Bigg Boss Telugu 6: ఆగ్రహంతో టెన్షన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ మధ్యలో అసలైన గొడవ స్టార్ట్

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఎంతో ఆసక్తి గా కొనసాగుతుందని అనుకుంటే కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా నీరసంగా గేమ్ ను నడిపించారు. ఇక బిగ్ బాస్ కు తీవ్ర స్థాయిలో కోపం వచ్చినట్లు ఉంది. ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చు అని కౌంటర్ ఇచ్చాడు. ఇక కంటెస్టెంట్స్ అందరు కూడా మళ్ళీ బ్రతిమాలే పరిస్థితికి వచ్చారు. కానీ బిగ్ బాస్ మాత్రం వినడం లేదు. ఈ తరుణంలో కంటెస్టెంట్స్ మధ్యలో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే..

ఇంటి సభ్యుల నిర్లక్ష్యం

ఇంటి సభ్యుల నిర్లక్ష్యం

అందరూ గార్డెన్ ఏరియాలో వరుసగా నిలుచోమ్మని చెప్పిన బిగ్ బాస్.. ఇప్పటివరకు బిగ్ చరిత్రలో ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఇంత నీరసంగా జరుగలేదు. ఇంటి సభ్యుల నిర్లక్ష్యం టాస్క్ ల పట్ల నిర్లక్ష్యం. బిగ్ బాస్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం. మీ నిర్లక్ష్యం బిగ్ బాస్ ను మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరాశ పరుస్తున్న కారణంగా కెప్టెన్సీ పోటీ దారులు టాస్క్ రద్దు చేయడం జరిగింది అంటూ బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 తక్షణమే వెళ్లిపోవచ్చు

తక్షణమే వెళ్లిపోవచ్చు

దీంతో కంటెస్టెంట్స్ అందరు కూడా క్షమాపణలు చెప్పడం స్టార్ట్ చేశారు. ప్రేక్షకుల పట్ల అలాగే ఈ షో పట్ల గౌరవం లేని వారు తక్షణమే ముఖ ద్వారం నుంచి బయటకు వెళ్లిపోవచ్చు అని ఆదేశాలు వచ్చాయి. అలాగే తక్షణమే మీ కాస్ట్యూమ్స్ ని కూడా స్టోర్ రూమ్ లో పెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తరువాత కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

మంచిగా ఆడే వాళ్ళకు మోసం

మంచిగా ఆడే వాళ్ళకు మోసం

ఒక్కొక్కరు ఒక్కో విధమైన కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారు. ఫైమా కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా ఆడని వారి కారణంగా మంచిగా ఆడే వాళ్ళ కు మోసం జరుగుతుంది బిగ్ బాస్ అని చెప్పింది. ఇక ఆ తరువాత శ్రీహన్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. టైమ్ కి తినాలి టైమ్ కు పడుకోవాలి. సోది ముచ్చట్లు పెట్టుకోవాలి అని మిగతా వారిపై అసహనం తెలిపారు. అలాగే చాలా మందికి బిగ్ బాస్ షో గురించి మినిమమ్ క్లారిటీ లేదు బిగ్ బాస్.. అది చెప్పండి వాళ్లకు అని శ్రీహన్ అన్నాడు.

 చాలా బాధగా ఉంటుంది

చాలా బాధగా ఉంటుంది

ఇక మరోవైపు గీతూ మాట్లాడుతూ.. పదిమంది దోషులకు శిక్ష పడకపోయినా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంటారు కదా బిగ్ బాస్ అని మాట్లాడింది. అలాగే అందరూ కలిసి ఒక్క చాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అని అడిగారు. ఇక సూర్య గీతు తో మాట్లాడుతూ మనం ఎంత ప్రయత్నం చేసినా మిగిలిన వారి వలన ఆగిపోతే చాలా బాధగా ఉంటుంది అక్కా అని మాట్లాడాడు.

విభేదాలు

విభేదాలు

ఆ తరువాత ఇనయా సూర్య మధ్యలో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఆమె వాసంతి మెరినా తో చెప్పుకొని బాద పడింది. ఇక శ్రీహన్ అయితే ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వలన అందరికి ఎఫెక్ట్ అవుతోందని శ్రీహన్ మరో వివరణ ఇచ్చారు. మరి బిగ్ బాస్ ఆగ్రహం కంటెస్టెంట్స్ మధ్య ఇంకా ఎలాంటి విభేదాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X