twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: చేతులు కాలాక ఆకులు.. బిగ్ బాస్ చరిత్రలోనే చెత్త రేటింగ్స్!

    |

    బిగ్ బాస్ తెలుగు లో మొదటి సీజన్ స్టార్ట్ అయినప్పుడు అసలు ఈ కాంట్రవర్సీ షో ఇక్కడ సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ ఎన్టీఆర్ హోస్టింగ్ తో మొదలైన బిగ్ బాస్ ప్రయాణం నాగార్జునతో 5వ సీజన్ వరకు బాగానే కొనసాగింది. అయితే ఈ సారి 6వ సీజన్ అయితే మరి దారుణంగా రేటింగ్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక గత రెండు మూడు వారాల నుంచి అత్యంత చెత్త రికార్డులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    అందరి ఫెయిల్యూర్

    అందరి ఫెయిల్యూర్

    బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇక దానికి తగ్గట్టుగా బిగ్ బాస్ కూడా సరికొత్త టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండాలి. ఇక కంటెస్టెంట్స్ కూడా వారి టాలెంట్ ను చూపిస్తూ రేటింగ్స్ పెంచడంలో కూడా ముందుండాలి. కానీ ఈసారి ఇలాంటి ప్రయత్నాలు చేసినా కూడా ప్లాన్ వర్కౌట్ కాలేదు. పూర్తిస్థాయిలో బిగ్ బాస్ టీం అలాగే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫెయిల్ అయినట్లుగా తెలుస్తోంది.

    నిరాశపరుస్తూనే ఉన్నారు

    నిరాశపరుస్తూనే ఉన్నారు

    ఈసారి ఏ కోణంలో కూడా బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ముఖ్యంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ విషయంలో అందరూ నిరాశపరుస్తూనే ఉన్నారు. చలాకి చంటిని అతని ఐదు వారాలు కూడా కొనసాగించలేదు. ఒక విధంగా అతను షో కి పెద్దగా రేటింగ్స్ కూడా తీసుకురాలేదు. పోనీ కనీసం రొమాంటిక్ రూట్ లో అయినా జోడీలనే హైలెట్ చేయాలని అనుకున్నారు. కానీ ఈసారి ఎవరు కూడా అంతగా హైలైట్ కాలేకపోయారు.

    వీకెండ్స్ కూడా అదే పరిస్థితి

    వీకెండ్స్ కూడా అదే పరిస్థితి

    అయితే మిగతా రోజుల్లో ఎలా ఉన్నా శని ఆదివారాలు నాగార్జున వస్తాడు కాబట్టి తప్పకుండా ఆ రోజు రేటింగ్స్ అయితే ఎక్కువగానే ఉండాలి. కానీ ఈ సీజన్లో మాత్రం శని ఆదివారం కూడా రేటింగ్స్ ఏమంత మాత్రం బాగుండడం లేదు. అసలు నాగ్ వచ్చాడు అని మాటే తప్ప హడావిడి ఏమీ కనిపించడం లేదు. స్పెషల్ గెస్ట్ లు వస్తున్నా కూడా రేటింగ్స్ గతంలో కంటే చాలా తక్కువగా వస్తున్నాయి.

    దారుణంగా రేటింగ్స్

    దారుణంగా రేటింగ్స్

    సాదరణ రోజుల్లో ఎలా ఉందో వీకెండ్స్ లో కూడా రేటింగ్స్ తక్కువగానే వస్తున్నట్లుగా తెలుస్తోంది. అర్బన్ ఏరియాలో ఈ సీజన్ కు 6.82 కంటే ఎక్కువ స్థాయిలో రావడం లేదు. యావరేజ్ గా మొత్తంగా అయితే ఈసారి బిగ్ బాస్ 5.52 రేటింగ్ కూడా అందుకోవడానికి చాలా కష్టపడుతోంది. వారంతారంలో కనీసం రేటింగ్ 8 కూడా రావడం లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు.

    అదే పెద్ద తప్పు

    అదే పెద్ద తప్పు

    ఒక విధంగా బిగ్ బాస్ చేసిన తప్పులు కూడా చాలానే ఉన్నాయి. ఏదో ఒక రకంగా రేటింగ్స్ పెరుగుతాయోమో అని గీతు రాయల్ ఎన్ని తప్పులు చేసినా కూడా మౌనం వహించడం ఓ వర్గం వారిని ఏమాత్రం ఆకట్టుకోలేదు. గతంలో తప్పులు చేస్తే వెంటనే రియాక్ట్ అయిన బిగ్ బాస్ ఈసారి మాత్రం గీతూ ఎన్ని తప్పులు చేసినా కూడా ఏమి అనలేదు.

    చేతులు కాలాక..

    చేతులు కాలాక..

    సంచాలకురాలిగా ఉంటూ కూడా గీతూ గేమ్ కొనసాగించడం.. బిగ్ బాస్ కూడా ఏమీ తెలియనట్టుగా ఉండడం మరొక షాకింగ్ విషయం. ఇక మొత్తానికి ఆమెను ఇప్పుడు పంపిస్తున్నారు కానీ షో మీద ఊహించని విదంగా నెగటివ్ కామెంట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేసి ఏం లాభం అని అంటున్నారు. ఒక విధంగా బిగ్ బాస్ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నాడు అని ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు.

    English summary
    Bigg boss telugu 6 disaster ratings and big mistakes in geethu royal game
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X