Bigg Boss Telugu 6: చంటి చేసిన తప్పులు ఇవే.. అతనికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ తెలుగు 5 వారంలో ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది. జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి బయటకు వెళ్ళిపోతాడు అని ఎవరు ఊహించలేదు. అసలు అతను టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంటారు అని కూడా అందరూ అనుకున్నారు. ఒక విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అతన్ని ఎక్కువ రోజులు ఉంచాలని కూడా ఆలోచించారు. కానీ చంటి మాత్రం ఐదో వారంలోనే వెళ్ళిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకీ అతడు తప్పు చేసిన తప్పులు ఏంటి అలాగే ఇప్పటివరకు అతనికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

 ప్రత్యేకంగా ప్రయత్నించి మరీ..

ప్రత్యేకంగా ప్రయత్నించి మరీ..

బిగ్ బాస్ ద్వారా క్రేజ్ అందుకోవడమే కాకుండా ఆదాయం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. అందుకే కొంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరు కూడా బిగ్ బాస్ లో అవకాశం రావాలి అని కోరుకుంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కమెడియన్సు కు బిగ్ బాస్ చాలా మంచి ఆఫర్లు ఇస్తుంది. ఇక ఈసారి చలాకి చంటి ప్రత్యేకంగా ప్రయత్నించి మరి బిగ్ బాస్ లో అవకాశం పొందాడు. మొదట ఒక నలుగురు జబర్దస్త్ కమెడియన్స్ ను అనుకున్నప్పటికీ చివరికి చంటిని నిర్వాకులు ఫిక్స్ చేశారు.

వెనుకడుగు వేయకుండా..

వెనుకడుగు వేయకుండా..

చాలకి చంటి కి ఇటీవల కాలంలో అయితే సినిమాల్లో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. కేవలం కొన్ని చిన్న సినిమాలలో మాత్రమే అతనికి నటించే అవకాశం వస్తోంది. కానీ కెరీర్ కు ఉపయోగపడే రేంజ్ లో అయితే సినిమాలు రావడం లేదు. ఇక ఫైనల్ గా అతను బిగ్ బాస్ లో అవకాశం రాగానే ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఎలాగైనా టాప్ ఫైనల్ వరకు నిలవాలని అనుకున్నాడు.

కామెడీ యాంగిల్ లో

కామెడీ యాంగిల్ లో

చంటి 5 వారంలో ఎలిమినేట్ అవుతాడు అని మొదట్లో ఎవరు ఊహించలేదు. ఒక విధంగా అతన్ని తీసేయాలని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు అనుకోలేదు. ఎందుకంటే బిగ్ బాస్ లో కామెడీ యాంగిల్ లో అట్రాక్ట్ చేసేవారు సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ఒక విధంగా ఈ సారి ప్రేక్షకులకు ఎక్కువగా తెలియని వారిని తీసుకువచ్చారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అందుకే కాస్త జబర్దస్త్ ద్వారా క్రేజ్ అందుకున్న చంటి ఉంటేనే బెటర్ లో ఉంది అందరూ అనుకున్నారు.

అదే పెద్ద మైనస్

అదే పెద్ద మైనస్

చంటి మీద ముందుగా పాజిటివ్ ఆలోచన ఉన్నప్పటికీ అతను మాత్రం బిగ్ బాస్ హౌస్ లో పెద్దగా ఆకట్టుకున్నది లేదు. గొడవలలో కూడా అనవసరంగా చర్చలు మొదలు పెడుతూ.. లాజిక్స్ లేని మాటలతో అతను కాస్త చిరాకు తెప్పించాడు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక టాస్క్ లలో కూడా అతను పెద్దగా పోరాడింది లేదు. సరైన కౌంటర్స్ ఇవ్వడంలో కూడా ఫెయిల్ అయిపోయాడు. అదే అతనికి పెద్ద మైనస్ కా మారింది. ముఖ్యంగా గీతూ రేవంత్ గొడవలు విషయంలో కూడా అతను పొరపాట్లు చేశాడు.

సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పటికీ

సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పటికీ

బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పటికీ కూడా చంటి అందులో ఏమాత్రం సక్సెస్ కాలేకపోయాడు. సీక్రెట్ టాస్క్ ఇస్తే తప్పకుండా దాన్ని ఉపయోగించుకుంటే టాప్ ఫైనల్ వరకు కూడా ఉపయోగపడుతుంది కానీ చంటి అద్భుత అవకాశాన్ని కూడా మిస్ చేసుకున్నాడు. ఇక అతని వల్ల ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా ఏమీ రావడం లేదు అని బిగ్ బాస్ ఈసారి ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

 రెమ్యునరేషన్ ఎంత?

రెమ్యునరేషన్ ఎంత?

ఇక బిగ్ బాస్ లో చలాకి చంటి ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసలు బిగ్ బాస్ లో ఎక్కువ స్థాయిలో పారితోషికాలు అందుకుంటున్న కంటెస్టెంట్స్ లో అతను కూడా ఒకడు. అతనికి వారానికి 50 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. అంటే ఈ 5 వారాల్లో అతనికి బిగ్ బాస్ ద్వారా మొత్తంగా 2 లక్షల 50 వేల వరకు వచ్చినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X