Bigg Boss Telugu 6: కన్నీళ్ళు పెట్టుకున్న కంటెస్టెంట్స్.. సిరి ఎంత బిజీగా ఉన్నా ఆ పని చేయాలంటూ శ్రీహన్ కోరిక
ఈవారం బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకలలో సందర్భంగా ఇంటి సభ్యులందరూ కూడా బిగ్ బాస్ కోరికలను తీర్చేందుకు ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ మీ కోరికల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలియజేయడంతో ఇంటి సభ్యులందరూ కూడా వారి ఎమోషనల్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంటూ కోరికలను కూడా తెలియజేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వివరణ ఇచ్చారు. నేడు ప్రచారం కాబోయే ఎపిసోడ్లో ఈ మూమెంట్స్ హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఆ వివరాలలోకి వెళితే..

శ్రీహన్ ఎమోషనల్
బిగ్ బాస్ కు ఒక విధంగా వారి కోరికల గురించి తెలియజేశారు. అయితే వాటి గురించి చెబుతూ కొందరు కంటతడి కూడా పెట్టుకున్నారు. ముందుగా శ్రిహాన్ అయితే తన ప్రియురాలును కూడా తలుచుకున్నాడు. అలాగే తన పేరెంట్స్ గురించి కూడా చెప్పుకున్నాడు. సిరి నువ్వు షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్నా సరే మా అమ్మ నాన్నలకు ఫోన్ చేసి మాట్లాడు అని కంటతడి పెట్టుకున్నాడు. ఏం జరిగినా సరే నువ్వు చూసుకుంటాను అనే విధంగా ధైర్యం కూడా చెప్పాలి అని అన్నాడు.

వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను.
ఇక సుదీప తన భర్త గురించి చెప్పుకుంది. అతని నుంచి టీ షర్ట్ కూడా వచ్చినట్లు తెలిపింది. ఆ టీషర్ట్ తన దగ్గర ఉంటే ఎప్పుడు కూడా రంగనాథ్ నా పక్కనే ఉంటాడు అని ఆలోచనతో ఉంటాను అని ఆమె ఎమోషనల్ గా తన భర్త గురించి చెప్పింది. అలాగే తన ఫోటో కూడా కావాలని అన్నట్లుగా సుదీప వివరణ ఇచ్చింది. ఇక మరోవైపు రేవంత్ నా వైఫ్ ను అలాగే మా అమ్మ గారిని ఇంట్లో వాళ్ళు అందరు కూడా బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను వాళ్ళు బాగుంటే నేను ఇక్కడ బాగుంటాను.

తండ్రి గురించి తలుచుకుంటూ
నా లైఫ్ లో మా నాన్నగారితో చాలా మాట్లాడింది చాలా తక్కువ అని ఆర్జే సూర్య ఏడుస్తూ చెప్పాడు. ఇక అతన్ని చూసి మిగతా వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. మరోవైపు ఇనయా తన తండ్రి గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అయిపోయింది మమ్మీ నిన్ను డాడీ చూసుకున్నంత బాగా చూసుకోలేదు కానీ, నేను నిన్ను డాడీ లోటు లేకుండా చూసుకోగలను మమ్మీ అంటూ ఇనయా వివరణ ఇచ్చింది.

మరొక లెవెల్ లో ఉంటది
ఇక అర్జున్ సైతం తన ఫాదర్ గురించి చెప్పుకునే కంటతడి పెట్టుకున్నాడు. వెనక్కి తిరిగి మరి కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇక అతన్ని చూసి మిగతావారు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఇక ఆదిత్య వచ్చేముందే తనకు ఒక పాప పుట్టింది అని తెలియజేశాడు. ఇక తన ఫ్యామిలీని గుర్తు చేసుకుంటూ త్వరలో మంచి పేరు పెట్టే అవకాశం రావాలి అని కోరుకుంటున్నట్లుగా తెలియజేశాడు. ఇక బిగ్ బాస్ లో తన పాప బర్త్ డే జరిగితే మరొక లెవెల్ లో ఉంటది అని ఆదిరెడ్డి కోరుకున్నాడు. మరి బిగ్బాస్ వీరి కోరికలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











