Bigg Boss Elimination: ఓటింగ్ చివర్లో ట్విస్ట్.. లాస్ట్‌లో ఉన్న కంటెస్టెంట్ సేఫ్.. ఆ బ్యూటీనే ఔట్!
కొందరు కంటెస్టెంట్లను ఒక ఇంట్లో ఉంచడం.. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులు ఇచ్చి ఆడించడం.. ఈ క్రమంలోనే ఇంటి సభ్యుల మధ్య రకరకాల ఎమోషన్స్ పండేలా ప్లాన్ చేయడం.. మొత్తానికి ప్రేక్షకులకు మజాను పంచడం.. ఇదే బిగ్ బాస్ షో జరిగే తీరు. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో నడుస్తుంది కాబట్టే దీనికి తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా మన దగ్గర ఇది ఏమాత్రం గ్యాప్ లేకుండా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే పలు సీజన్లను కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు ఆరోది కూడా రన్ అవుతోంది. ఇక, ఈ సీజన్‌లో మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

మరింత మజాను అందిస్తోంది
తెలుగులో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన స్పందనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే ఇది ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నిర్వహకులు గత ఆదివారం ఆరో దాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారు. దీంతో ఇది మజాను అందించనుంది.

21 మందితో సరికొత్త రికార్డుతో
తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఈ సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

నామినేషన్ ఛేంజ్... ఫస్ట్ వీక్
సాధారణంగా బిగ్ బాస్ లో నామినేషన్స్ ప్రక్రియ సోమవారం రాత్రి ప్రసారం అవుతుంది. కానీ, ఆరో సీజన్‌లో మాత్రం బుధవారానికి మార్చారు. ఇక, ఈ సీజన్‌లో మొదటి వారానికి సంబంధించిన ప్రక్రియ రచ్చ రచ్చగా సాగింది. ఒక కంటెస్టెంట్ ఇద్దరిని ఎంపిక చేసుకుని.. ఆ పేర్లను టాయిలెట్‌లో వేయాలి. ఈ వారం టాస్కులో ముగ్గురు సేఫ్ అవగా.. ముగ్గురు డైరెక్టుగా నామినేట్ అయ్యారు.

ఈ వారం ఏడుగురు నామినేట్
తాజా సీజన్‌లో మొదటి వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కొన్ని గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. ఇందులో మొత్తం ఏడుగురు బాలాదిత్య, రేవంత్, ఫైమా, శ్రీ సత్య, ఇనాయా సుల్తానా, అభినయశ్రీ, చలాకీ చంటి నామినేట్ అయ్యారు. అయితే, క్లాస్‌లో ఉన్న సభ్యులు స్పెషల్ అధికారంతో బాలాదిత్యను అరోహీ రావ్‌తో స్వైప్ చేశారు. దీంతో ఆమె కూడా నామినేట్ అయింది.

మారిన టాప్.. తేడా తక్కువగా
ఆరో సీజన్ మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగినట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్ ఫైమా, రేవంత్ పోటీ పడ్డారట. దీంతో వీళ్ల ప్లేస్‌లలో తరచూ మార్పులు కనిపించాయని తెలిసింది. ఇక, శుక్రవారం రాత్రి ఓటింగ్ ముగిసే సమయానికి రేవంత్ టాప్‌లో ఉన్నట్లు ఓ న్యూస్ లీకైంది.

ఎవరికి ఏ స్థానం దక్కిందంటే
బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారంలో జరిగిన ఓటింగ్‌లో రేవంత్, ఫైమా టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగినట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం ఓటింగ్ ముగిసే సమయానికి మూడో స్థానంలో శ్రీ సత్య, నాలుగో స్థానంలో చలాకీ చంటి, ఐదో స్థానంలో అభినయశ్రీలు ఉండి సేఫ్ అయ్యారని తెలిసింది.

మొదటి వారం ఆమె బయటకే
మొదటి వారానికి సంబంధించి జరిగిన ఓటింగ్‌లో ఊహించని విధంగా నామినేట్ అయిన అరోహీ రావ్, గొడవలో రెచ్చిపోతోన్న ఇనాయా సుల్తానా చివరి స్థానాల్లో ఉన్నారట. అంటే వీళ్లిద్దరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇనాయానే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని టాక్.


Click it and Unblock the Notifications











