తండ్రి అయిన అంబటి అర్జున్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సురేఖ.. ఎవరు పుట్టారో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్మ రేపు ఈ షో అన్నా, అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు అన్నా చాలా మందికి ఇష్టం. షో ముగిసి పోయిన నెల రోజులు గడుస్తున్నా ఇంకా ఈ షో ఫీవర్ తగ్గట్లేదు. ముఖ్యంగా ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు ఎక్కడ కనిపించినా వారు ఏం చేసిన ప్రత్యేక వార్తలుగా నిలుస్తున్నాయి. జనాలు కూడా వీరి గురించి తెలుసుకునేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ అంబటి అర్జున్ తండ్రి అయ్యాడు. ఎవరు పుట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగు పెట్టాడు సీరియల్ హీరో అంబటి అర్జున్. అద్భుతమైన ఆటను కనబర్చిన ఈయన.. మొదటి వారంలోనే హౌస్ లో అడుగు పెట్టి ఉంటే కచ్చితంగా విన్నర్ గా నిలిచేవాడని చాలా మంది భావించారు. టాప్ 6 కంటెస్టెంట్ గా నిలిచి చివరి వారం వరకు హౌస్ లో కొనసాగిన ఈయన ఎప్పుడూ ఏడవలేదు. కేవలం తన భార్య వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులు కనిపించినప్పుడు మాత్రమే కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఎమోషన్స్ ను ఎప్పుడూ కంట్రోల్ చేసుకునే ఇతను భార్య మాటర్ రాగానే కన్నీళ్లు పెట్టుకునేవాడు.

Bigg Boss Telugu 6 Contestant Ambati Arjun Wife Surekha Blessed A Baby

అందుకు కారణం ఆయన బిగ్ బాస్ కు వచ్చేటప్పుడు ఆయన భార్య గర్భవతిగా ఉండడం. అందులోనూ తల్లిదండ్రులు ఇద్దరూ తన సోదరి కోసం అమెరికా వెళ్లడం. తాను బిగ్ బాస్ కు వస్తే చూసే వాళ్లు ఎవరూ లేక ఎక్కడ ఆమె ఇబ్బంది పడుతుందోనని తెగ టెన్షన్ పడిపోయేవాడు. కానీ దాన్ని సింపథీగా వాడుకోకుండానే చక్కగా గేమ్ ఆడాడు. 10వ వారం ఫ్యామిలీ వీక్ లో భాగంగా అర్జున్ భార్య సురేఖ హౌస్ లోకి రావడం.. కంటెస్టెంట్లు అంతా కలిసి ఆమెకు సీమంతం చేయడం హైలెట్ గా నిలిచింది. దీనికి అర్జున్ కూడా తెగ ఎగ్జైట్ అయ్యాడు.

ఇక ఇంటి నుంచి బయటకు వచ్చేముందు అంబటి అర్జున్ కు నాగార్జున గిఫ్టు కూడా ఇచ్చాడు. ఈక్రమంలోనే పుట్టబోయే బిడ్డ పేరు కూడా చెప్పేశాడు అర్జున్. తనకు పాప పుట్టినా, బాబు పుట్టినా ఆర్కా అనే పేరు పెట్టుకుంటామని.... ఆర్కా అంటే తన పేరులోని మొదటి అక్షరం భార్య పేరులోని చివరి అక్షరాలు ఉంటాయని... అందుకే ఆ పేరు పెట్టుకోవాలని అనుకుంటున్నట్లు వివరించారు. అప్పటికి ఆమె 8వ నెల గర్భవతి. ప్రస్తుతం ఆమెకు 9 నెలలు నిండాయి.

Bigg Boss Telugu 6 Contestant Ambati Arjun Wife Surekha Blessed A Baby

అయితే అంబటి సురేఖ తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. అర్జున్ కోరుకున్నట్లుగానే కూతురు పుట్టింది. ఈ విషయాన్ని అంబటి అర్జున్ యే నేరుగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేశాడు. తనకు కూతురు పెట్టిందని.. ముందుగా అనుకున్నట్లుగానే పాపకు ఆర్కా అనే పేరు పెట్టబోతున్నట్లు వివరించాడు. ఈవిషయం తెలుసుకు అంబటి అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X