Bigg Boss Nominations: 8వ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్.. ఈ సారి 10 మంది.. సేఫ్ అయింది ఎవరంటే!

సంచనాలకు కేంద్ర బిందువుగా ఉంటున్నా.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే మన భాషలోకి పరిచయం అయిన దీనికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా జాతీయ స్థాయిలో రికార్డులు కొట్టేంత రేటింగ్ దక్కింది. దీంతో ఇప్పుడు ఆరో సీజన్‌ను సరికొత్త హంగులతో నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఆరో సీజన్ ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ లీకైంది. ఇందులో ఎవరు నామినేట్ అయ్యారో చూడండి!

కొత్త హంగులు... రేటింగ్ లేదు

కొత్త హంగులు... రేటింగ్ లేదు

మిగిలిన భాషల కంటే తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్ అవుతుంది. అందుకు అనుగుణంగానే ఆరో దానికి కూడా మరింత ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ చూడని సరికొత్త హంగులతో దీన్ని నడుపుతున్నారు. కానీ, ఈ సీజన్‌కు అంతగా స్పందన రావట్లేదు. ఫలితంగా రేటింగ్ దారుణంగా వస్తోంది.

21మందిలో ఏడగురు అవుట్

21మందిలో ఏడగురు అవుట్

ఈ సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌లు ఎలిమినేట్ అయిపోయారు.

ఆ ఎపిసోడ్‌ అంటేనే ఆసక్తిగా

ఆ ఎపిసోడ్‌ అంటేనే ఆసక్తిగా

బిగ్ బాస్ షో మొత్తంలో నామినేషన్స్ టాస్క్ మాత్రమే ఎంతో ఆసక్తికరంగా సాగుతుందని తెలిసింది. దీనికి కారణం ఇందులో ఎన్నో గొడవలు జరుగుతూ ఉండడమే. అందుకే ఈ ఎపిసోడ్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూ ఉంటుంది. ఇక, ఆరో సీజన్‌లో దీన్ని సోమవారం కాకుండా మార్చాలని అనుకున్నారు. కానీ, మళ్లీ అదే రోజు చూపిస్తున్నారు.

ఎనిమిదో వారం... గొడవలతో

ఎనిమిదో వారం... గొడవలతో

ప్రతి సీజన్ మాదిరిగానే ఆరో దానిలో కూడా నామినేషన్స్ టాస్కులు ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్నాయి. ప్రతి వారం కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అప్పుడే ఈ సీజన్‌లో కొంత మంది మధ్య దూరం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్కు కూడా ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలతోనే రంజుగా సాగిందట.

వాళ్లిద్దరూ నేరుగా నామినేట్

వాళ్లిద్దరూ నేరుగా నామినేట్

ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను గతంలో మాదిరిగానే నిర్వహించబోతున్నారని తెలిసింది. ఇక, ఇందులో ఇప్పటికే ఇద్దరు నామినేట్ అయి ఉన్నారు. అందులో రెండు వారాలకు నామినేట్ అయ్యేందుకు అంగీకరించిన రోహిత్‌ ఒకడు కాగా.. గత వారం ఓడిపోయిన టీమ్ నుంచి నామినేట్ అయిన వాసంతి ఇంకొకరు. వీళ్లిద్దరినీ ఎవరూ నామినేట్ చేయరు.

8వ వారం 10 మందికి దెబ్బ

8వ వారం 10 మందికి దెబ్బ

తాజా సీజన్‌లోని ఎనిమిదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసినట్లు తెలిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా 10 మంది నామినేట్ అయ్యారని సమాచారం. అందులో బాలాదిత్య, ఆది రెడ్డి, గీతూ రాయల్, శ్రీహాన్‌, శ్రీ సత్య, రేవంత్, మెరీనా, రాజశేఖర్, రోహిత్‌, వాసంతి కృష్ణన్‌లు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా లీక్ అయింది.

సేఫ్ అయిన నలుగురు వీళ్లే

సేఫ్ అయిన నలుగురు వీళ్లే


బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఇప్పటికే ఏడుగురు ఎలిమినేట్ అవడంతో 14 మంది మిగిలారు. అలాంటిది ఈ వారం ఏకంగా 10 మంది నామినేషన్‌లోకి వచ్చినట్లు తెలిసింది. అంటే ఈ వారం ఫైమా, కీర్తి భట్, ఇనాయా సుల్తానా, ఆర్జే సూర్యలు మాత్రం సేఫ్ అయ్యారని ఓ న్యూస్ తెగ వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X