Bigg Boss Telugu 6: ఆ అమ్మాయితో రోహిత్ క్లోజ్.. తట్టుకోలేకపోయినా మెరినా.. చెత్త ప్లాన్!

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి స్పెషల్ కపుల్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన మెరీనా రోహిత్ ఇద్దరూ కూడా ఎంట్రీ ఇవ్వడంతోనే హౌస్ లో చాలా బాగా హైలైట్ అయ్యారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతారు అని కూడా మొదట్లోనే అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. కానీ పరిస్థితులు మారుతున్న కొద్ది ఇద్దరు కూడా ప్రవర్తిస్తున్న తీరు మాత్రం చిరాకు తెప్పిస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా రోహిత్ మెరినా అమ్మాయి క్లోజ్ గా ఉండడం ఆ తర్వాత మెరీనా ఏడ్వడం ఇదంతా ఒక డ్రామాల కొనసాగిపోయింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఒక నిర్వాకం ప్రేక్షకులకు మరింత చిరాకు తెప్పించింది ఆ వివరాల్లోకి వెళితే..

క్లారిటీ లేదు

క్లారిటీ లేదు

బిగ్ బాస్ 6వ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భిన్నమైన టాలెంట్ తోనే అడుగుపెట్టారు అయితే అందులో సెలబ్రిటీ కపుల్ గా వచ్చిన మెరీనా రోహిత్ కూడా ఏదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా వారి మధ్య కెమిస్ట్రీ కూడా ఇందులో హైలెట్ అవుతుంది అని అనుకుంటే అసలు ఇద్దరి మధ్యలో ఒక క్లారిటీ లేదు అనే తరహాలో ప్రవర్తిస్తున్నారు.

అనవసరంగా గొడవలు

అనవసరంగా గొడవలు


అర్థం లేని విషయాలలో అనవసరంగా మెరీనా అలుగుతుంది అని ఆ తర్వాత భార్య పరిస్థితిని కూడా అర్థం చేసుకోకుండా రోహిత్ కూడా అలానే కొనసాగుతూ ఉండడం వారికే అంత పెద్ద మైనస్ గా మారింది. వచ్చిన మొదట్లోనే సరిగ్గా మాట్లాడటం లేదు అని నేను ఇది చెబుతున్నా కూడా పట్టించుకోవడం లేదు అని మెరీనా అనవసరమైన గొడవలను లేవనెత్తింది.

 ఆమెతో లింక్

ఆమెతో లింక్

ఇక గురువారం ఎపిసోడ్లో వీరి మధ్యన కొనసాగిన ఒక వ్యవహారం అయితే మరింత చిరాకు తెప్పించేలా కామెంట్స్ అందుకుంది. ముఖ్యంగా రోహిత్ అయితే తనతో మాట్లాడటం లేదు అని కొద్దిసేపు వరకు మెరినా హల్చల్ చేసింది. అంతేకాకుండా తనతో కాకుండా శ్రీ సత్య తో క్లోజ్ గా ఉంటున్నాడు అనే విధంగా ఆమెతోనే వాకింగ్ చేస్తున్నాడు అని నా భర్తతో నేను ఉండొద్దా అంటూ తనలోనే ఆ విషయాన్ని చూపించింది.

వీరి డ్రామా ఏంటి బాబోయ్

వీరి డ్రామా ఏంటి బాబోయ్

అయితే మెరీనా రోహిత్ మధ్యలో కొనసాగుతున్న సంభాషణ పై మిగతా కంటెస్టెంట్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. వీరి డ్రామా ఏంటి బాబోయ్ అన్నంతల అవమానాలు చూపించారు. నాతో కొద్దిసేపు కూడా రోహిత్ వాకింగ్ చేయడం లేదు అని.. నా భర్తతో నేను వాకింగ్ చేసే హక్కు లేదా శ్రీ సత్యతో ఉండడం ఏమిటి అన్నట్లు మెరీనా ఏదో మాట్లాడేసింది. కొద్దిసేపటి వరకు కొందరు సైలెంట్ అయిపోయారు.

ఇలా చేస్తే తొందరలోనే..

ఇలా చేస్తే తొందరలోనే..

అయితే వీరిది ప్రాంక్ అని కొందరు అప్పుడే గుర్తుపట్టేశారు. ఆ తర్వాత ఫోకస్ అవడం కోసమే అలా చేసిమట్లు రోహిత్ మెరీనా కూడా ఈజీగా బయటపడడంతో ఆడియన్స్ కు మరింత చిరాకు తెప్పించింది. సోషల్ మీడియాలో కూడా వీరిపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇలా చేస్తే తొందరలోనే బయటకు వెళ్లిపోతారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. డ్రామాలపై కాకుండా ముందు ఆటపై దృష్టి పెడితే మంచిది అంటూ లేదంటే మొదటి రెండు మూడు వారాల్లోనే బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X