For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: కోల్పోయిన ప్రైజ్ మనీ తిరిగి ఇచ్చేందుకు ఛాలేంజ్.. కానీ, అక్కడే 'బిగ్' బాస్ ట్విస్ట్!

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ ఇప్పటికే 92 రోజులు 93 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మరికొన్నిరోజుల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇక బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇప్పటికి 14 మంది వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. టైటిల్ గెలిచేందుకు గట్టిగానే పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఫినాలేకు మొదటి కంటెస్టెంట్ గా శ్రీహాన్ వెళ్లాడు. అయితే ఇది వరకు ఇంటి సభ్యులకు టాస్క్ లు ఇచ్చి బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కొంత డబ్బు కట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ డబ్బును గెలుచుకునేందుకు ఛాలేంజ్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే అక్కడ ఒక మెలిక పెట్టాడు బిగ్ బాస్. అదేంటనే విషయంలోకి వెళితే..

   ముందుగా హిందీలో..

  ముందుగా హిందీలో..

  అమెరికాలో బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో కాలక్రమేణా మిగతా భాషల్లోకి రావడం జరిగింది. ఇందులో భాగంగానే తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమైంది. కానీ భారీగా ప్రేక్షకాదరణ పొందింది. వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది.

   ఒక్కొక్కరిగా ఇంటి బాట..

  ఒక్కొక్కరిగా ఇంటి బాట..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 13 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, జబర్దస్త్ ఫైమా ఇలా 14 మంది వెళ్లిపోయారు. దీంతో హౌజ్ లో ఏడుగురు మాత్రమే మిగిలారు.

  రూ. 5 లక్షల లోపు..

  రూ. 5 లక్షల లోపు..

  ఇదిలా ఉంటే ఎప్పుడైనా సరే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీపై క్యూరియాసిటీ ఉంటుంది. విన్నర్ కి ఎంత వస్తుందని తెలుసుకోవాలని ఉంటుంది. అయితే ఈ ఆరో సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలో కోత విధించారు నిర్వాహకులు. ఇంటి సభ్యులకు టాస్క్ లు ఇస్తూ వారిచేతే ఈ డబ్బును తగ్గించే ప్లాన్ వేసింది బిగ్ బాస్ టీమ్. నామినేషన్స్ నుంచి బయటపడేందుకు ఇమ్యూనిటీ టాస్క్ లో భాగంగా రూ. 5 లక్షలలోపు గరిష్ట అమౌంట్ ను చెక్ పై రాసి వేయాల్సిందిగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే.

  కోల్పోయిన డబ్బు ఎంతంటే..

  కోల్పోయిన డబ్బు ఎంతంటే..

  ఇమ్యూనిటీ టాస్క్ లో అప్పుడున్న ఇంటి సభ్యులందరూ అమౌంట్ రాశారు. అందరికన్నా యూనిక్ అమౌంట్ రూ. 4, 90, 700 రాసి ఇమ్యూనిటినీ దక్కించున్నాడు మోడల్ రాజశేఖర్. అలాగే ఫ్రీ ఎవిక్షన్ పాస్ కోసం పెట్టిన టాస్క్ లో రేవంత్, శ్రీహాన్, ఫైమా ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కో అమౌంట్ తో గేమ్ ఆడారు. మొత్తంగా ఈ టాస్క్ లో ద్వారా ఇంటి సభ్యులంతా కలిసి బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తగ్గించింది. రూ. 11, 99900. అంటే దాదాపుగా రూ. 12 లక్షలు.

   ఓడిపోతారనుకున్న వాళ్లకు ఓటింగ్..

  ఓడిపోతారనుకున్న వాళ్లకు ఓటింగ్..

  మొత్తంగా బిగ్ బాస్ విన్నర్ కు వచ్చేది రూ. 38 లక్షలు 100. అయితే తాజాగా విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన రూ. 11 లక్షల 990ని తిరిగి సంపాందించుకునేందుకు ఛాలేంజ్ లు ఇచ్చాడు బిగ్ బాస్. అలా ఛాలేంజ్ లు ఇచ్చి డబ్బు తిరిగి ఇవ్వడం బానే ఉంది. కానీ ఇక్కడే ఒక చిన్న తిరకాసు పెట్టాడు బిగ్ బాస్. ఏకాభిప్రాయంతో ఆ ఛాలేంజ్ లు ఎవరు ఆడతారో పేర్లు చెప్పమన్న బిగ్ బాస్.. తర్వాత మిగతా ఇంటి సభ్యుల చేత ఎవరు ఓడిపోతారనుకుంటున్నారో చెప్పాలని ఓటింగ్ నిర్వహించాడు.

  గేమ్ విన్నర్ కు ఓటింగ్స్ సరిపోయేలా..

  ఇంటి సభ్యుల ఓటింగ్ తర్వాత ఎవరు ఓడిపోయారో.. ఆ కంటెస్టెంట్ కు వచ్చిన ఓట్ల ద్వారా ప్రైజ్ మనీని తిరిగి ఇస్తారు. అంటే ఇద్దరు కంటెస్టెంట్స్ ఆడితే మిగతా ఐదుగురు ఓట్లు వేస్తారు. అందులో ముగ్గురు.. ఓడిపోతారని ఓట్లు వేసిన కంటెస్టెంట్ ఓడిపోతే బిగ్ బాస్ ప్రకటించిన ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది. లేకుంటే లేదు. సో అలా ఇంటి సభ్యుల గేమ్, ఓటింగ్ కు సరిపోయేలా ప్లాన్ వేశాడు బిగ్ బాస్. అంటే వాళ్లలో వాళ్లకే తెలియని పోటి పెట్టాడన్నమాట. గత ఎపిసోడ్ లో రూ. 1 లక్ష ఛాలేంజ్ ఇవ్వగా అందరూ శ్రీసత్య ఓడిపోతుందని ఓట్లు వేశారు. కానీ రోహిత్ ఓడిపోయి శ్రీసత్యనే గెలిచింది. దీంతో ఆ రూ. లక్ష బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలో ప్లస్ కాలేదు. ఇదే 'బిగ్' బాస్ ట్విస్ట్ అంటే.

  English summary
  Bigg Boss Telugu 6 Season Team Gives Challenges To Housemates For Redeem Bigg Boss Winner Prize Money Of Rs 12 Lakh
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X