twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: అలాంటి బాధితుల్లో నేను ఎక్కువగా ఉన్నాను.. మరోసారి రేవంత్ సీరియస్

    |

    బిగ్ బాస్ లో నామినేషన్స్ గొడవ మొదలైంది. బలమైన కంటెస్టెంట్స్ గా ఉన్నవారు ఒకప్పుడు నామినేషన్ లో ఉన్నా కూడా పెద్దగా భయపడే వారు కాదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఏ మాత్రం పక్షపాతం చూపకండా బలమైన కంటెస్టెంట్స్ అయినా సరే ఓట్లు తక్కువగా వస్తే వెంటనే ఏలిమినేట్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అలెర్ట్ అవుతున్నారు. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే..

    నా ఇష్టం వచ్చినట్లు

    నా ఇష్టం వచ్చినట్లు

    రాజశేఖర్ ఇనయాను నామినేట్ చేశాడు. ఇక ఇనయా వాసంతి ఫ్రెండ్ అని అతను మరోసారి హైలెట్ చేశాడు. ఆమెను నామినెట్ చేస్తే ఎందుకు అరుస్తావు అని అన్నాడు. ఇక అందుకు ఇనయా నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను అని సమాధానం ఇచ్చింది. ఇక నువ్వు చెబితే ఇష్టం వచ్చినట్లు సొల్లు మాట్లాడితే మేము వినాలా అని రాజశేఖర్ కూడా కౌంటర్ ఇచ్చాడు.

     కాస్త జాగ్రత్తగా మాట్లాడు

    కాస్త జాగ్రత్తగా మాట్లాడు

    ఇక మరోసారి శ్రీసత్య ఇనయాను నామినేట్ చేస్తూ నెక్స్ట్ కొంచెం మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడు అని హెచ్చరించింది. ఇక రోహిత్ అయితే ఆదిరెడ్డి ని నామినేట్ చేస్తూ ఫెయిర్ గేమ్ గురించి మాట్లాడారు. ఇక ఇటీవల జరిగిన టాస్క్ లో ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతున్నాను అని రోహిత్ అన్నాడు. వీరిమధ్య కూడా పాత గొడవలు భగ్గుమన్నాయి.

     నేనే ఎక్కువగా

    నేనే ఎక్కువగా

    ఇక రేవంత్ ను మరోసారి టార్గెట్ చేసిన రోహిత్ నీ ఆట విషయంలో న్యాయంగా లేవని అనడంతో నేనైతే ప్రతీ విషయంలో జస్టిస్ చేశాను అనుకుంటున్నట్లు రేవంత్ అన్నాడు. ఇక మెరీనా మరొక విషయాన్ని చెప్పింది. ఆటలో కొంత కన్ఫ్యూజన్ ఉందని కూడా చెప్పింది ఇక రేవంత్ రోహిత్ ను నామినేట్ చేస్తూ తన ప్రతీకారం తీర్చుకున్నాడు. హౌస్ లో ప్రతి చిన్న విషయానికి నామినేట్ చేస్తున్నారు అని ఆ విధంగా నామినేట్ అయిన బాధితులలో నేనే ఎక్కువగా ఉన్నాను అని రేవంత్ చెప్పుకొచ్చాడు.

     శ్రీసత్య vs కీర్తి

    శ్రీసత్య vs కీర్తి

    ఇక శ్రీ సత్య అలాగే కీర్తి మధ్యలో మరోసారి గట్టిగానే మాటలు యుద్ధం కొనసాగింది. ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యే ముందు పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా శ్రీ సత్య చెప్పింది. నీకు ఈగో ఎక్కువ అని అన్నప్పుడు మీనింగ్ వేరేది వస్తుంది అని ఆ విధంగా నువ్వు బోడ్ ఇచ్చే ముందు పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అని శ్రీ సత్య ప్రశ్నించింది. అయితే అన్ని కౌంట్ అవుతాయి అని కూడా కీర్తి వివరణ ఇచ్చింది.

    అంత సీన్ లేదు..

    అంత సీన్ లేదు..

    అయితే నామినేషన్ కాబట్టి మళ్ళీ నేను నామినేట్ చేశాను అని చెప్పకు అని శ్రీ సత్య అన్నప్పుడు అంత సీన్ లేదు.. అని కీర్తి మరొక విధంగా మాట్లాడింది. ఇక ఏమన్నావు? ఏమన్నావు? అంటూ శ్రీ సత్య అనడంతో.. నాకు అంత సీన్ లేదు అని నేనే అనుకున్నట్లుగా ఆమె చెప్పడంతో సరే ఏదైనా సరే క్లారిటీగా చెప్పు అని శ్రీ సత్య వివరణ ఇచ్చింది. మరి వీరి మధ్యలో గొడవలు బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తాయో చూడాలి.

    English summary
    Bigg boss telugu 6 day 71 highlights revanth once again serious
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X