Bigg Boss Telugu 6: కంటెస్టెంట్స్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే.. శ్రీహన్ కంటే ఆ ఇద్దరికి ఎక్కువే!
కాంట్రవర్సీ రియాలిటీ షో బిగ్ బాస్ ఆదివారం రోజు గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్టింగ్ ద్వారా కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎంతో ఉల్లాసంగా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక అసలైన యుద్ధాలు మొదలు కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఇక ప్రతి ఒక్కరు కూడా తాము గెలుస్తాము అనే ధీమాతోనే అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఒక్క రోజుకు బిగ్ బాస్ ద్వారా కంటెస్టెంట్స్ ఎంత ఆదాయాన్ని అందుకుంటున్నారు అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒక్కొక్కరు రోజుకు ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అనే వివరాల్లోకి వెళితే..

ఏ రేంజ్ లో ఇస్తున్నారంటే..
బిగ్ బాస్ పై మొదటి నుంచి కూడా అంచనాల భారీగానే పెరుగుతూ ఉన్నాయి. ఇక 6వ సీజన్ కూడా ఈసారి మంచి సక్సెస్ అయ్యేలా ఉంది. అందుకే కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో నిర్వాహకులు విభిన్నంగా ఆలోచించారు. ఇక కంటెస్టెంట్లలో కొందరికి అతి తక్కువగా ఒక్క రోజుకు రూ. 15 వేలు ఇస్తుండగా.. అత్యధికంగా ఒక్క రోజుకు 60 వేలు ఇస్తున్నట్లు సమాచారం.

అందరికంటే తక్కువ..
ఇక అతి తక్కువ పారితోషికం నుంచి చూసుకుంటే ముందుగా ఇనయా, ఆరోహి వీళ్ళిద్దరికీ కూడా 15 వేల నుంచి 20 వేల వరకు పారితోషం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అందరికంటే తక్కువగా అయితే ఇనాయా అందుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాత అభినయ 20 వేల వరకు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే తరహాలో రాజశేఖర్ కూడా రోజుకు 20 వేలు అందుకుంటున్నట్లు టాక్.

ఆది రెడ్డి, వాసంతి
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు అందుకున్న సుదీప పింకీ ఒక్క రోజుకు 20 వేలు డిమాండ్ చేసిందట. ఇక ఆ తర్వాత గీతు కూడా దాదాపు 25 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక జబర్దస్త్ కమెడియన్ ఫైమా, వాసంతి కూడా అదే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరి కంటే ఎక్కువగా ఆదికి 30 వేలు ఇస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది.

వీళ్ళకు ఎంతంటే
ఇక గ్లామరస్ బ్యూటీ శ్రీ సత్య కూడా 30 వేలు తీసుకుంటూ ఉండగా కోకో ప్లేయర్ అలాగే నటుడు సాల్మన్ 30 వేలు తీసుకుంటున్నట్లు టాక్. ఇక వీరి కంటే ఇంకాస్త ఎక్కువగా లవర్ బాయ్ అర్జున్ అలాగే బ్యూటిఫుల్ గర్ల్ కీర్తి కి కూడా 35 వేల వరకు ఒకరోజు పేమెంట్ గా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అదే తరహాలో మరియానాకు కూడా 35 వేలు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

సీనియర్ నటుడికి ఎంతంటే?
ఇక ఆర్జే మిమిక్రీ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు అందుకున్న సూర్య 40 వేలు అందుకుంటూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక విధంగా అతనికి అంత డిమాండ్ ఉంది అని చెప్పవచ్చు. ఇక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ బాలాజీ 45 వేలు డిమాండ్ చేసినట్లు లాక్ అయితే వస్తోంది. ఇక మరో హ్యాండ్సమ్ బాయ్ రోహిత్ కూడా అదే తరహాలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

టాప్ రెమ్యూనరేషన్స్
ఇక ఈసారి మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ లో ఎక్కువగా అందరి ఫోకస్ అయితే యూట్యూబర్ శ్రీహన్ పైనే పడింది. సిరి బాయ్ ఫ్రెండ్ కావడంతో అతనికి మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక అతనికి ఒక్కరోజు కూడా 50 వేలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అతని కంటే చలాకి చంటి ఇంకాస్త ఎక్కువగా తీసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక అందరికంటే ఎక్కువగా మాత్రం సింగర్ రేవంత్ ఒక్క రోజుకు 60 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











