Don't Miss!
- News మేషరాశిలో బుధగ్రహ దహనం.. ఈ రాశులవారికి ప్రేమ, దాంపత్య జీవితంలో కష్టాలు!!
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
Bigg Boss Elimination: బిగ్ షాకింగ్.. వారం మధ్యలో మరో ఎలిమినేషన్? చరిత్రలోనే ఇది తొలిసారి!
ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ సెప్టెంబర్ 4న ప్రారంభమైంది. ఈ సీజన్ ఇప్పుడు దాదాపుగా పూర్తి కావొస్తుంది. బిగ్ బాస్ తెలుగు 6 ఇప్పటికీ 83 రోజులు 84 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. టైటిల్ విన్నర్ ను ప్రకటించేందుకు ఇంకో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇన్ని రోజుల్లోఅనూహ్య పరిణామాలు, విచిత్ర సంఘటలు, రొమాన్సులు, అరుపులు, గొడవలు, విభేదాలు, స్నేహం, శత్రుత్వం వంటి అనేక ఎమోషన్స్, సీన్స్ తో బాగానే రక్తికట్టించారు ఇంటి సభ్యులు.
ఈ బిగ్ బాస్ సీజన్ 6 హౌజ్ నుంచి ఒక్కొక్కరుగా తమ ఇంటి బాట పడుతున్నారు. తాజాగా 12వ వారం రాజశేఖర్ ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే 13వ వారం మధ్యలో మరో ఎలిమినేషన్ ను పెట్టి బిగ్ బాస్ టీమ్ షాక్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2017లో తొలిసారిగా..
విపరీతమైన ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది. తొలుత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సక్సెస్ సాధించడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది.
ఆరో సీజన్ కి 21 మంది ఎంట్రీ..
వరుస పెట్టి సీజన్లతో ముందుకు సాగుతున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సెప్టెంబర్ 4న ఆరో సీజన్ ను ప్రారంభించారు. ఈ 6వ సీజన్లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావు, రేవంత్‌లు ఇలా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు.
హౌజ్ లో ప్రస్తుతం 8 మంది..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 12 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. తాజాగా 12వ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంచారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్ 13 మంది వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం హౌజ్ లో 8 మంది మిగిలారు.
నామినేషన్స్ చిత్రీకరణ పూర్తి..
తాజాగా జరిగిన 12వ వారం ఎలిమినేషన్ లో ఫైమా వద్ద ఉన్న ఫ్రీ ఎవిక్షన్ పాస్ తో కొద్దిసేపు సస్పెన్స్ క్రియేట్ చేశారు. ముందుగా ఆ ఫ్రీ ఎవిక్షన్ పాస్ ను రాజ్ కోసం వాడతానని చెప్పినా ఫైనల్ గా తనకోసమే వాడుకుంది. దీంతో రాజ్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇక బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 13వ వారం నామినేషన్స్ కు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తియినట్లు సమాచారం.
నామినేషన్ లో ఆరుగురు..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ అయినా కారణంగా ఇనయా సుల్తానా, ఎవరు నామినేట్ చేయనందున శ్రీహాన్ సేఫ్ అయినట్లు తెలుస్తోంది. అంటే మిగతా ఇంటి సభ్యులు అయినా రోహిత్, రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి భట్ ఆరుగురు నామినేట్ అయ్యారని ఓ సమాచారం అందింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు వీకెండ్స్ లోనే ఎలిమినేషన్ ప్రక్రియను పెడతారన్న విషయం తెలిసిందే.
ఎలాంటి ఓటింగ్ తో ఎలిమినేషన్..
శని, ఆది వారాల్లో అయితే సింగిల్ ఎలిమినేషన్ లేదా డబుల్ ఎలిమినేషన్ ద్వారా కంటెస్టెంట్లను బయటకు పంపిస్తారు. కానీ బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ ఎలిమినేషన్ ను ఈ వారం మధ్యలో పెట్టనున్నారట. మంగళవారం ఒక టాస్క్ పెట్టి ఒక ఇంటి సభ్యుడిని బీబీ టీమ్ ఎలిమినేట్ చేయనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎలిమినేషన్ ప్రేక్షకుల ఓటింగ్ బట్టి ఉంటుందా? లేదా హౌజ్ మేట్స్ ఓటింగ్ ద్వారా ఉంటుందనేది తెలియరాలేదు.
బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారిగా..
ఒకవేళ హౌజ్ మేట్స్ ఓటింగ్ ద్వారా ఉంటే మాత్రం ఫేవరిజం వల్ల ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు గేమ్స్, టాస్క్ లు, బెస్ట్ అండ్ వరెస్ట్ కంటెస్టెంట్ లను ఇలా ఫేవరిజంతోనే ఎన్నుకున్నారు. అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకవేళ ఇదే జరిగితే బిగ్ బాస్ చరిత్రలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టిన సీజన్ గా బిగ్ బాస్ తెలుగు 6 నిలుస్తుంది.