Bigg Boss 6 Neha Chowdary:త్వరలో బిగ్ బాస్ బ్యూటి నేహా చౌదరి పెళ్లి.. అతనెవరో తెలుసా?

స్పోర్ట్స్ యాంకర్ గా బాగా పాపులర్ అయిన నేహా చౌదరి.. బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి నాలుగో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఈ షోలో ముందుగా చక్కటి ఆట తీరుతో ఆకట్టుకున్నా తర్వాత అంతగా పర్ఫామ్ చేయలేదు. అలాగే కొన్ని కొన్ని పొరపాట్లతో మూడో వారమే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయింది. ప్రస్తుతం మళ్లీ యాంకర్ గా కొనసాగుతోంది. అలాగే ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తోంది. ఈ ఛానెల్ లో తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు, లాంగ్ డ్రైవ్స్, ఇంట్లో వేడుకలు తదితర అంశాలపై ఆసక్తిగా చెప్పుకొస్తుంది. అయితే పెళ్లి సంబంధం పక్కన పెట్టి బిగ్ బాస్ కు వచ్చిన ఈ ఫిట్ నెస్ యాంకర్ తాజగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

న్యూస్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్..

న్యూస్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్..

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతిలో సెప్టెంబర్​ 11న జన్మించిన నేహా చౌదరిది మధ్య తరగతి కుటుంబం. ఆమెకు ఒక బ్రదర్​ కూడా ఉన్నాడు. కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చదివింది నేహా చౌదరి. కొంతకాలం పాటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసిన నేహా చౌదరి తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టింది. ముందుగా మహా న్యూస్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నేహా తర్వాత సాక్షి, హెచ్ఎంటీవీ, ఎన్టీవీ, వనిత టీవీ, మా మ్యూజిక్ తోపాటు పలు ఛానెళ్లలో యాంకరింగ్ చేసింది.

వుమెన్ వరల్డ్ కప్ కు ప్రజెంటర్ గా..

వుమెన్ వరల్డ్ కప్ కు ప్రజెంటర్ గా..

2012 నుంచి యాంకర్​గా కొనసాగుతోంది. 2020-21లో జరిగిన ఇండియన్​ ప్రీమియల్ లీగ్​ (ఐపీఎల్​)కు స్టార్ స్పోర్ట్స్​ తెలుగులో యాంకర్​గా మోస్ట్​ పాపులర్​ అయింది నేహ చౌదరి. 2020లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్​ వన్డే సిరీస్​ వంటి తదితర మ్యాచ్​లకు హోస్ట్​గా వ్యవహరించింది. 2020లో జరిగిన ఇండియా వర్సెస్​ ఆస్ట్రేలియా టీ20 మహిళల ప్రపంచకప్​కు ప్రజెంటర్​గా పనిచేసింది నేహా చౌదరి.

యోగా ట్రైనర్ గా నేహా..

యోగా ట్రైనర్ గా నేహా..

2019లో వివో ప్రో కబడ్డీకి స్టార్​ స్పోర్ట్స్​ తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరించింది నేహా చౌదరి. అయితే యాంకర్​గా సక్సెస్​ఫుల్​గా కొనసాగిన నేహా చౌదరి అథ్లేట్​గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కంది. నేహా చౌదరి యాంకర్​ గా కాకుండా ఈటీవీ ప్లస్​లో 2020 మార్చి 9న ప్రసారమైన నిజం టీవీ సిరీస్​లో కూడా నటించింది.నేహా చౌదరి యాంకరింగ్​తోపాటు నటి, డ్యాన్సర్​, మోడల్​, యోగా ట్రైనర్​, స్విమ్మర్​ కూడా.

ఉత్తమ యాంకర్ గా అవార్డు..

ఉత్తమ యాంకర్ గా అవార్డు..

జిమ్నాస్టిక్​లో అనేక జాతీయ అవార్డులను కూడా సాధించింది. యువ కళావాహిని ఎక్సలెన్స్​ అవార్డులలో ఉత్తమ యాంకర్​ అవార్డును గెలుచుకుంది. అలాగే సైమా అవార్డ్స్-2019 ఈవెంట్ కి హోస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి అడుగుపెట్టి వెంటనే బయటకు వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్న నేహా చౌదరి ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

కాబోయే భర్త ఫొటో చూపిస్తూ..

త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది యాంకర్ నేహా చౌదరి. అలాగే తనకు కాబోయే భర్త ఫొటోను కూడా తన ఫ్రెండ్స్ కు చూపించింది. అయితే ఈ విషయాన్ని తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ కోసం క్రియేట్ చేసిన వీడియోలో తెలిపింది. పలువురు యాంకర్లతో కలిసి సరదగా ముచ్చట్లు పెడుతున్న సమయంలో పెళ్లి టాపిక్ వచ్చింది. అప్పుడే తాను పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వెల్లడించింది.

బిగ్ బాస్ షో తర్వాత పెళ్లి..

నేహా చౌదరి తను చేసుకోబోయే వ్యక్తి తన క్లాస్ మేట్ అని.. ఇద్దరు కలిసి ఇంజినీరింగ్ చదివినట్లు ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. అతని పేరు అనిల్ అని, ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని యూట్యూబ్ వీడియోలో పేర్కొంది. అలాగే తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ముచ్చటించింది. అయితే బిగ్ బాస్ లోకి పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుని వచ్చినట్లు నాగార్జునతో చెప్పింది. బిగ్ బాస్ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు నేహా చౌదరి హామీ ఇచ్చినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X