Bigg Boss Telugu 6: గీతూ ఎలిమినేషన్ వెనుక కీ ప్లాన్.. వారికి డేంజరస్ వార్నింగ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైన విధానమే ఆడియెన్స్ కు పెద్దగా నచ్చలేదు. ఈసారి కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో బిగ్ బాస్ మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో విఫలమైందని కామెంట్స్ వచ్చాయి. కంటెస్టెంట్స్ వారి టాలెంట్ కు తగ్గట్లుగా హౌస్ లో గేమ్ ఆడలేకపోయారు. ఇక రీసెంట్ గా గీతూ ఎలిమినేట్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆమెను హౌస్ లో నుంచి పంపడం వెనక ఒక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మిగతా కొందరికి బిగ్ బాస్ ఎలిమినేషన్ ద్వారా హెచ్చరికలు కూడా పంపినట్లు అర్థమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

బ్యాలెన్స్ చేసుకుంటూ
బిగ్ బాస్ లో పరిస్థితి ఎలా ఉన్నా సరే బలంగా పోరాడుతూ గెలుస్తూ ఉండాలి. అంతే కాకుండా మరొకవైపు ఆడియన్స్ నుంచి కూడా సపోర్ట్ కూడా అందుకునే విధంగా గేమ్ ఆడుతూ ఉండాలి. అన్ని వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ వెలితేనే హౌస్ లో ఫైనల్స్ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఆ తరహాలో గేమ్ ఆడుతున్న వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది.

ఆమెను పంపేసి..
గీతూ రాయల్ వెళ్లిపోవడానికి ప్రధాన కారణం ఆమె అతి తెలివి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ రూల్స్ ను బ్రేక్ చేసి.. బుద్ధి బలం అని తనకు తానే టాలెంట్ అని హడావుడి చేసింది. అయితే రేటింగ్స్ బాగానే వస్తున్నాయని బిగ్ బాస్ మౌనంగా ఉన్నాడేమో అని అందరు అనుకున్నారు. కానీ ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఆమెను బయటకు వెళ్లిపోయేలా చేసి బిగ్ బాస్ రూల్స్ ను కాపాడాడు.

కెమెరా ముందు హైలెట్
కంటెస్టెంట్స్ హౌస్ లో పరిస్థితులను బట్టి ఒకసారి విలన్స్ కావచ్చు మరోసారి హీరోలు కావచ్చు. ఎలా ఉన్నా కూడా వారికంటూ ఒక గుర్తింపును అందుకోవాలి. కానీ ఈసారి అలా ఎవరు కనిపించలేదు. ఇక బిగ్ బాస్ లో రూల్స్ బ్రేక్ చేసినా కూడా బిగ్ బాస్ పట్టించుకోవడం లేదు ఏమిటి అని నెటిజన్స్ నుంచి ఒక రేంజ్ లో విమర్శలు వచ్చాయి. అయితే గీతూ కూడా కెమెరా ముందు హైలెట్ అయ్యేందుకే ప్రయత్నం చేసింది కానీ గేమ్ పై మాత్రం పట్టు సాధించింది లేదు.

రేటింగ్స్ పై కూడా
బిగ్ బాస్ ఒక విధంగా గీతును ఎలిమినేట్ చేయడానికి మరో ప్రధానం కారణం.. రేటింగ్స్ ఆమె కారణంగా తగ్గుతున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ లో గీతూ ఇష్టానుసారంగా ఉండడం వలన ఆడియెన్స్ ఇక బిగ్ బాస్ చూడము అనే రేంజ్ లో కామెంట్స్ చేశారు. ఇక ఆ ప్రభావం ఆమె ఓట్ల పై పడడమే కాకుండా రేటింగ్స్ పై కూడా గట్టిగానే పడ్డాయి.

వాళ్ళకు హెచ్చరిక
ఇక గీతూ టాప్ 5లో ఒకరిగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె తన గోతి తనే తొవ్వుకుంది. ఇక హౌస్ లో నుంచి గీతూని పంపించడం కొందరికి హెచ్చరిక లాంటిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇనయా సుల్తానా కూడా కొన్నిసార్లు ఆమె తరహాలోనే ప్రవర్తిస్తుంది అనే టాక్ వచ్చింది. ఇక శ్రీ సత్య, కీర్తి కూడా గీతూ నుంచి పాటలు నెరవహుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బిగ్ బాస్ అయితే ఎంత బలమైన కంటెస్టెంట్ అయినా కూడా క్షమించేది లేదని తేల్చేశాడు. మరి ఆమె ఎలిమినేషన్ మిగతా వారికి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











