For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: రేవంత్ కు సీమంతం చేద్దామా? హౌజ్ లో అందరికన్నా పెద్దోడు అతనే! మళ్లీ నేను తిరిగి ఇచ్చేస్తా.

    |

    రేటింగ్ సంగతి ఎలా ఉన్నా.. బిగ్ బాస్ రియాలిటీ షోకి రెస్పాన్స్ మాత్రం అసాధారణంగానే ఉంది. ఇప్పటి వరకు 5 సీజన్లను ఎంతో విజయవంతంగా ప్రేక్షకుల మన్ననలు పొందగా.. సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైన బిగ్​బాస్​ ఆరో సీజన్​ బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీజన్ లో వింతలు, విచిత్రాలు బాగానే జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ప్రేమయాణాలు, అలకలు, బుజ్జగింపులే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ ను బాగానే చూపిస్తున్నారు. ఇదిలాఉంటే ప్రతి శనివారం, ఆదివారం హోస్ట్ నాగార్జున వచ్చి రివ్యూ చేస్తాడని తెలిసిందే. ఎప్పటిలానే ఈ శనివారం అంటే అక్టోబర్ 1న నాగార్జున వచ్చి సభ్యులందరికీ కౌంటర్లు, సలహాలు, కూపీలు లాగడం వంటివి చేశాడు.

    అంగరంగ వైభవంగా..

    అంగరంగ వైభవంగా..

    తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంటూ ఉంటున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కానీ, దీనికి రేటింగ్ మాత్రం చాలా తక్కువగానే వస్తుంది.

    మొహమాటం లేకుండా వార్నింగ్..

    మొహమాటం లేకుండా వార్నింగ్..

    గతంలో కంటే ఆరో సీజన్‌లో అక్కినేని నాగార్జున కంటెస్టెంట్లపై విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. తప్పు చేసిన వాళ్లను ఏమాత్రం మొహమాటం లేకుండా వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాదు, గత వారం ఏకంగా ఇద్దరిని నేరుగా నామినేట్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో నాలుగో వారంలో చాలా తప్పులు జరగడంతో శనివారం ఎపిసోడ్‌పై ఆసక్తి నెలకొంది.

     రెండో ప్రోమో..

    రెండో ప్రోమో..

    దీనికోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఈ ఆసక్తిని అర్థం చేసుకున్న నిర్వహాకులు శనివారం నాటి ఎపిసోడ్ రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో ఫన్నీ డిస్కషన్లతోపాటు సీరియస్ గా శపథాలు చేయడం కూడా జరిగాయి. ఇక తాజాగా విడుదలైన ఎపిసోడ్ రెండో ప్రోమో ఎలా ఉందో చూద్దాం.

     రేవంత్ కు సీమంతం చేద్దామా..

    రేవంత్ కు సీమంతం చేద్దామా..

    రేవంత్.. సీమంతం చూస్తే ఎలా ఉంది.. నువ్వెప్పుడు చేయించుకుంటున్నావ్ సీమంతం అని నాగార్జున ఫన్నీగా రేవంత్ ను అడుగుతాడు. మధ్యలో కల్పించుకున్న గీతూ రాయల్ ఆరోజే చేద్దామంటే విన్లేదు సార్ అంటే.. ఏంటీ ఇప్పుడు రేవంత్ కు సీమంతం చేద్దామా అని నవ్వించాడు నాగార్జున.

    అందరికన్నా శ్రీహాన్ పెద్దవాడు..

    అందరికన్నా శ్రీహాన్ పెద్దవాడు..

    ఆ తర్వాత హౌజ్ లో అందరికంటే పెద్దవాడు చంటి అని మీ ఉద్దేశం. నేను వెరిఫై చేశాను. అందరికన్నా శ్రీహాన్ పెద్దవాడు అని ఇన్ డైరెక్ట్ గా ఇనయాతో జరిగిన గొడవ గురించి ప్రస్తావించాడు. తర్వాత నేను చెప్పింది కరెక్టేనా అని చంటిని అడిగితే.. అంతే సార్ అని చంటి సమాధానమిస్తాడు. నీకు చాలా సంతోషంగా ఉంది కదా ఇప్పుడు అని నాగార్జున చెప్పి నవ్విస్తాడు.

     బుజ్జమ్మ ఎవరు..

    బుజ్జమ్మ ఎవరు..

    అనంతరం ఆరోహిని పిలుస్తూ బుజ్జమ్మ ఎవరు అని నాగార్జున అడిగితే.. దేవుళ్లు సార్ మీరు అని ఆరోహి అంటుంది. బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ. అర్థం కాని మిస్టరీ సార్ అది అని ఆరోహి సమాధానం చెబితే.. నీకు నందు టైపా.. అని నాగార్జున కౌంటర్ వేస్తాడు. దీనికి నాకు నందు క్లియర్ సార్ అని నవ్వుతుంది ఆరోహి రావు.

     బీబీ చాట్ బండార్..

    బీబీ చాట్ బండార్..

    బీబీ చాట్ బండార్ లో భాగంగా హద్దులో ఉండాలి, సోమరిపోతు, రూడ్, టాక్సిక్, మిస్ ఫిట్ ఇన్ ది హౌజ్ అంటు పలు పేర్లను ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి ఇవ్వాల్సిందిగా చెబుతాడు నాగార్జున. ఇందులో భాగంగానే గీతూ రాయల్ సోమరిపోతు అని వాసంతి పానీపూరిలో ఆలు వేసి తినిపిస్తుంది. ఆ తర్వాత తనను బయట ఎక్కువ ఏడిపించేవారు ఎవరని శ్రీహాన్ ను అడిగితే.. సుజిత్, అఖిల్ అని చెబుతాడు శ్రీహాన్. దీంతో బాగా కవర్ చేశావులే కూర్చో నవ్విస్తాడు నాగార్జున.

    కొన్ని నీళ్లు అయినా తాగుతా సార్..

    పానీ పూరిలో ఉప్పు వేసి గీతూ రాయల్ కు ఇస్తాడు చంటి. కొన్ని నీళ్లు అయినా తాగుతా సార్ అని గీతూ అంటే మింగిన తర్వాత అని నాగార్జున అంటే.. ఏంటీ సార్ ఇది ఉప్పు.. అని గీతూ అంటే నన్నడుగుతావేంటీ ఆయన్ను అడుగు అని చెబుతాడు. ఆయన్ను నేనేం అడగను సార్ చేయాల్సిన చోట నేను మళ్లీ తిరిగి ఇచ్చేస్తా అని ఘాటుగా సమాధానం ఇస్తుంది గీతూ రాయల్. అనంతరం చంటి గురించి చెబుతూ అతను హౌజ్ లోనే మోస్ట్ టాక్సిక్, కన్నింగ్, మ్యాన్యుపులేటివ్ అని అనిపిస్తోంది సార్ అని గీతూ చెప్పడంతో ప్రోమో ముగుస్తుంది.

    English summary
    Bigg Boss Telugu 6 October 1 2022 Episode Second Promo Released. And Nagarjuna Funny Discussion With House Contestants.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X