Bigg Boss 6: హౌస్ లోకి మరో యూట్యూబర్.. లీక్ చేసే వ్యక్తినే దింపుతున్నారుగా..?

బిగ్ బాస్ 6వ సీజన్ మొదలుకావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎవరెవరు రాబోతున్నారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఒక ఫైనల్ లిస్ట్ రెడీ అయింది అని కూడా టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. కానీ ఇంతవరకు ఎవరు కూడా ఆ విషయంపై పెద్దగా హింట్ అయితే ఇవ్వలేదు. ఇక రీసెంట్ గా మరొక యూట్యూబర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అని తెలుస్తోంది. ఇక అతను ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

అంతకుమించి అనేలా..

అంతకుమించి అనేలా..

బిగ్ బాస్ గత ఐదు సీజన్స్ కూడా టెలివిజన్ రేటింగ్స్ అందుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు 6వ సీజన్ లో అంతకు మించి అనేలా సక్సెస్ చేయాలి అని నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఎంటర్టైన్మెంట్ విషయంలో ఈసారి సరికొత్త టాస్కులు అలాగే విభిన్నమైన సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయినట్లు సమాచారం.

ప్రోమో వైరల్

ప్రోమో వైరల్

ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఇదివరకే వరుసగా మూడు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున మంచి హోస్ట్ గా సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు నాలుగోసారి ఆయన అదే తరహాలో రెడీ అవుతున్నట్లుగా ఇటీవల ప్రోమోతో క్లారిటీ ఇచ్చేశారు. ప్రోమోకు కూడా మంచి స్పందన వచ్చింది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ ప్రోమో డైరెక్ట్ చేశాడు.

 మరో ప్రోమో కూడా

మరో ప్రోమో కూడా

ఇక బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ గా పాల్గొనబోయే సెలబ్రెటీలు ఎవరెవరు అనే విషయంలో ఇప్పటికే చాలా రకాల పేర్లు వైరల్ అయ్యాయి. ఇక ఎవరి పేర్లు కూడా లీక్ కాకుండా అయితే బిగ్ బాస్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి బిగ్ బాస్ మొదలుకానున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మరొక అఫీషియల్ ప్రోమోను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

 ప్రత్యేకంగా ఉండాలని..

ప్రత్యేకంగా ఉండాలని..

బిగ్ బాస్ లో ఈసారి టెలివిజన్ యాంకర్స్ తో పాటు కొంతమంది యూట్యూబర్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలబబోతున్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది మాజీ హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్టులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సీజన్లో మాత్రం అన్ని వర్గాల వారు చాలా ప్రత్యేకంగా ఉండాలి అని ఫిక్స్ అయ్యారు.

మరో యూట్యూబర్

మరో యూట్యూబర్

లేటెస్ట్ గా వస్తున్న టాక్ ప్రకారమైతే మరొక యూట్యూబర్ కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు ఎక్కువగా బిగ్ బాస్ పైనే రివ్యూలు ఇస్తూ మంచి క్రేజ్ అందుకున్న ఆదిరెడ్డి. అతని పూర్తి పేరు వెంకట ఆదినారాయణ. ఇక అతనికి బిగ్ బాస్ 6 వ సీజన్లో అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.

 బిగ్ బాస్ పైనే రివ్యూలు

బిగ్ బాస్ పైనే రివ్యూలు

ఆదినారాయణ రెడ్డి ప్రతి బిగ్ బాస్ సీజన్ ను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు తన రివ్యూలు అందిస్తూ ఉంటాడు. అంతే కాకుండా ఎక్కువగా హౌస్ లో నుంచి ఎలిమినెట్ అయ్యేది ఎవరు అనే విషయంలో కూడా లీక్స్ చేస్తూ ఉంటాడు. ఒక విధంగా బిగ్ బాస్ ఫ్యాన్ ఫాలోవర్స్ అతనికి కూడా అభిమానులు అయ్యారు. మరి బిగ్ బాస్ పై ఇంత పట్టు ఉన్న ఆదిరెడ్డి ఆటలోకి దిగితే ఏ విధంగా ఉంటాడు అనేది ఆసక్తికరంగా మారుతుంది. మరి అతను నిజంగానే వస్తాడా లేదా అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X