Bigg Boss Telugu 6: రేవంత్ ను రెచ్చగొడదాం.. కుంపటి పెట్టిన బిగ్ బాస్.. కొట్టేసుకున్న ఇంటి సభ్యులు
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. బిగ్ బాల్ ఇచ్చిన పనిష్ మెంట్ తో ఇంటి సభ్యులు దారిలో పడ్డారు. బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఎనిమిదో వారానికి అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ కాగా, సోమవారం వాడీవేడీగా నామినేషన్ల పర్వం సాగింది. ఈ వారం నామినేషన్లలో మొత్తం 14 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. ఇక ఎప్పటిలా స్టార్ట్ కావాల్సింది కెప్టెన్ కంటెండర్ టాస్క్. ఈ టాస్క్ ను ఇంటి సభ్యుల చేత మంగళవారం అంటే అక్టోబర్ 25న ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఆడించాడు బిగ్ బాస్. దానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రొమోను తాజాగా విడుదల చేసింది స్టార్ మా. మరి ఆ ప్రోమో విషయాల్లోకి వెళితే..

చేపల చెరువు టాస్క్..
బిగ్ బాస్ తెలుగు 6 ఎనిమిదో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ను నిర్వహించాడు బిగ్ బాస్. ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో చేపల చెరువు అనే టాస్క్ ఇచ్చారు. పైనుంచి చేపలు పడుతుంటే వాటిని పట్టుకుని గంపల్లో వేసుకోవాలి. అలాగే వాటిని ఇంకొకరూ తీసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీలైనన్నీ ఎక్కువ చేపలు పట్టుకున్నవారే కెప్టెన్సీ కంటెండర్లుగా అవుతారు.

తనదైన శైలీలో స్ట్రాటజీస్..
ఈ టాస్క్ లో భాగంగా ఇద్దరిద్దరు టీమ్ గా ఆడినట్లు తెలుస్తోంది. ఇలా ఆదిరెడ్డి-గీతు రాయల్, ఫైమా-రాజ శేఖర్, రేవంత్-ఇనయా సుల్తానా టీమ్ లుగా కనిపిస్తోంది. ఈ టాస్క్ లో గీతూ రాయల్ మళ్లీ తనదైన శైలీలో స్ట్రాటజీస్ ప్లాన్ చేసింది. ఒక టాస్క్ లో ఫిజికల్ గా ఆడలేకపోయినప్పుడు రేవంత్ ని మెంటల్ గా అగ్రెషన్ తో రెచ్చగొట్టాలి అని ఆదిరెడ్డితో గీతూ చెబుతుంది.

చేపలను కాపాడకునేందుకు..
మరోవైపు నా జోలికి ఎవరు రారు, వస్తే కచ్చితంగా వేరేలా ఉంటది అని ఇనయాకు చెబుతూ రేవంత్ కనిపించాడు. ఇక ఈ చేపల చెరువు టాస్క్ లో పోటీ పడిన కంటెస్టెంట్లందరూ తమ చేపలను కాపాడకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఒకరి గంపల నుంచి మరొకరు లాక్కున్నారు. ఈ క్రమంలోనే రాజ్, ఫైమా గంప చిరిగిపోయినట్లు కనిపించింది.

ఫిజికల్ గా మారిన గేమ్..
అయితే పక్కవాళ్ల గంపల నుంచి చేపలు లాక్కోవడంతో ఆట ఫిజికల్ గా మారింది. ఒకరిమీద ఒకరు పడుతూ మరి చేపలను లాక్కున్నారు. ఈ క్రమంలోనే నీ గేమ్ నువ్ ఆడుకో అని బాలాదిత్యను గీతూ అంటే.. ఇది నా గేమే అంటూ అరిచాడు బాలాదిత్య. తర్వాత చాలా మంది గీతూ రాయల్ గంపలోని చేపలు లాక్కునేందుకు ప్రయత్నించారు.

గట్స్ ఉంటే తీసుకో..
రోహిత్ కూడా గీతూ రాయల్ గంప నుంచే తీసుకునేందుకు ప్రయత్నించాడు. దానికి గట్స్ ఉండాలా గట్స్ అని గీతూ అంటే.. గట్స్ ఉంటే తీసుకో అని రోహిత్ అన్నాడు. దీంతో ఎప్పుడు చూడు కలిసే అడతారు. నువ్వు మీ ఆవిడా అని అరిచింది గీతూ రాయల్. దీంతో కోపంతో నా జోలికి రావొద్దు అని కళ్లు పెద్దవి చేసింది మెరీనా.
నా టార్గెట్ అందరూ..
అయినా కూడా వస్తా వస్తా.. అంటూ రెచ్చగొట్టింది గీతూ రాయల్. అందరితో ఆడతా.. అందరూ నా టార్గెట్లే.. అని చెప్పుకొచ్చింది గీతూ రాయల్. ఇక బిగ్ బాస్ తెలుగు 6 ఎనిమిదో వారం నామినేషన్లలో ఇంటి సభ్యులు మొత్తం 14 మంది ఉన్నారు. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంటికి వెళతారనేది చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











