Bigg Boss Telugu 6: శ్రీసత్యకు 40 ఏళ్లు.. ఎంటర్టైనర్ నాగార్జున.. అవినాష్ కాళ్లు పట్టుకున్న అరియానా

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ జోరుగా, రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికీ 10 వారాలకు గాను పదకొండు మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. ఇక బిగ్ బాస్ తెలుగు 6 పదకొండో వారం నామినేషన్ల తంతు సాఫీగా సాగింది. మొత్తం 10 మంది ఇంటి సభ్యులు మిగలగా అందులో తొమ్మిది మంది నామినేషన్లలో ఉన్నారు. ప్రస్తుతం హౌజ్ లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 6 11వ వారం ఇంటి కెప్టెన్ గా సింగర్ రేవంత్ మరోసారి కెప్టెన్ అయినట్లు బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కంటెస్టెంట్లపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, సినీ సెలబ్రిటీస్, రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ ద్వారా బయటపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్, కమెడియన్ అవినాష్ తన అభిప్రాయాలను చెప్పేందుకు బీబీ కేఫ్ కు వచ్చాడు.

 రావడంతోనే కామెడీ..

రావడంతోనే కామెడీ..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్లు ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు. ఈ కేఫ్ కు అరియానా గ్లోరితో పాటు అప్పుడప్పుడు ఆర్జే కాజల్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్, కమెడియన్ అవినాష్ హాజరయ్యాడు. రావడంతోనే కామెడీ పండించిన అవినాష్ ను బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి పలు ప్రశ్నలు వేసి మరింత ఫన్ వచ్చేలా చేసింది.

6లో ఎంటర్టైనర్ ఎవరు..

6లో ఎంటర్టైనర్ ఎవరు..

బీబీ కేఫ్ లోకి ఎంటరైన అవినాష్ రావడంతోనే ఒక కాఫీ తీసుకురామ్మా అని అరియానకు కౌంటర్ వేశాడు. తర్వాత అరియానాను చూసి షాక్ అయిన అవినాష్.. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి బయటకు రాగానే అనుకున్నాను ఏదో ఒక రోజు కేఫ్ పెట్టుకుంటావని అని మరోసారి పంచ్ వేశాడు అవినాష్. నిన్ను బిగ్ బాస్ సీజన్ 4లో ఎంటర్టైనర్ అంటారుగా.. బిగ్ బాస్ సీజన్ 6లో ఎంటర్టైనర్ ఎవరు అని అరియానా అడిగింది.

 నాగార్జున మేనరిజంతో..

నాగార్జున మేనరిజంతో..

ఈ సీజన్ కి ఎంటర్టైనర్ వచ్చేసి నా దృష్టిలో నాగార్జున గారు.. బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్ అని నాగార్జున మేనరిజంతో చెప్పి నవ్వించాడు అవినాష్. ఇనయా గేమ్ ఎలా ఉంది, 10కి ఎన్ని మార్క్స్ ఇస్తావ్ అన్న ప్రశ్నకు.. ఇనయాను చూసినప్పుడు నన్ను చూస్తున్నట్లు అనిపిస్తుంది అని రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో చెప్పి ఆకట్టుకున్నాడు అవినాష్. ఈ ఓవరాక్షన్ చేయకు అని అరియానా అనడంతో.. 10కి 8 ఇస్తా అని చెప్పాడు.

శ్రీసత్యకి 40, 50 వేసుకోవచ్చు..

శ్రీసత్యకి 40, 50 వేసుకోవచ్చు..

ఎందుకు అమ్మాయి అనా అవినాష్ కు కౌంటర్ వేసింది అరియానా. రోహిత్ గురించి అడగ్గా.. అన్ని బాగున్నాయి గానీ, ఆట కూడా ఆడితే బాగుండేది. బేసిక్ గా గేమ్ ఆడితే ఓట్లు పడతాయి.. కానీ పాపం మనోడికేమో నామినేషన్స్ పడ్డాయని తెలిపాడు అవినాష్. శ్రీసత్యకు ఎన్ని మార్క్స్ ఇస్తావంటే.. శ్రీసత్యకి అంటూ సిగ్గుపడ్డుతూ 40, 50 వేసుకోవచ్చు అని అన్నాడు. దీంతో ఏంటి వయసా అని అరియానా పంచ్ వేసింది.

చీరకే అందమొస్తుంది..

ఆవిడ చీర కడితే చీరకే అందమొస్తుంది అని అవినాష్ అంటే.. సారీకి అందానికి కాదు గేమ్ లో ఎన్ని ఇస్తావో చెప్పు అంటే బాగుంది అని అన్నాడు అవినాష్. రేవంత్ గురించి అడగ్గా.. ఏ హెడెక్ గా ఉంది. కాఫీ ఏమైనా చెప్పు అని అవినాష్ అంటాడు. రాదు అని అరియానా అంటే వెళ్లిపోతా అని వెళ్లిపోతాడు అవినాష్. దీంతో అవినాష్ నీ కాళ్లు పట్టుకుంటా అని బతిమిలాడుతుంది యాంకర్ అరియానా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X