Bigg Boss Telugu 6: నామినేషన్స్ లో స్నేహితుల మధ్య గొడవలు.. శ్రీహాన్ డ్రామాలపై కీర్తి కౌంటర్!
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా మరింత ఆసక్తికరంగా కొనసాగబోతున్నట్లు బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేసాడు. మొహం మీద రంగు నీళ్ళు కొట్టి ఇంట్లో నుంచి బయటకు పంపించే కంటెస్టెంట్ గురించి తగిన కారణాలు చెప్పాలి అని బిగ్ బాస్ తెలియజేశారు. ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా పోటాపోటీగా నామినేషన్ చేస్తూ ప్రత్యర్థుల పొరపాట్ల గురించి గట్టిగానే వాదిస్తున్నారు. ఇక 64 రోజు టాప్ కంటెస్టెంట్స్ మధ్య కూడా వివాదాలు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ హైలెట్స్ లోకి వెళితే..

శ్రీహన్ వర్సెస్ బాలదిత్యా
బాలాదిత్య అలాగే శ్రీహాన్ మధ్యలో మరోసారి గొడవ మరింత ముదిరింది. ఒకరిని వరస్ట్ గా నామినేట్ చేస్తున్నప్పుడు నీకన్నా బెటర్ గా ట్రై చేసిన పాయింట్ ఉన్నప్పుడు ఎలా నామినేట్ చేస్తావు? అనే విషయంలో బాలాదిత్య వాదించాడు. అయితే నన్ను నేను నామినేట్ చేసుకుంటే బిగ్ బాస్ ఒప్పుకుంటాడా? నువ్వు అనేది ఎలా ఉందంటే? నిన్ను చేసే బదులు నన్ను నేను నామినేట్ చేసుంటే బాగుండేది అని అంటున్నావు.. అని శ్రీహాన్ కూడా అతనికి కౌంటర్ ఇచ్చాడు.

రాజశేఖర్ ఇనయా గొడవ
ఇక రాజశేఖర్ ఇనయా మధ్యలో మరోసారి నామినేషన్స్ గొడవ తీవ్రంగా మారుతుంది. గతంలోనే వీరిద్దరూ టాస్క్ లో చాలా గొడవపడ్డారు. ఇక ఇప్పుడు రాజశేఖర్ ఆమెను నామినేట్ చేస్తూ అసలు లాస్ట్ టైం మనం అనుకున్న డిసిషన్ లో దొంగతనం చేయొద్దని అనుకున్నప్పటికీ కూడా నువ్వు మాట వినకుండా తప్పు చేయడం కరెక్ట్ కాదు అని రాజశేఖర్ వాదించాడు. ఇక అసలు పాయింట్ రా అంటూ ఇనయా అతన్ని గట్టిగానే ప్రశ్నించింది.

నాకు తప్పు అనిపించింది
సూటిగా నాకు తప్పు అనిపించింది మాట్లాడుతున్నాను అంటూ రాజశేఖర్ ఇనయా మాటలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. వాళ్లు వెళ్లిపోతారు నువ్వు కూడా వెళ్ళిపోతావా అంటూ రాజశేఖర్ కూడా ఒక వివరణ ఇచ్చాడు. ఇక శ్రీహన్ అయితే కీర్తిని నామినేట్ చేస్తూ ఇక ఒక విషయం గురించి ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు దాన్ని తప్పు అనడం కరెక్ట్ కాదు అని గతంలో జరిగిన పొరపాట్ల గురించి ఆమెకు కౌంటర్ ఇచ్చాడు.

డ్రామా క్రియేట్ చేస్తున్నావు
అందుకు కీర్తి ఈ ఆటలో నీ ఒపీనియన్ నీది నా ఒపీనియన్ నాది అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చింది. అయితే నువ్వు పైకి ఒకలాగా లోపల మరొక లాగా కనిపిస్తావని పైకి నవ్వుతూ డ్రామా క్రియేట్ చేస్తున్నావు అని కీర్తి మరింతగా అతనికి సమాధానం ఇచ్చింది. అలాగే సుల్తానా ఫైమా మాట్లాడిన విధానం నచ్చలేదు అని ఆమెను నామినిట్ చేసింది.

నువ్వంటే చిరాకు వేస్తోంది
ఇక ఫైమా ఆమె ఫేక్ అంటూ ఇనాయతో గట్టిగా వాదించింది. అంతేకాకుండా వెనక మాట్లాడే దానివి నువ్వు అని మీ యాక్టింగ్ కి దండం అని కూడా చెప్పింది. అసలు న్ ఈ హౌస్ కు అంటేనే నచ్చదు.. నువ్వంటే చిరాకు వేస్తోంది అని ఫైమా దండం పెట్టుకుంటూ వెళ్లిపోయింది. ఇక ఆమె అలా మాట్లాడుతుంటే ఇనయా కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. ఇనయా ఒరిజినల్ అంటూ ఎవరికి భయపడదు అని నువ్వు వెనకాల ఉండి మాట్లాడుతావు అని సమాధానం ఇచ్చింది. మరి ఈ గొడవలతో బిగ్ బాస్ లో ఎలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











