Bigg Boss Telugu 6: చంటి కంటే తక్కువ ఓట్లు వచ్చినా ఆమె సేఫ్.. ఇది మూడోసారి.. ఈసారైనా పంపిస్తారా?
బిగ్ బాస్ హౌస్లో చంటి ఎలిమినేషన్ అందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను తప్పకుండా హౌస్ లో ఇంకా మరికొన్ని వారాలపాటు కొనసాగుతాడు అని అనుకున్నారు. కానీ ఇంతలోనే హౌస్ లో నుంచి వెళ్లిపోవడం ఎవరికి అంతు చిక్కడం లేదు. అయితే చంటి కంటే తక్కువ స్థాయిలో ఓట్లు వచ్చిన వారు కూడా ఉన్నారు అని వారిని ఎందుకు ఎలిమినేట్ చేయడం లేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక గత మూడు వారాల నుంచి తృటిలో తప్పించుకుంటున్న ఒక కంటెస్టెంట్ ఈ వారం మాత్రం తప్పకుండా హౌస్ లో నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

నిరుత్సాహంగా..
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ అయితే చాలా నిరుత్సాహంగా మొదలైంది. ఆ తర్వాత నాగార్జున కంటెస్టెంట్స్ అందరిపై కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్ళీ ట్రాక్లోకి వచ్చినట్లు అనిపించింది. అయితే ప్రస్తుత కూడా ఈ షో పై పెద్దగా హై రేంజ్ లో అయితే రెస్పాన్స్ ఏమీ రావడం లేదు. కొందరు మాత్రమే మంచి ఓట్లను అందుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ కూడా ఎప్పటికప్పుడు ఊహించని విధంగా టాస్క్ లతో ప్లాన్ చేస్తున్నాడు.

చంటి మిస్టేక్
ఐదో వారం చంటి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే అతను హౌస్ లో నుంచి ఇంత త్వరగా వెళ్ళిపోతాడు అని ఎవరు అనుకోలేదు. జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ ఒక విధంగా అయితే అతను కామెడీతో పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయాడు. గతంలో జబర్దస్త్ నుంచి వచ్చిన వారు పర్వాలేదు అనిపించి చివరి వరకు పోరాడారు. కానీ ఆ అవకాశాన్ని చంటి ఉపయోగించుకోలేదు.

ఓట్లు బాగానే వచ్చినా..
చంటి గత రెండు మూడు వారాల నుంచి కూడా డేంజర్ జోన్ లోనే కొనసాగుతున్నాడు. అయితే అతనికి ఓట్లు తక్కువ ఏమి పడటం లేదు. మిగతా ఐదు మంది కంటెస్టెంట్స్ కంటే కూడా అతనికి ఓట్లు చాలా ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో అతను మరో నాలుగు వారాలు ఉన్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలోనే బిగ్ బాస్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు.

ఆమెకు తక్కువ ఓట్లు
అయితే చలాకి చంటి వెళ్ళిపోవడం బిగ్ బాస్ దృష్టిలో కరెక్టయినప్పటికీ కూడా అతని కంటే తక్కువ స్థాయిలో ఓట్లు అందుకుంటున్న వారిని హౌస్ లో ఎందుకు ఉంచుతున్నారు అని వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా సుదీప అయితే గత మూడు వారాల నుంచి కూడా ఏ ఒక్క వారంలో అత్యధిక ఓట్లు అందుకున్న సందర్భాలు లేవు. అసలు ఆమె టాస్క్ లలో కూడా పెద్దగా హార్డ్ వర్క్ ఏమి చేయడం లేదు.

ఈసారైనా వెళ్లిపోతుందా?
అలాంటి సుదీపను ఇంట్లో అనవసరంగా ఉంచుతున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈసారి చలాకి చంటి, సుదీప ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లిపోతారు అని మొదట ఒక టాక్ వచ్చినప్పుడు అందరూ కూడా సుదీప ఈసారి కచ్చితంగా వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం చంటిని బయటకు పంపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే సుదిప ఈ వారం కూడా ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేకపోతే మాత్రం తప్పకుండా ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఆమెకు వచ్చిన అవకాశాలను ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











