twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: అవే తగ్గించుకుంటే మంచిది.. అలాంటి పనులు చేయకు: శ్రీసత్య తండ్రి

    |

    బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉండడంతో ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి తల్లిదండ్రులను చూసి చాలా ఎమోషనల్ అవుతున్నారు. మరి కొందరు వారి సన్నిహితులు వస్తున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం రోజు శ్రీ సత్య తల్లిదండ్రుల హౌస్ లోకి వచ్చారు. అయితే శ్రీ సత్య తండ్రి ఊహించిన విధంగా తన కూతురుపై కామెంట్ చేశారు. కొన్ని పరిస్థితులలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మరికొన్ని విషయాలలో కొన్ని తగ్గించుకుంటే మంచిది అని కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలలోకి వెళితే..

    శ్రీ సత్య ఎమోషనల్

    శ్రీ సత్య ఎమోషనల్

    శ్రీ సత్య తల్లి నడవలేని పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆమె తండ్రిని తీసుకొని రావడంతో బిగ్ బాస్ మొదట కంటెస్టెంట్స్ అందరిని ఫ్రీజ్ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత శ్రీ సత్య ఎమోషనల్ అవుతూ కౌగిలించుకుంది. మొదట శ్రీ సత్య తల్లి పాదాలకు నమస్కరిస్తూ అందరూ కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇక ఆమె వీల్ చేయిర్ ను పట్టుకొని మెట్ల పైకి ఎక్కిస్తూ హెల్ప్ చేశారు.

    పనిమనిషిని కూడా మాన్పిచ్చేస్తాను

    పనిమనిషిని కూడా మాన్పిచ్చేస్తాను

    ఇక శ్రీ సత్య హౌస్ లో చాలా బాగా పనిచేస్తుంది. ఇక ఇంట్లో మాత్రం పెద్దగా పనిచేయదు.. ఇంటికి వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా నువ్వే చేయాలి. పనిమనిషిని కూడా మాన్పిచ్చేస్తాను అని శ్రీ సత్య తండ్రి సరదాగా వివరణ ఇచ్చారు. ఇక తల్లిదండ్రుల సంక్షేమం గురించి తెలుసుకున్న శ్రీ సత్య తాను గేమ్ బాగా ఆడుతున్నానా అని కూడా రివ్యూలు తీసుకుంది.

    తప్పకుండా మార్చుకోవాలి

    తప్పకుండా మార్చుకోవాలి

    అయితే కొన్ని మాత్రం తప్పకుండా మార్చుకోవాలి అని శ్రీ సత్య తండ్రి పదేపదే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కోపం అనేది తగ్గించుకోవాలి అని అంతేకాకుండా నాగార్జున సార్ చెప్పింది కూడా తప్పకుండా వినాలి అని అన్నారు. అంతేకాకుండా కోపంతో పాటు వెటకారం కూడా చాలా ఎక్కువగా ఉంది అని అది కూడా తగ్గించుకొవాలి అని ఆయన అన్నారు. అంతే కాకుండా ఊగడాలు ఇలాంటివి కూడా తగ్గించుకోవాలి అని ఇంతవరకు ఎంత పొలైట్ గా ఉండే దానివి అని ఆయన క్లాస్ తీసుకున్నారు.

    కప్ కొట్టాలి

    కప్ కొట్టాలి

    అసలు మొదటి మూడు వారాల్లో కూడా నువ్వు చాలా బాగా గేమ్ ఆడావు. ఆ తర్వాత నుంచి అనవసరంగా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నావని ముఖ్యంగా కొన్ని అనవసరమైన వాదనలు కూడా మార్చుకోవాలి అని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా చాలా మార్చుకుంటే బావుంటుంది అంటూ గెలిచి తీరాలని.. కప్పు కొట్టడం అనేది తమ కోరిక అని శ్రీ సత్య తల్లిదండ్రులు ఎంతో స్ఫూర్తిగా తెలియజేశారు.

    పిచ్చిపిచ్చి నామినేషన్స్ వద్దు

    పిచ్చిపిచ్చి నామినేషన్స్ వద్దు

    అయితే శ్రీ సత్య అంత ఎత్తుకు ఎదుగుతుంది అనుకోలేదు అని ఏదో నార్మల్ శ్రీ అని అనుకున్నాను అని ఆమె తండ్రి మరింత ఎమోషనల్ గా మాట్లాడారు. అంతేకాకుండా ఇప్పుడు నీకు హౌస్ లో చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారని కూడా శ్రీ సత్య తల్లిదండ్రులు తెలియజేశారు. అయితే నువ్వు కూడా మొదట కొన్ని పిచ్చిపిచ్చి నామినేషన్స్ ఇస్తున్నావు అని శ్రీ సత్య తండ్రి అన్నారు. ఎవరైనా సరే పాయింట్స్ పట్టుకుని నామినేషన్ చేయాలి అని కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఇక తల్లిదండ్రులు వెళ్లిపోయే క్రమంలో శ్రీసత్య చాలా ఎమోషనల్ అయ్యింది.

    English summary
    Bigg boss telugu 6 day 80 sri satya father shocking comments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X