Don't Miss!
- News
తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ సిద్దం - ట్రయిల్ రన్ పూర్తి : ఆ రెండు స్టేషన్ల మధ్య..!!
- Lifestyle
మొదటి నెలల్లో గర్భస్రావం జరగడానికి కారణాలు, ఈ చిట్కాలతో సేఫ్గా ఉండొచ్చు
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Bigg Boss Telugu 6 ఇద్దరమ్మాయిలతో జిమ్, అతనికోసం అంబులెన్స్.. స్టేజిపై వాళ్లు
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ తో ఎమోషనల్ గా సాగుతోంది. ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌజ్ లోకి ఆదిరెడ్డి భార్య కవిత, అతని పాప అద్విత, రాజశేఖర్ అమ్మ ఉమారాణి, రోహిత్ మదర్, శ్రీసత్య తల్లిదండ్రులు, ఫైమా, ఇనయా తల్లి వచ్చి ఇంటి సభ్యులందరిచేత సరదాగా ముచ్చటించారు. అలాగే శ్రీహాన్ లవర్ సిరి హన్మంతు, అతని కొడుకు చైతూ తెగ సందడి చేశారు. చివరిగా రేవంత్ వాళ్ల మదర్ వచ్చి వెళ్లారు. చివరి ఇంటి కెప్టెన్ గా ఇనయా సుల్తానా నిలిచింది. ఇక ప్రతి శని, ఆదివారాలు హోస్ట్ నాగార్జున వచ్చి ఎంటర్టైన చేస్తాడన్న విషయం తెలిసిందే. నవంబర్ 26 శనివారం నాటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు.

ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో 12వ వారం ఇంటి కెప్టెన్ పదవిని పోరాడి గెలుచుకుంది లేడీ టైగర్ ఇనయా సుల్తానా. కెప్టెన్సీ టాస్క్ కోసం బాల్ ఇచ్చి గ్రాబ్ అండ్ రన్ పోటీ పెట్టాడు బిగ్ బాస్. ఈ పోటీలో అందరినీ ఎదుర్కొని చివరిగా కెప్టెన్ అయింది ఇనయా. దీంతో హౌజ్ లో కొత్త రూల్స్ పెట్టింది. రూల్స్ ఏం మార్చట్లేదని, అవే బిగ్ బాస్ రూల్స్ అని చెప్పి చివరి వారం కాబట్టి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా తిందాం, ఫన్ చేద్దామని చెప్పింది కొత్త కెప్టెన్ ఇనయా సుల్తానా.

ఫ్యామిలీ మెంబర్స్ తో ప్రోమో..
ఇక ఎప్పటిలాగే శనివారం ఇంటి సభ్యులను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చారు హోస్ట్ నాగార్జున. ఆయనతోపాటు పలువురు అతిథులను తీసుకొచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ సందడిగా మారనుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మిమ్మల్ని కలవడానికి ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారని చెప్పారు నాగార్జున. దీంతో హౌజ్ కంటెస్టెంట్స్ సంతోషంతో ఎమోషనల్ అయ్యారు.

ఇనయాపై బుల్లెట్ భాస్కర్ జోక్..
రేవంత్ కోసం సింగర్ రోల్ రైడా స్టేజిపైకి వచ్చాడు. ఏ చిఛా ఎట్లున్నవ్ అని అడిగాడు రోల్ రైడా. తర్వాత శివబాలాజీతో మీరు చాలా అందంగా ఉన్నారని ఇనయా అంటే.. ఇందాక సోహెల్ కి కూడా ఇదేగా చెప్పావని నాగార్జున అన్నాడు. దీంతో శివబాలాజీ షాక్ అయ్యాడు. తర్వాత ఫైమా కోసం వచ్చిన బుల్లెట్ భాస్కర్.. ఆ ఇనయాను ఎలా భరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదని.. వీధిలో 10 టీవీలు ఉంటే ఆమె మాట్లాడుతున్నప్పుడు 9 మ్యూట్ లో పెడతారని అన్నాడు.

ఇద్దరమ్మాయిలతో జిమ్ చేస్తాడు..
అనంతరం ఇనయా కోసం సోహెల్ అండ్ ఆమె కుటుంబ సభ్యుడు వచ్చినట్లు తెలుస్తోంది. మణికొండ నుంచి ఎందుకు షిఫ్ట్ అయ్యారు, ఎందుకు జిమ్ లో జాయినట్టు అని సోహెల్ అడిగితే తెగ నవ్వేసింది ఇనయా. సోహెల్ ఎందుకు మానేసిందో కనుక్కోండి అనగానే సోహెల్ ఇద్దరమ్మాయిలతో జిమ్ చేస్తాడు అంటూ ఏదో చెప్పబోయింది ఇనయా. దీంతో షాక్ అయి సోహెల్ ఆ విషయాన్ని మధ్యలోనే ఆపేసి.. నన్ను ఏం చేద్దాంమనుకుంటున్నావ్.. అంటూ కామెడీ చేశాడు.

మీకోసమే అంబులెన్స్ పెట్టారు..
ఇక ఫైమా కోసం బుల్లెట్ భాస్కర్ తోపాటు ఆమె సోదరి సల్మా వచ్చింది. ఫైమా అందరూ బాగున్నారా అని నొక్కి నొక్కి రెండు సార్లు అడిగింది.దీంతో అందరూ బాగున్నారు.. వాడు కూడా బాగున్నాడు అని చెప్పాడు భాస్కర్. తర్వాత రేవంత్ గురించి మాట్లాడుతూ మీరాడుతుంటే జల్లికట్టు అవుతుందేమో అనిపిస్తుంది. బిగ్ బాస్ పక్కన మీకోసమే ఒక అంబులెన్స్ రెడీగా పెట్టారు అని జోక్ వేశాడు.
శ్రీహాన్ లవ్ స్టోరీ తెలుసా..
శ్రీహాన్ కోసం శివ బాలాజీ, శ్రీహాన్ తండ్రి వచ్చారు. శ్రీహాన్ లవ్ స్టోరీ తెలుసా అని వాళ్ల నాన్నను అడిగారు నాగార్జున. దానికి ఆయన తెలుసన్నారు. తర్వాత కూకట్ పల్లి అమ్మాయి అంటూ నాగార్జున కామెడీ చేశారు. రేవంత్ కోసం రోల్ రైడాతోపాటు వాళ్ల అన్నయ్య కూడా వచ్చారు. రేవంత్ బ్రదర్ చాలా స్ట్రాంగ్ ఉండటంతో నువ్ లోపల ఉండుంటే వాళ్లంతా ఏమై ఉండేవారో అని నాగార్జున అన్నారు. దీంతో హౌజ్ మేట్స్ అంతా నవ్వేశారు. ఇలా సరదాగా సాగింది ఇవాళ్టీ ఎపిసోడ్ ప్రోమో.