twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Elimination: ఎలిమినేషన్ లో కొత్త ట్విస్ట్.. అతనితోపాటు గ్లామర్ క్వీన్ ఎలిమినేట్, వాళ్లకు నిరాశే!

    |

    బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మొదట్లో కంటే ఇప్పుడు రసవత్తరంగానే సాగుతోంది. గతంలో బిగ్ బాస్ ఇచ్చిన కోటింగ్ తో ఇంటి సభ్యులు టాస్కుల్లో గట్టిగానే పోరాడుతున్నారు. ఇప్పటివరకు తొమ్మిది మంది ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికి 68 రోజులు, 69 ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న ఈ ఆరో సీజన్ మరో 22 రోజులు నడవనున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు అనూహ్య పరిణామాలు, విచిత్ర సంఘటలు, రొమాన్సులు, అరుపులు, గొడవలు, విభేదాలు, స్నేహం, శత్రుత్వం వంటి అనేక ఎమోషన్స్, సీన్స్ తో బాగానే రక్తికట్టించారు ఇంటి సభ్యులు. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ పదో వారం షాకింగ్ గా డబుల్ ఎలిమినేషన్ తో ఇద్దరు కంటెస్టెంట్లను పంపించనున్నాడు బిగ్ బాస్.

     ఒక్కొక్కరుగా ఇంటి బాట..

    ఒక్కొక్కరుగా ఇంటి బాట..

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఇప్పటికి 68 రోజులు, 69 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది ఈ బిగ్ బాస్ సీజన్ 6. హౌజ్ నుంచి ఒక్కొక్కరుగా తమ ఇంటి బాట పడుతున్నారు. ఇప్పటికే తొమ్మిదివారాలకు గాను తొమ్మిది మంది ఎలిమినేట్ కాగా ఈ పదో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. హౌజ్ లో మంచి పేరు తెచ్చుకున్నవాళ్లలో ఒకరు, గ్లామర్ క్వీన్ గా పేరు పొందని మరొకరు ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌజ్ వీడనున్నారు.

    9 మంది ఇంటి సభ్యులు ఎలిమినేట్..

    9 మంది ఇంటి సభ్యులు ఎలిమినేట్..

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి వచ్చిన 21 మంది కంటెస్టెంట్స్ లలో తొమ్మిది వారాలకు గాను తొమ్మిది మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడి వారి ఇంటికి చేరుకున్నారు. ఈ తొమ్మిది మందిలో ముందుగా షానీ సల్మాన్ ఎలిమినేట్ కాగా తర్వాత వరుసగా అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప పింకీ, అర్జున్‌, సూర్య అవ్వగా గత వారం అనూహ్యంగా చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినట్ అయి వెళ్లిపోయింది.

    నామినేషన్లలో ముగ్గురు సేఫ్..

    నామినేషన్లలో ముగ్గురు సేఫ్..

    గీతూ రాయల్ ఎలిమినేట్ తర్వాత బిగ్ బాస్ ఏ సీజన్ లోని పదో వారం నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగానే సాగింది. పదోవారం నామినేషన్లలో మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు ఇనయా సుల్తానా, కీర్తి భట్, ఫైమా, వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, బాలాదిత్య, మెరీనా అబ్రహం, శ్రీహాన్ కాగా.. కెప్టెన్ అయిన కారణంగా శ్రీసత్యతోపాటు రాజశేఖర్, రోహిత్ ను ఎవరు నామినేట్ చేయలేదు. దీంతో వారు ముగ్గురు సేఫ్ అయ్యారు.

    డబుల్ ఎలిమినేషన్ తో షాక్..

    డబుల్ ఎలిమినేషన్ తో షాక్..

    ఇక బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో పదోవారం డబుల్ ఎలిమినేషన్ తో షాక్ ఇవ్వనున్నాడు బిగ్ బాస్. దీంతో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ డబుల్ ఎలిమినేషన్ లో మంచి బిహేవియర్ కలిగిన కంటెస్టెంట్ గా పేరు పొందిన బాలాదిత్య ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే హౌజ్ లో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న వాసంతి కృష్ణన్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లనున్నట్లు సమాచారం.

    జెన్యూన్ పర్సన్ అయినప్పటికీ..

    జెన్యూన్ పర్సన్ అయినప్పటికీ..

    బాలాదిత్య, వాసంతి కృష్ణన్ వీరిద్దరిలో ఒకరు ఇవాళ అంటే శనివారం ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లగా.. మరొకరిని ఆదివారం ఎలిమినేషన్ పేరిట ఇంటికి పంపించనున్నారు. అయితే బాలాదిత్య మంచి జెన్యూన్ పర్సన్ అయినప్పటికీ హౌజ్ లో ఆడిన గేమ్ అంతా ఎఫెక్టివ్ గా లేకపోవడంతో ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే హౌజ్ లో గానీ, గేమ్ లో గానీ చురుగ్గా పాల్గొనకపోవడం, ఇతర విషయాల్లో స్టాండ్ తీసుకోకపోవడం, లాస్ట్ వీక్ జరగిన సిగరెట్ల గొడవ కారణంగా బాలాదిత్యకు ఓట్లు తక్కువ పడినట్లు సమాచారం.

    అందంగా కనిపించడంలో శ్రద్ధ..

    అందంగా కనిపించడంలో శ్రద్ధ..

    ఇక గ్లామర్ క్వీన్ వాసంతి కృష్ణన్ విషయానికొస్తే ఆమె ఎక్కువగా అందంగా కనిపించడంలో కనబర్చిన శ్రద్ధ టాస్కులు, గేమ్ ఆడటంలో చూపించలేదని చాలా మంది ప్రేక్షకుల మాట. మొదటి నుంచి తనలో తానే మెదిలిన వాసంతి కృష్ణన్ హోస్ట్ నాగార్జున రెండు మూడు వారాలు మందలిస్తే గానీ ఆడలేదు. అయితే గతవారం మిషన్ పాజిబుల్ లోని బేటాన్ టాస్క్ లో మాత్రం చురుగ్గా ఆడింది.

     గట్టిగా వాదించినప్పటికీ..

    గట్టిగా వాదించినప్పటికీ..

    బేటాన్ టాస్క్ తర్వాత కూడా తన జోలికి వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుని గట్టిగా వాదించినప్పటికీ గేమ్ తో మాత్రం అంతగా ప్రభావితం చేయలేదని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. మిషన్ పాజిబుల్ టాస్క్ తర్వాత బ్యూటిఫుల్ వాసంతి అంతగా గేమ్ ఆడకపోవడంతో ఆమె కూడా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వాసంతి కృష్ణన్ గ్లామర్ అండ్ బ్యూటి కోసం చూసే ఆడియెన్స్ కు మాత్రం ఇది నిరాశ చెందుతారనే చెప్పవచ్చు.

    English summary
    Bigg Boss Telugu 6 10th Week Double Elimination. Host Nagarjuna Eliminated Baladitya And Vasanthi Krishnan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X