యూజ్‌లెస్ ఫెలో.. వేణుస్వామిపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్
సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామికి ఈసారి అస్సలు టైం బాగున్నట్లుగా లేదు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం వివాదాస్పదమయ్యాయి. ఈ రెండూ ఘటనల్లో బీఆర్ఎస్, ఎస్ఆర్‌హెచ్‌లు గెలుస్తాయని వేణుస్వామి చెప్పగా దీనికి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని వేణుస్వామి జోస్యం చెప్పగా.. ఇక్కడా రివర్స్ అయ్యింది. తన మాటలు, చేతలతో సోషల్ మీడియా జనాలకు ఎప్పుడూ టార్గెట్ అవుతూనే ఉంటారు వేణుస్వామి .
ఇక జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ అయితే వేణుస్వామి పెద్ద డెకాయిట్ అని, ఆడవాళ్లు ఎక్కడుంటే అక్కడ ఉంటాడని ఆరోపించారు. బ్రాహ్మణులు అనేవారు నియమ నిష్టలతో , పవిత్రంగా ఉంటారని కానీ వేణుస్వామిలో అలాంటి లక్షణాలేవి ఉండవని ఆర్పీ దుయ్యబట్టారు. మిగిలిన వారి సంగతేమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్‌కి , వేణుస్వామికి అస్సలు పడదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ జాతకం ఏమాత్రం బాలేదని .. అతని సినిమాలు ఆడవని, పైగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అయితే సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపడంతో వేణుస్వామిని ప్రభాస్ అభిమానులు ఓ ఆటాడుకున్నారు.

ఇదిలాఉండగా.. సమంతతో విడాకుల ఒంటరిగా ఉంటూ తన సినిమాలు తాను చేసుకుంటున్న నాగచైతన్య సహ నటి శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీనికి ముందు రోజు నుంచే సోషల్ మీడియాలో వార్తలు వస్తుండగా.. కింగ్ నాగార్జున అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఏది ఏమైతేనేం తమ హీరో తిరిగి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, నెటిజన్లు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే మన సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి ఈ మ్యాటర్‌లోనూ ఎంటరయ్యారు. చైతూ- శోభితల జాతకం కలవలేదని, వాళ్లిద్దరూ నిశ్చితార్ధం చేసుకున్న సమయం కరెక్ట్ కాదని .. ఒక అమ్మాయి కారణంగా ఈ జంట 2027లో విడిపోతారని కామెంట్ చేశాడు. ఆ మాటలతో అక్కినేని ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది.. అంతే వేణుస్వామిపై విరుచుకుపడ్డారు. శుభమా అని నిశ్చితార్ధం చేసుకుని గంటలు గడవకముందే ఆ మాటలేంటీ , అసలు వాళ్ల జాతకం చెప్పమని మిమ్మల్ని అడిగిందెవరు అంటూ ట్రోలింగ్‌కు దిగారు.

తాజాగా వేణుస్వామిపై ఫైర్ అయ్యారు బిగ్‌బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి. బిగ్‌బాస్ తాజా సీజన్ గురించిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ను పంచుకుంటూ ఓ వీడియో చేసిన ఆదిరెడ్డి.. అందులో వేణుస్వామిపై మండిపడ్డారు. నాగార్జున ఫ్యామిలీపై ఉన్నవి లేనివి మాట్లాడిన అతనిని బిగ్‌బాస్‌లోకి తీసుకోవడం కష్టమేనని.. రాబోయే రోజుల్లో వేణుస్వామికి చుక్కలేనని ఆదిరెడ్డి చెప్పారు. శుభమా అని చైతన్య పెళ్లి చేసుకుంటుంటే.. బ్రాహ్మణులు అనేవారు దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ అని దివిస్తారని.. ఇతనేంటో విచిత్రంగా ఉన్నాడంటూ చురకలంటించారు.
నీకు అసలు దక్షిణ ఇచ్చి జ్యోతిష్యం చెప్పమనలేదు.. ఆ మనిషిలో ఇంత నెగిటివ్ మైండ్ ఏంటో అర్ధం కావడం లేదని ఆదిరెడ్డి ఫైర్ అయ్యారు. బెదిరించి పాపులారిటీ తెచ్చుకుందామని చూడటమే తప్పించి , వరస్ట్ క్యాండిటేట్ అంటూ వేణుస్వామిపై విరుచుకుపడ్డారు . ప్రస్తుతం ఆదిరెడ్డి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











