Bigg Boss Telugu 6 రేవంత్ బ్యాడ్ క్వాలిటీ చెప్పిన శ్రీహాన్.. ఫైమాకు నాగార్జున స్వీట్ వార్నింగ్?

అశేష ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రధానంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో మొదట హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభించారు. ఇది సక్సెస్ కావడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్ కూడూ దాదాపు పూర్తి దశకు వచ్చింది. ఇప్పటికీ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 83 రోజులు 84 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఆదివారం నాటి నవంబర్ 27వ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు.

స్టేజీపైకి సినీ సెలబ్రిటీలు..

స్టేజీపైకి సినీ సెలబ్రిటీలు..

బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతి శని, ఆదివారాల్లో హోస్ట్ వచ్చి ఎంటర్టైన్, రివ్యూస్, సలహాలు, వార్నింగ్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. ఈ శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ తోపాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు, విన్నర్స్, సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి సందడి చేయించారు. కంటెస్టెంట్ల తరఫున వచ్చిన వాళ్లు ఇంటి సభ్యులను ఎంకరేజ్ చేస్తూ పలు హింట్స్ ఇచ్చి వెళ్లారు.

ఇంకో మూడు వారాలు మాత్రమే..

ఇంకో మూడు వారాలు మాత్రమే..

ఇక ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకో మూడు వారాలు మాత్రమే ఉంది. నో మోర్ ఫ్రెండ్షిప్, నో మోర్ డిప్లమసీ.. గెలవడానికి మాత్రమే ఆడండి అంటూ నాగార్జున చెప్పాడు. లెట్స్ ప్లే ద గేమ్ అని చెప్పిన నాగార్జున కంటెస్టెంట్లులో బ్యాడ్ క్వాలిటీ చెప్పమని అడిగినట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. బ్యాడ్ క్వాలిటీ అంటే.. ఇక్కడ అందరూ మంచివాళ్లే అని ఇనయా చెప్పింది. దాన్ని ఎడిట్ చేసేయండని నాగార్జున అని నవ్వించారు.

రేవంత్ కి అది అవసరం లేదు..

రేవంత్ కి అది అవసరం లేదు..

రాజ్ గురించి చెప్పుకొచ్చింది ఇనయా. కొన్ని సందర్భాల్లో తను ఎందుకు రైజ్ అవుతాడో ఎవ్వరికీ తెలియదు. తను ఏదో చెప్పాలి అని చేస్తాడు అని ఇనయా అంటుంటే.. ఒక్కటి చెప్పు అని రాజ్ అడిగాడు. దీనికి ఇప్పుడు నువ్ చేస్తున్నావ్ కదా అని ఆన్సర్ ఇచ్చింది ఇనయా సుల్తానా. తర్వాత లేచిన ఆదిరెడ్డి.. రేవంత్ లో ఉన్న బ్యాడ్ క్వాలిటీ గురించి చెప్పుకొచ్చాడు. రేవంత్ ఆట చాలా బాగా ఆడతాడు సార్.. అలాంటి వ్యక్తికి తాను ఆట ఆడతానని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సార్. తాను ఉన్నాను అని కనపడేందుకు ఎక్కవ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది సార్ అది అవసరం లేదని ఆదిరెడ్డి తెలిపాడు.

పదిసార్లు చెబితే అర్థం చేసుకుంటారు..

పదిసార్లు చెబితే అర్థం చేసుకుంటారు..

ఫ్రెండ్ షిప్, గేమ్ రెండు డిఫరెంట్ సార్. గేమ్ కన్నా ఫ్రెండ్ షిప్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం శ్రీహాన్ బ్యాడ్ క్వాలిటీ అని శ్రీసత్య చెప్పింది. ఏ సమస్య అయిన తను ఉండాలని దూరుతుందని ఇనయా బ్యాడ్ క్వాలిటీ అని రాజ్ తెలిపాడు. రేవంత్ బ్యాడ్ క్వాలిటీ గురించి శ్రీహాన్ చెప్పుకొచ్చాడు. బయట వాళ్లకైతే మనం పదిసార్లు చెబితే అర్థం చేసుకుంటారు సార్.. కానీ ఫ్రెండ్స్ అయితే ఒక్కసారి చెబితే అర్థం చేసుకునేటట్లు ఉండాలి. అలా రేవంత్ అర్థం చేసుకోడని శ్రీహాన్ తెలిపాడు.

సలహాలు ఇవ్వడం కరెక్టా..

రేవంత్ లేచి ఫైమా బ్యాడ్ క్వాలిటీ గురించి చెప్పాడు. ఇప్పటివరకు అయితే తన వెటకారం తగ్గలేదు. కానీ తగ్గించుకున్న అనుకుంది. తను చెబుతుంది కానీ పక్కవాళ్లు చెబితే తీసుకోలేదని రేవంత్ అన్నాడు. తర్వాత ఆట జరుగుతున్నప్పుడు వాళ్ల వ్యక్తిగతమైన ప్రాధాన్యత ఇస్తూ ఎలా గెలవాలనే సలహాలు ఇవ్వడం కరెక్టా అని ఫైమాను అడిగారు నాగార్జున. కాదు, బట్ అందరికీ ఇచ్చుకుంటూ వచ్చానని ఫైమా వివరణ ఇస్తుంటే లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. దీంతో ఉంటది కదా సార్ అని ఫైమా చెప్పి తలదించుకున్నట్లయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X