Bigg Boss Telugu 6 ఎలిమినేషన్ పై చర్చ, పైకి ఒకలా మనసులో మరోలా.. చిచ్చు పెట్టిన నాగార్జున?

అంతుచిక్కని సంఘటనలతో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ దూసుకుపోతోంది. ఈ సీజన్ లో ముఖ్యంగా ఎలిమినేషన్స్ చాలా వరకు షాకింగ్ గానే ఉన్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, టాప్ 5లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ అనుకోకుండా ఈ బిగ్ బాస్ హౌజ్ ను వీడి వారి ఇంటి బాట పడుతున్నారు. ఇప్పుడు మరొకరు ఇంటి బాట పట్టే సమయం వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ లో లేడీ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డిసెంబర్ 10 శనివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కూడా ఎలిమినేషన్ టాపిక్ పై ఇంటి సభ్యులతో చర్చించారు.

డబ్బు గెలుచుకునేందుక గట్టి పోటీ..

డబ్బు గెలుచుకునేందుక గట్టి పోటీ..

ఎన్నో అనుమానాలు, అంచానాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ అనూహ్య పరిణామాలతో ముందుకు సాగుతోంది. చివరి అంకానికి చేరుకున్న ఈ సీజన్ 14వ వారమంతా కోల్పోయిన బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీని తిరిగి సంపాందించుకోవడాని ఛాలేంజ్ లో గట్టిగా పోటీ పడ్డారు ఇంటి సభ్యులు. ఇక ఈ వారం ఇంటి సభ్యుల ఆట తీరు, ప్రవర్తన తీరును రివ్యూ చేసేందుకు హోస్ట్ నాగార్జున వచ్చేశారు.

ఏంటీ నేను చెప్పాలా..

ఏంటీ నేను చెప్పాలా..

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ డిసెంబర్ 10 శనివారం నాటి 97వ రోజు ఎపిసోడ్ రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ రెండో ప్రోమోలో ఇంటి సభ్యుల ఎలిమినేషన్ గురించి చర్చించారు హోస్ట్ నాగార్జున. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు.. ఎవరు ఇంటికి వెళ్లబోతున్నారు చెప్పాలి అని శ్రీహాన్ ను అడిగారు నాగార్జున. దీంతో షాక్ అయిన శ్రీహాన్ నేను చెప్పాలా అని అడిగాడు. అవును, నీ ఉద్దేశం ప్రకారం అని తర్వాత నాగార్జున అన్నారు.

శ్రీహాన్ ప్రకారం రోహిత్ ఎలిమినేట్..

శ్రీహాన్ ప్రకారం రోహిత్ ఎలిమినేట్..

నాగార్జున అలా అనడంతో అందరూ ఎవరు పేరు చెబుతాడా అని శ్రీహాన్ ను చూశారు. తర్వాత నీకు ఏవో లెక్కలు ఉంటాయి కదా, కామెంట్ చేసి ఉంటావ్.. విన్నర్ క్వాలిటీస్ లేవా.. అంటే ఊరికే ఆడేస్తున్నావా అని నాగార్జున గట్టిగా అడిగారు నాగార్జున. దానికి లేదు సార్.. ఉన్నాయి అని చెప్పి బాగా ఆలోచించుకుని రోహిత్ పేరు చెప్పాడు శ్రీహాన్. శ్రీహాన్ క్యాలుక్యేషన్ ప్రకారం రోహిత్ వెళ్తున్నాడు అని నాగార్జున తెలిపారు.

ఎప్పుడు భయపడని ఇనయా..

ఎప్పుడు భయపడని ఇనయా..

కీర్తిని అడగ్గా.. ఆమె భారంగా ఆలోచించి.. ఆదిరెడ్డి గారు ఏమో అని అనుకుంటున్నాను సార్ అని చెప్పింది. కీర్తి ప్రకారం ఆదిరెడ్డి అవుట్ అని నాగార్జున అన్నాడు. తర్వాత రేవంత్ ప్రకారం ఎవరు అని నాగార్జున అడిగితే.. రేవంత్ కూడా బాగా ఆలోచించి.. అటు ఇటు అందరి మొహాలు చూసి.. తల పట్టుకున్నాడు. ఎప్పుడు ఎవిక్షన్ ప్రాసెస్ కి భయపడని ఇనయా.. నిన్న నాకు కొంచెం భయం వేస్తుంది అన్నారు సార్ అని రేవంత్ అన్నాడు.

మీ మనసులో ఇలా ఉందా..

మీ మనసులో ఇలా ఉందా..

ఇనయా భయం వేస్తుందని రేవంత్ చెప్పడంతో.. రియాక్ట్ అయిన ఇనయా.. నిన్నే కదా నన్ను టాప్ 5 కంటెస్టెంట్ అన్నారు. మళ్లీ మీ మనసులో ఇలా ఉందా అని అడిగింది. అంటే ఆమె చెప్పిన ప్రకారం అని రేవంత్ వివరణ ఇచ్చుకోబోతుంటే. ఆమె చెప్పిన ప్రకారం కాదు మీ అభిప్రాయం ప్రకారం అడిగింది ఇక్కడ అని ఇనయా గట్టిగానే అంది.

నాగార్జున కొత్త చిచ్చు..

నిన్నే సార్.. టాప్ 5 కంటెస్టెంట్ వి.. నువ్ వెళ్లవు.. అని అది ఇది చాలా చెప్పారని ఇనయా అంటే.. నీకు చెప్పాడు. కానీ అతని మనసులో ఉంది ఇది అని నాగార్జున అన్నారు. ఇదంతా చూస్తుంటే ఆట మరింత రసవత్తరంగా మారటానికి ఇంటి సభ్యుల మధ్య నాగార్జున కొత్త చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X