Bigg Boss Telugu 6: హౌజ్ లో ఆరోహి మితిమీరిందా.. అస్సలు ఊరుకోను.. ఇంటర్వ్యూ లో యాంకర్ కు వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ రేటింగ్ సంగతి ఎలా ఉన్నా అరుపులు, కేకలు, ప్రేమాయణాలు, గొడవలు, అలకలు, బూతులతో బాగానే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. ఇక తాజాగా సోమవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ఎప్పటిలానే నామినేషన్లు జరగనున్నాయి. ఈ నామినేషన్లలో మెరీనా-రోహిత్ లకు బిగ్ బాస్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో అనూహ్యంగా ఆరోహి రావు ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయినవారిని బిగ్ బాస్ కేఫ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆరోహి రావును యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో యాంకర్ శివపై ఫైర్ అయింది ఆరోహి రావు.

 సూర్యతో సన్నిహితంగా..

సూర్యతో సన్నిహితంగా..

బిగ్ బాల్ తెలుగు 6 రియాలిటీ షోలో నాలుగో వారం ఎలిమినేషన్ కింద ఆరోహి రావు అనూహ్యంగా బయటకు వచ్చింది. అందుకు కారణం ఆమె ఆర్జే సూర్యతో సన్నిహితంగా ఉన్న విధానం కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చలేదని సమాచారం. ఈ సీజన్ లో వీళ్లద్దరు అలకలు, బుజ్జగింపులతో అనసవరమైన డ్రామా చేశారని టాక్ వినిపించింది. గత సీజన్ లోని షణ్ముఖ్, సిరిలను వీళ్లిద్దరు గుర్తు చేస్తున్నారని కూడా విమర్శలు వచ్చాయి.

 ఆరోహి రావుపై ట్రోలింగ్..

ఆరోహి రావుపై ట్రోలింగ్..

బిగ్ బాస్ హౌజ్ లో వీరిద్దరు చూపించిన డ్రామాతో ప్రధానంగా ఆరోహి రావుపై ట్రోలింగ్ జరిగింది. ట్విటర్ లో ఆమెపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అందుకే ఆరోహి రావుపై ఎలిమినేట్ వేటు పడినట్లు సమాచారం. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలతోపాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల మనో భావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది బీబీ కేఫ్.

ఎలిమినేట్ కంటెస్టెంట్ల మనో భావాలు..

ఎలిమినేట్ కంటెస్టెంట్ల మనో భావాలు..

ఈ బిగ్ బాస్ కేఫ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలతోపాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల మనో భావాలను బయట పెడుతున్నారు. ఈ కేఫ్ కు మొన్నటి వరకు ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ, ఆర్జే కాజల్ వ్యాఖ్యతలుగా వ్యవహరిస్తే ఎలిమినేట్ అయిన వారిని మాత్రం కాంట్రవర్సీ యాంకర్ గా పేరు తెచ్చుకున్న శివ హోస్ట్ చేస్తున్నాడు. ఈ బీబీ కేఫ్ కు తాజాగా ఎలిమినేట్ అయిన ఆరోహి రావు హాజరైంది.

యాంకర్ శివపై ఫైర్..

యాంకర్ శివపై ఫైర్..

ఈ బిగ్ బాస్ కేఫ్ కు హాజరైన ఆరోహి రావు తోటి ఇంటిసభ్యులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కాకుండా యాంకర్ గా వ్యవహరిస్తున్న శివపై ఫైర్ అయింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఎలా అనిపించింది అని ఆరోహిని శివ ప్రశ్నించగా.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను అందరితోని అని సమాధానం ఇచ్చింది. దీంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను అన్నావ్ కదా.. ఎవరితో కనెక్ట్ అయ్యావ్ అని క్వశ్చన్ వేశాడు శివ.

తప్పు చెబుతున్నావా..

తప్పు చెబుతున్నావా..

దీనికి ఎమోషనల్ గా అంటే కీర్తి, శ్రీహాన్ తో కనెక్ట్ అయ్యాను అని ఆరోహి చెప్పగా.. తప్పు చెబుతున్నావా.. సేఫ్ గా చెబుతున్నావా అని శివ అంటాడు. దీనికి నువ్ ఎవరి పేరైనా ఎక్స్ పెక్ట్ చేస్తున్నావా అని ఆరోహి ప్రశ్నిస్తే.. నువ్ చెబుతావేమో అని వేయిట్ చేస్తున్నా అని శివ అంటాడు. దీంతో అదేం లేనట్లుగా ఆరోహి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంది. తర్వాత నువ్ ఎప్పుడైతే ఇండివిడ్యువల్ గా ఆడటం ఆపేసావో నీ గ్రాఫ్ పడిపోయింది అని శివ అన్నాడు.

నువ్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు..

నువ్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు..

ఆ మాటకు నేను ఒప్పుకోను అని అన్న ఆరోహితో నువ్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇదే నిదర్శనం. నువ్ ఎలిమినేట్ అయి నా ముందు ఉన్నావ్ కదా అని అన్నాడు శివ. హౌజ్ కంటెస్టెంట్ గురించి చెప్పిన తర్వాత.. హౌజ్ లో ఆరోహి కొంచెం మితిమీరింది అని శివ అనడంతో.. ప్యూర్ ఫ్రెండ్ షిప్ ను చూస్తున్నప్పుడు అని ఆరోహి చెబుతుంటే మధ్యలోనే అంతా ప్యూర్ ఫ్రెండ్ షిప్ అని ఎవరికి అనిపించలేదే అని శివ అంటాడు.

పచ్చ కామెర్ల వాడికి..

దీనికి ఆరోహి ''పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది'' అని అనడంతో ''అంటే.. చేసేది కరెక్ట్'' అని శివ అంటాడు. దీంతో ''అస్సలు ఊరుకోను.. అస్సలు ఊరుకోను అట్లాంటివి. ఇంటర్వ్యూ అయిన సరే.. ''అని కోపంతో ఆరోహి యాంకర్ శివపై ఫైర్ కావడంతో ఎపిసోడ్ ప్రొమో ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X