Don't Miss!
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Finance
Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి..!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Bigg Boss Telugu 6: అలా వేలు చూపించడంతో రేవంత్ ఆగ్రహం.. పరువు పోయేలా ఫైమా కౌంటర్లు
ఈవారం బిగ్ బాస్ నామినేషన్స్ కూడా చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కంటెస్టెంట్స్ చాలా సీరియస్ గా నామినేట్ చేస్తూ వాళ్లు తప్పు చేసిన విధానాన్ని చాలా గట్టిగానే చెబుతున్నారు. ఇక ఇప్పట్లో రేవంత్ పై మరోసారి టాప్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఏకధాటిగా టార్గెట్ చేశారు అనిపిస్తుంది. రేవంత్ కూడా వారికి దీటైన సమాధానం చెబుతున్నాడు. ఇక ఈవారం రేవంత్ కూడా నామినేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వివరాల్లోకి వెళితే..

నేను చెప్పింది మొత్తం చెప్పాలి
బిగ్ బాస్ ఈసారి రంగులతో బాంబులు పేల్చే విధంగా నామినేషన్స్ ఆటను కొనసాగించారు. ముందుగానే రేవంత్ వర్సెస్ ఆదిరెడ్డి మధ్యలో గేమ్ మొదలైంది. నేను చేయని తప్పులకు కూడా మీరు చేశారు అనేలా నమ్మించాలి అనుకున్నారు అని రేవంత్ చెప్పడంతో ఆదిరెడ్డి కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. గతంలో జరిగిన తప్పుల గురించి చెబుతూ నేను చెప్పింది మొత్తం చెప్పాలి అని సగం సగం అర్థం చేసుకోకూడదు అని సీరియస్ అయ్యాడు.

ఏదైనా తప్పు చేస్తే
ఇక ఏదైనా తప్పు చేస్తే తన గురించి మాట్లాడే ధైర్యం నాకు ఉంది అని నీకు అది లేదు అని ఆదిరెడ్డి చెప్పడంతో ధైర్యం గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని రేవంత్ చాలా నెమ్మదిగా కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఇద్దరు నేను మాట్లాడుతాను నేను మాట్లాడుతాను అంటూ అక్కడే కూర్చుండిపోయారు. ఇక మరోసారి శ్రీ సత్య కీర్తి మధ్యలో నామినేషన్స్ గొడవ మరింత వేడిగా మారింది. కొన్ని కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు అని కీర్తి గతంలో చేసిన పొరపాట్ల గురించి చెబుతూ అందుకే నామినేషన్ చేశాను అని చెప్పుకొచ్చింది.

రోహిత్, ఫైమా గొడవ
ఇక రోహిత్, ఫైమా మధ్యలో కూడా గొడవ జరిగింది ఆమెను రోహిత్ నామినేట్ చేస్తూ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నావు అని చెప్పాడు. ఇక రోహిత్ ను ఫైమా నామినేట్ చేయడంతో రేవంత్ సీరియస్ అయ్యాడు. ఇక ఫైమా అయితే నువ్వు కూడా సపోర్ట్ తోనే వచ్చావు అని మరింత సీరియస్ గా మాట్లాడింది. ఇక వేలు చూపించి మరి సీరియస్ కావడంతో వీరి మధ్యలో మాటలు యుద్ధం మరింత వేడిగా మారిపోయింది.

వేలు చూపించమని మాట్లాడలేదు
వేలు చూపించమని మాట్లాడలేదు అని నువ్వు కూడా అలా చేయవద్దు అని రేవంత్ ఫైమా ను చూస్తూ అరిచేశారు. ఇక పక్కోడితోనే ఆడిన రేవంత్ సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు అని ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు అని ఫైమా అతని తప్పులను ఎత్తిచూపే ప్రయత్నం చేసింది. ఈ మాటలు చేంజ్ చేస్తూ ఉంటే ఎవరికి అర్థం కావడం లేదా అని కూడా ఆమె అందరికి చెప్పుకొచ్చింది.

నోరు జారుతున్నాడు
రేవంత్ ముందు ఒక మాట మాట్లాడుతాడు వెనకాల ఒక మాట మాట్లాడుతాడు అని.. ఏ రోజు కూడా దాని గురించి ఎవరు అడగలేదు అని పైమా చెప్పింది. ముందు నుంచి కూడా తన నోరు జారుతున్నాడు అని అది కూడా ఎందుకు కనిపించడం లేదు అని ఫైమా అందరిని అడిగేసింది. మరి ఈ విషయంలో ఫైమా మాటలకు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.