twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: శ్రీహాన్ కు ఇనయా కత్తిపోటు.. షాక్ లో హౌజ్ మేట్స్, రేవంత్-సూర్యల మాటల యుద్దం

    |

    తెలుగు బుల్లితెర చరిత్రలోనే మోస్ట్ పాపులర్ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇండియాలో మొదటగా హిందీలో ప్రారంభమైన ఈ షో తెలుగులో సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇప్పటివరకు ఐదు టెలివిజన్, ఒక ఓటీటీ సీజన్ కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం ఆరో సీజన్ ప్రసారమవుతోంది. గత మూడో సీజన్ నుంచి టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో ఇప్పుడు ఎనిమిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ నిర్వహిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 27 గురువారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన రెండో ప్రోమో వివరాల్లోకి వెళితే.

    మిగిలిన 14 మంది కంటెస్టెంట్లు..

    మిగిలిన 14 మంది కంటెస్టెంట్లు..

    ఇటీవల బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఇంటి సభ్యులకు పనిష్ మెంట్ ట్రాక్ లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. దీంతో మిగిలిన 14 మంది కంటెస్టెంట్లందరూ టాస్క్ ల్లో గట్టి పోటీ ఇస్తూ ఆడుతున్నారు. ఇక ఈ బిగ్ బాస్ షోలో ఎవరు ఎప్పుడూ ఎలా ప్లేట్ మారుస్తారో, ఎవరికీ సపోర్ట్ చేస్తారో తెలియదు. అలాగే బద్ద శత్రువులు ఫ్రెండ్స్ కావొచ్చు.. మంచి ఫ్రెండ్స్ శత్రువులుగా మారిపోవచ్చు. ఇది శ్రీహాన్, ఇనయా సుల్తానా విషయంలో జరిగింది. హౌజ్ లో తను అందరి కంటే బెటర్ అని శ్రీహాన్ తో చెప్పిన ఇనయా తాజాగా షాక్ ఇచ్చింది. శ్రీహాన్ కు కత్తిపోటు గుచ్చి కెప్టెన్ కు అనర్హుడిగా పేర్కొంది. దీంతో శ్రీహాన్ తో పాటు మిగతా హౌజ్ మేట్స్ అందరూ షాక్ కు గురయ్యారు.

     ఆరుగిరిలో ముగ్గురు..

    ఆరుగిరిలో ముగ్గురు..

    గత రెండు ఎపిసోడ్ లో చేపల చెరువు టాస్క్ రసవత్తరంగా సాగింది. ఈ చేపల చెరువు టాస్క్ ను కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఆరుగురు అంటే శ్రీహాన్, రేవంత్, ఆర్జే సూర్య, శ్రీ సత్య, కీర్తి భట్, ఫైమా గెలిచినట్లు ఇవాళ ఉదయం విడుదల చేసిన మొదటి ప్రోమో ద్వారా అర్థమైంది. ఈ ఆరుగురిలో చాలా బాగా ఫర్ఫామ్ చేసి శ్రీహాన్, కీర్తి భట్, ఆర్జే సూర్య కెప్టెన్సీ కంటెస్టెంట్ గా తరువాతి లెవెల్ కి వెళ్లినట్లు రేవంత్ చేత చెప్పించాడు బిగ్ బాస్. ఈ ముగ్గిరిలో ఎనిమిదో వారం ఇంటి కెప్టెన్ గా మిగతా హౌజ్ మేట్స్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగాంగానే పలు హామీలతో ఈ ముగ్గురు ఇంట్లో ప్రచారం చేశారు.

    కత్తిపోటుతో అనర్హుడి ప్రకటన..

    కత్తిపోటుతో అనర్హుడి ప్రకటన..

    అనంతరం ఒక్కొక్క ఇంటి సభ్యుడు, సభ్యురాలు వచ్చి తగిన కారణాలు చెబుతూ కెప్టెన్ ను ఎన్నుకోవచ్చు. అయితే ఇంటి కెప్టెన్ కు అనర్హులైన వారని కత్తితో గుచ్చి పోటీ నుంచి తప్పించవచ్చు. ఇందులో భాగంగా ఆర్జే సూర్యను అనర్హుడిగా ప్రకటిస్తూ కత్తి గుచ్చాడు రాజ శేఖర్. వీరిద్దరికి కొద్దిపాటి ఆర్గ్యుమెంట్ జరిగింది. తర్వాత వచ్చిన రేవంత్ కూడా ఆర్జే సూర్యకే కత్తి గుచ్చాడు. సూర్య కెప్టెన్సీలోనే బిగ్ బాస్ నుంచి ఎక్కువగా వార్నింగ్స్ వచ్చాయన్న కారణం చూపించాడు రేవంత్. దానికి తన కెప్టెన్సీలో కేవలం ఐదు సార్లు మాత్రమే అలా జరిగిందని డిఫెన్స్ చేసుకున్నాడు సూర్య.

    రంగు మారుస్తుంది ఎవరు..

    రేవంత్, బాలాదిత్య తర్వాత వచ్చిన ఇనయా సుల్తానా.. అటు ఇటు తిరుగుతూ కొద్దిసేపు సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఇక్కడ కొద్దిసేపు ఫన్ క్రియేట్ అయింది. మూడు కత్తులు గుచ్చుకున్నోడికి మరో కత్తి గుచ్చుకుంటే ఏమవుతుంది అని ఆర్జే సూర్య అన్నాడు. అలాగే ఇనయా కత్తిని ఎవరికీ గుచ్చుతుందని అందరూ తెగ ఎదురుచూశారు. సూర్య నుంచి మొదలు పెట్టిన ఇనయా సుల్తానా చివరిగా.. శ్రీహాన్ కి కత్తి గుచ్చింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత వారానికి ఒక రంగు మారుస్తుంది ఎవరిక్కడ అంటూ శ్రీహాన్ అన్నాడు.

    English summary
    Bigg Boss Telugu 6: Inaya Sultana Gives Shock To Shrihan In Eighth Week Captaincy Task October 27 Episode Promo
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X