Bigg Boss Elimination: తొలి వారం షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఊహించని కంటెస్టెంట్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్
చాలా కాలంగా ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. అంతలా ఇది ఆరేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. తద్వారా దేశంలోనే హవాను చూపిస్తూ దూసుకుపోతోంది.
దీంతో నిర్వహకులు కూడా రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ ఆరో సీజన్‌ను మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇందులో మొదటి వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఇందులో ఏడుగురు నామినేట్ అయ్యారు. వారికి సంబంధించిన ఓటింగ్‌పై ఓ లుక్కేద్దాం పదండి!

ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌తో
తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. తక్కువ సమయంలోనే ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని టాప్ షోగా మారిపోయింది బిగ్ బాస్. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు తాజాగా ఆరో సీజన్‌ను మొదలు పెట్టారు. దీన్ని గతంలో ఎన్నడూ చూపించని సరికొత్త టాస్కులతో నడిపించబోతున్నారు. దీంతో ఆరో సీజన్‌పై అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి.

21 మందిని పంపించిన టీమ్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంటరైన విషయం తెలిసిందే. అందులో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు ఉన్నారు.

నామినేషన్‌లో మార్పు.. ఇలా
బిగ్ బాస్ షోలో నామినేషన్స్ ప్రక్రియ సోమవారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో జరుగుతుంది. కానీ, ఆరో సీజన్‌లో మాత్రం బుధవారానికి మార్చారు. ఇక, ఈ సీజన్‌లో మొదటి వారానికి సంబంధించిన ప్రక్రియ గొడవలతో సాగింది. ఒక కంటెస్టెంట్ ఇద్దరిని ఎంపిక చేసుకుని.. ఆ పేర్లను టాయిలెట్‌లో వేయాలి. ఇందులో ముగ్గురు సేఫ్ అవగా.. ముగ్గురు నేరుగా నామినేట్ అయ్యారు.

మొదటి వారంలో ఏడుగురు
బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి మొదటి వారానికి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కొన్ని గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఇందులో మొత్తం ఏడుగురు బాలాదిత్య, రేవంత్, ఫైమా, శ్రీ సత్య, ఇనాయా సుల్తానా, అభినయశ్రీ, చలాకీ చంటి నామినేట్ అయ్యారు. అయితే, క్లాస్‌లో ఉన్న వాళ్లకు బాలాదిత్యను అరోహీ రావ్‌తో స్వైప్ చేయడంతో ఆమె కూడా నామినేషన్స్‌లోకి వచ్చేసింది.

టాప్ ప్లేస్‌లో ఫైమా.. రేవంత్
బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్ కోసం ఇద్దరు కంటెస్టెంట్లు అంటే ఫైమా, రేవంత్ పోటీ పడుతున్నారట. వీళ్ల ప్లేస్‌లు తరచూ మారుతున్నాయట. కానీ, ఎక్కువ శాతం ఫైమాకే ఓట్లు పోలవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తర్వాతి స్థానాల్లో ఎవరంటే?
బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారంలో జరుగుతోన్న ఓటింగ్‌లో ఫైమా, రేవంత్ టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగుతున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఈ సారి నామినేషన్స్‌లో మూడో స్థానంలో శ్రీ సత్య, నాలుగో స్థానంలో చలాకీ చంటి, ఐదో స్థానంలో ఇనాయా సుల్తానా ఉన్నారట. వీళ్లు దాదాపుగా సేఫ్ అయినట్లు టాక్.

వాళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్
బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ఊహించని విధంగా అరోహీ రావ్, అభినయశ్రీ చివరి స్థానాల్లో ఉన్నారట. అంటే వీళ్లిద్దరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మొదటి వారంలో ఇనాయా బయటకు వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ, పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











