ మెరినా ఇద్దరు కూడా గొడవ పడుతున్న విధానం ఎవరికి అర్థం కావడం లేదు. అయితే బిగ్ బాస్ మాత్రం ఈసారి వీరికి ఒక షాక్ ఇవ్వబోతున్నాడు. ఎవరు తప్పు చేసినా కూడా ప్రభావం ఇద్దరి పైన పడబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మూడవ సీజన్ లో

మూడవ సీజన్ లో

బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్లో సెలబ్రిటీ కపుల్ గా అడుగుపెట్టిన వరుణ్ సందేశ్ వితికా మంచి క్రేజ్ అయితే అందుకున్నారు. కానీ చివరి వరకు ఇద్దరు నిలవలేకపోయారు. ముందుగా వితికా వెళ్లిపోగా తర్వాత వరుణ్ సందేశ్ ఫైనల్ టాప్ పై వరకు కొనసాగాడు. ఇక చివరి వరకు పోరాడి టాప్ త్రీ కంటెస్టెంట్ గా వరుణ్ వెనుతిరగాల్సి వచ్చింది. ఇక తర్వాత కూడా కొంతమంది కపుల్స్ ని హౌస్ లోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ నిర్వాహకులకు సాధ్యపడలేదు.

మెరినా - రోహిత్

మెరినా - రోహిత్

ఇక ఈసారి స్పెషల్ సెలబ్రెటీ కపుల్ గా వచ్చిన టెలివిజన్ ఆర్టిస్టులు మెరినా - రోహిత్ ఇద్దరూ కూడా చాలా ఎట్రాక్టివ్ గా అడుగుపెట్టారు. మొదట్లోనే వీరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అర్డంసీబీసుకునే కపుల్స్ గా హైలెట్ అవుతూ వచ్చారు. నాగార్జున పలు ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఇద్దరూ ఒకే తరహా సమధనాలు చెప్పడంతో ఇద్దరి మధ్య అర్థం చేసుకునే సాన్నిహిత్యం ఎక్కువగానే ఉందని కూడా అనుకున్నారు.

అర్థంలేని వాదన

అర్థంలేని వాదన

అయితే బిగ్ బాస్ హౌస్ లో వీరు రెండవ రోజే ఊహించని ప్రవర్తనతో కనిపించారు. అసలు వీరు ఇప్పుడు ఇలా ఉంటే అసలు ఇంట్లో ఎలా ఉంటారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే మెరినా మాత్రమే కాకుండా రోహిత్ కూడా అదే తరహాలో ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముందుగా తనతో సరిగ్గా మాట్లాడడం లేదు అని మెరినా అర్థంలేని వాదనతో అలగడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

రోహిత్ కూడా అలానే..

రోహిత్ కూడా అలానే..

అయితే రోహిత్ సైతం ఆమె విషయంలో అర్థం చేసుకోకుండానే ప్రవర్తించడం మరింత నెగిటివ్ గా మారింది. ఏదో మాటల్లో మాట్లాడుతుంటే తనను మాటలను కూడా పట్టించుకోవడం లేదు అని మెరినా అనవసరంగా అలిగింది. ఇక తరువాత సర్లే అని గొడవను ముగించాలని అనుకున్న తరుణంలో నాకు వాలిడ్ పాయింట్ కావాలి అంటూ రోహిత్ కూడా అర్థం లేని విధంగానే మాట్లాడాడు.

 ఇద్దరిపై ప్రభావం

ఇద్దరిపై ప్రభావం

అయితే ఈ సెలబ్రిటీ కపుల్స్ ఈసారి ఇద్దరూ ప్రత్యేకంగా కాకుండా ఇద్దరు ఒక్కరిగా మాత్రమే అనే విధంగా బిగ్ బాస్ ఎంట్రీ అయితే ఇప్పించారు. ఎందుకంటే వీరు నామినేషన్స్ లో కూడా కలిసే ఇతరులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా నామినేట్ చేయాలంటే కూడా ఇద్దరిని నామినిట్ చేయాల్సిందే. అంటే ఎవరు ఎలిమినేట్ అయ్యే లక్షణాలు పెంచుకున్నా కూడా ఆ ప్రభావం మరొకరి మీద కూడా పడుతుంది. అంటే ఎలిమినేట్ అయితే ఇద్దరు అవ్వాలి.. ఉంటే ఇద్దరు ఉండాలి. మరి వీరి మధ్య టాస్క్ లు ఎలా నిర్వహిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X