Bigg Boss Telugu 6: జరిగింది ఒకటి చూపించింది మరొకటి.. ఆడపిల్ల మానాన్ని కాపాడాను: బాలాదిత్యా

బిగ్ బాస్ లో పెద్దన్న తరహాలో కనిపించిన బాలాదిత్యా తొందరగా వెళ్ళిపోతాడు అని ఎవరు అనుకోలేదు. తప్పకుండా టాప్ 5 లో కూడా ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆదిత్య ఊహించని విధంగా అంతకంటే ముందే ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక బయటకు వచ్చిన తర్వాత ఆదిత్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక బిగ్ బాస్ లో తన అనుభవాలను అతను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిత్య ఈ విధంగా ఒక వివరణ అయితే ఇచ్చాడు.

ఆడపిల్లల గురించి అలా ఆలోచించాను

ఆడపిల్లల గురించి అలా ఆలోచించాను

బాలాదిత్య మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ కూడా బిగ్ బాస్ లో పెద్దగా తప్పులు చేసింది లేదు ప్రతి టాస్క్ లో కూడా పోటీ పడుతూ ఆడటం జరిగింది. అలాగే సమస్యలు వచ్చినప్పుడు కూడా నేను ముందు ఉన్నాను. ఒక ఆడపిల్ల డ్రెస్ విషయంలో కూడా పొరపాటు జరిగితే కూడా నేను ఒప్పుకోలేదు. వారి మానాన్ని కాపాడే విధంగా ఆలోచిస్తాను. ఒక అమ్మాయి చిన్న డ్రెస్ యోగా చేస్తా అంటే వద్దమ్మా అని చెప్పాను. ఆ విధంగా ఆలోచించే నేను కూడా కొన్ని కొన్ని సార్లు తెలియకుండా వేరే తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతాను అని నేను అనుకోలేదు.. అని బాలాదిత్యా అన్నాడు.

 ఆ విధంగా చూపిస్తే తప్పు

ఆ విధంగా చూపిస్తే తప్పు

ఇక నేను బయటికి వచ్చిన తర్వాత ఒక విషయం అర్థమైంది. అక్కడ జరిగిన ప్రతి ఒక్కటి కూడా 100% బయటికి రాలేదు. అయితే బిగ్ బాస్ ఎడిటింగ్ లో ఒకరోజు జరిగిన మొత్తాన్ని ఒక గంట ఎపిసోడ్లో చూపించడం అనేది కూడా చాలా కష్టం. జరిగింది ఒకటి చూపించేది మరొకటి. ఎవరైనా దారుణంగా తప్పు మాట్లాడితే దాన్ని చూపిస్తే కూడా తప్పు అవుతుంది. ఆ విధంగా కూడా ఆలోచించి ఉండవచ్చు.. అని ఆదిత్య అన్నాడు.

 బలవంతులతోనే పోరాడాలి

బలవంతులతోనే పోరాడాలి

అయితే బిగ్ బాస్ లో మరి ఎక్కువమంది రావడం కూడా బయట క్రేజ్ తక్కింది అని వాదన ఉండవచ్చు. బయటకు వచ్చిన తర్వాత నాకు సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ వచ్చింది అని అర్థమైంది. అందరితోనూ నేను బాగుండడం కూడా జనాలకు నచ్చింది అనిపించింది. మొదటినుంచి కూడా నేను ఎవరైనా తప్పు చేస్తే వెంటనే నచ్చ జెప్పి ఒప్పించేందుకు ప్రయత్నం చేశాను. ఇక బిగ్ బాస్ ఆటలో ఆడపిల్లలు మగ పిల్లలు అని తేడా లేదు. ఎవరైనా సరే బలవంతులతోనే పోరాడాలి అని ఆదిత్య వివరణ ఇచ్చాడు.

 బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లాను అంటే..

బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లాను అంటే..

నేను బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లాను అంటే.. ఆ హౌస్ లో ఒక సరికొత్త అనుభూతి కోసమే నేను వెళ్ళాను. వివిధ రకాల మనుషులతో ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోనే నేను బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాను. ఇప్పటివరకు నేను బిగ్ బాస్ లో ఏ సీజన్ కూడా చూడలేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం అప్పుడప్పుడు చూసేవాణ్ణి. అయితే నాకు ఈ సీజన్ లన్నిటిలో కూడా ఫస్ట్ సీజన్ అంటే కాస్త బాగా నచ్చింది. అని ఆదిత్య అన్నాడు.

గోతుల తియ్యటం నాకు రాదు

గోతుల తియ్యటం నాకు రాదు

ఇక బిగ్ బాస్ లో నాకు నచ్చిన పెద్ద మూమెంట్ ఏమిటి అంటే.. ఒకేసారి ఎక్కువ నామినేషన్స్ పడినప్పుడు నా మీద నాకే నమ్మకం వచ్చింది. అయితే బిగ్ బాస్ బ్యాటరీ రీఛార్జ్ టైంలో నా భార్య పాపతో మాట్లాడాలని అనుకునే ఆప్షన్ వచ్చింది. కానీ మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని నేను ఆ ఆప్షన్ కూడా వదిలేసాను. అయితే నేను ఎంతో మంది నామినేట్ చేసిన కూడా బాధ పడలేదు. ఎప్పుడు కూడా వెనకాల గోతుల తియ్యటం నాకు రాదు. ఇక బురదతో నామినేషన్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పుడు కూడా బ్యాలెన్స్ లో ఉన్నాను. నేను ఎంత పేషెంట్స్ లో ఉన్నాను.. నా వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయి అనేది.. నాకు బిగ్ బాస్ గుర్తు చేసింది.. అని ఆదిత్య వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X