Bigg Boss Telugu 6: నువ్ మగాడివేనా? ఇనయ-శ్రీహాన్ మధ్య 'పిట్ట' లొల్లి.. మధ్యలోకి దూరిన గీతూ..

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో కంటెస్టెంట్ల ప్రవర్తన గొడవ పెట్టుకునేందుకే అన్నట్లుగా మారింది. ఇక మూడో వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌజ్ మేట్స్ ఆడిన అడవిలో ఆట రచ్చ రంభోళ అన్నట్లు జరిగింది. ఈ టాస్క్ లో.. పోలీసుల టీమ్ నుంచి ఆది రెడ్డి, ఫైమా.. దొంగల టీమ్ నుంచి శ్రీహాన్ తో పాటు శ్రీసత్య, గీతూ రాయల్ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. వీరికి రెండు దశల్లో బ్రిక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకు సంచాలకుడిగా సింగర్ రేవంత్ ను నియమించారు. ఈ టాస్క్ లో మళ్లీ రచ్చ నెలకొంది. ఈ క్రమంలోనే ఇనయ, శ్రీహాన్ మధ్య పెద్ద గొడవే జరిగింది.

 బ్రిక్స్ టాస్క్..

బ్రిక్స్ టాస్క్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో మూడో వారం కెప్టెన్సీ ఎంపికలో భాగంగా గీతూ రాయల్, శ్రీ సత్య, ఆది రెడ్డి, ఫైమా, శ్రీహాన్ కెప్టెన్సీ పోటీదారులుగా సెలెక్ట్ అయ్యారు. ఇక వీరికి రెండు లెవెల్స్ లో బ్రిక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బ్రిక్స్ ను పేర్చడం.. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్స్ వాటిని కూల్చే ప్రయత్నం చేస్తే కాపాడుకోవడం వంటి రెండు దశలు ఉన్నాయి. ఇక టాస్క్ మొదలవ్వగానే గీతూ రాయల్ బ్రిక్స్ పరిగెత్తుకుంటూ వచ్చి పెట్టడానికి బదులు.. అక్కడి నుంచే విసిరియడంతో డిస్ క్వాలీఫై చేశాడు సంచాలక్ రేవంత్.

చేతులు తగలడంతో..

చేతులు తగలడంతో..


దీంతో బ్రిక్స్ ను పేర్చడంలో శ్రీ సత్య, ఆది రెడ్డి, శ్రీహాన్, ఫైమా సక్సెస్ అయి సెకండ్ ఫేజ్ కు వెళ్లారు. బ్రిక్స్ ను కాపాడుకునే క్రమంలో ఫైమా చేతులు బ్రిక్స్ కి తగలడంతో ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు రేవంత్. ఈ విషయంలో కొద్దిసేపు మాటల వారే జరిగింది. అది కాపాడుకునే ప్రయత్నంలో బ్రిక్స్ కు చేయి తగిలిందని ఫైమా.. చేత్తో బ్రిక్స్ ను జరిపావని రేవంత్ వాదించుకున్నారు. అలా కాపాడుకునేటప్పుడు నీకు తప్పు ఇంకెవరికీ అలా జరగలేదని రేవంత్ అన్నాడు.

ఏ పిట్ట వచ్చినా..

ఏ పిట్ట వచ్చినా..


దీంతో ఇనయ సుల్తానా వచ్చి శ్రీహాన్ చేతి కూడా బ్రిక్స్ కు తగిలిందని సంచాలక్ అయిన రేవంత్ కు చెబుతుంది. కానీ దాన్ని ఒప్పుకోడు రేవంత్. అయితే ఇంతలోనే వచ్చిన శ్రీహాన్.. 'ఏ పిట్ట నీ దగ్గరికి వచ్చి ఏం కూసిన సంచాలక్ గా నీ నిర్ణయం నువ్ తీసుకో' అని అన్నాడు. పిట్ట అని మాట విన్న ఇనయ.. తెగ రచ్చ చేసేసింది. పిట్ట అని ఎలా అంటావ్.. అంటూ శ్రీహాన పై ఫైర్ అయింది. తర్వాత శ్రీహాన్ కూడా 'నేను నిన్ను అనలేదు.. నీ పేరు పెట్టలేదు' అంటూ గట్టిగానే వాదనకు దిగుతాడు.

మధ్యలోకి దూరిన గీతూ..

మధ్యలోకి దూరిన గీతూ..

తర్వాత మిగతా హౌజ్ మేట్స్ శ్రీహాన్ ను పక్కకు తీసుకుపోతారు. బ్యాడ్ అవ్వకు అని శ్రీహాన్ తో నేహా అనడంతో కామ్ అయిపోతాడు శ్రీహాన్. కానీ ఇనయ మాత్రం పిట్ట అని ఎలా అంటావ్ అంటూ గొడవకు దిగుతూనే ఉంటుంది. మధ్యలో గీతూ రాయల్ దూరి ఆ పిట్ట అని తననే అన్నాడు అనుకుంటూ రెచ్చిపోతుంది. ఇనయపై ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకుంటుంది గీతూ రాయల్. ఏమైన ఒక అమ్మాయిని అలా అనడం, దాన్ని మరో అమ్మాయి అయినా గీతూ రాయల్ సపోర్ట్ చేయడం, మిగతా లేడీ కంటెస్టెంట్లు జోకులు వేసుకోవడం సరిగ్గా అనిపించలేదు.

ఫైమా కోసమే..

ఫైమా కోసమే..

ఇనయ మాత్రం శ్రీహాన్ వెంట పడుతూ మరీ వాదనకు దిగుతుంది. దీంతో శ్రీహాన్ పరుగెడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే నిన్ను వాడు అని ఒప్పుకోనివాడివి నన్ను పిట్ట అని ఎలా అంటావ్.. మగాడివేనా? అని ఏదో మాట జారుతుంది ఇనయ. ఈ ఫైట్ అంతా ఫైమా కోసం చేసింది ఇనయ. ఇక మరోవైపు పిట్ట అంటే తప్పా? మిగతా ఎవరు రియాక్ట్ కాలేదు.. ఈమె ఎందుకు అవుతుంది.. అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు శ్రీహాన్. నిజానికి కెప్టెన్సీ టాస్క్ అడవిలో ఆట గేమ్ లో ఇనయ పోలీసుల బృందంలో బాగానే ఆట ఆడింది.

 వ్యతిరేకతతోనే..

వ్యతిరేకతతోనే..

కానీ హౌజ్ లో ఆమెకు వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు బెస్ట్ పర్ఫార్మర్లుగా ఆది రెడ్డి, ఫైమాను ఎంపిక చేశారు. ఇనయను పిట్ట అని అనడాన్ని మిగతా లేడీ కంటెస్టెంట్లు సైతం జోకులు వేసుకుంటూ శ్రీహాన్ కు మద్దతు ఇవ్వడంతోనే తెలుస్తుంది ఇనయకు ఎలాంటి వ్యతిరేకత ఉందో అని. కాగా ఇనయను పిట్ట అని శ్రీహాన్ హేళనగా మాట్లాడటం, సంచాలక్ గా ఉన్న రేవంత్ సరిగ్గా చూడకపోగా శ్రీహాన వద్దకు వెళ్లి.. బిక్ర్స్ టచ్ చేశావా అని అతన్నే అడిగి నిర్ణయం తీసుకోవడం, ఇనయ వచ్చి రేవంత్ కు చెప్పిన దానిని ఒప్పుకోకపోవడం కరెక్ట్ కాదనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X