For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6 Elimination: షాకింగ్‌గా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఇంటి నుంచి అవుట్ ఎవరంటే?

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికీ ఈ సీజన్ 82 రోజులు 83 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. టైటిల్ విన్నర్ ను ప్రకటించేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇన్ని రోజుల్లోఅనూహ్య పరిణామాలు, విచిత్ర సంఘటలు, రొమాన్సులు, అరుపులు, గొడవలు, విభేదాలు, స్నేహం, శత్రుత్వం వంటి అనేక ఎమోషన్స్, సీన్స్ తో బాగానే రక్తికట్టించారు ఇంటి సభ్యులు. ఈ బిగ్ బాస్ సీజన్ 6 హౌజ్ నుంచి ఒక్కొక్కరుగా తమ ఇంటి బాట పడుతున్నారు. ఇప్పుడు మరొకరు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడి వెళ్లిపోయినట్లు బీబీ వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ వివరాళ్లోకి వెళితే..

   వరుసపెట్టి సీజన్లతో ముందుకు..

  వరుసపెట్టి సీజన్లతో ముందుకు..

  అశేష ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రధానంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో మొదట హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో ప్రారంభించారు. ఇది సక్సెస్ కావడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది.

   సెప్టెంబర్ 4న ఆరో సీజన్ ప్రారంభం..

  సెప్టెంబర్ 4న ఆరో సీజన్ ప్రారంభం..

  ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ను ప్రారంభించారు. ఈ 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావు, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు.

  హౌజ్ లో ప్రస్తుతం 9 మంది..

  హౌజ్ లో ప్రస్తుతం 9 మంది..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 11 వారాలకు 12 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం ఇలా 12 మంది వెళ్లిపోయారు. దీంతో హౌజ్ లో 9 మంది మిగిలారు.

   ఫైమా వద్ద ఫ్రీ ఎవిక్షన్ పాస్..

  ఫైమా వద్ద ఫ్రీ ఎవిక్షన్ పాస్..

  బిగ్ బాస్ తెలుగు 6లో 12 వారం నామినేషన్ ప్రక్రియను కన్ఫెషన్ రూమ్ లో పెట్టారు. ఈ నామినేషన్స్ లో కెప్టెన్ అయినా కారణంగా రేవంత్, ఎవరు నామినేట్ చేయనందున కీర్తి భట్ సేఫ్ అయ్యారు. ఇక మిగిలిన ఏడుగురు అంటే శ్రీహాన్, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఫైమా, ఇనయా సుల్తానాలు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వీరిలో ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఫైమా వద్ద ఉంది. ఒకవేళ ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చినా ఆ పాస్ ద్వారా ఫైమా సేఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

  రేవంత్ లేకపోవడంతో..

  రేవంత్ లేకపోవడంతో..

  ఆరో సీజన్ 12వ వారానికి జరిగిన ఓటింగ్స్ అనేక ట్విస్ట్ లతో సాగింది. నామినేషన్స్ లలో రేవంత్ లేకపోవడంతో ఇనయా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత రెండో స్థానంలో శ్రీహానా, ఆదిరెడ్డి మూడు, శ్రీసత్య నాలుగు, రోహిత్ ఐదో ప్లేస్ లో ఉన్నట్లు తెలిసింది. అయితే మిస్స్‌డ్ కాల్స్ ద్వారా మాత్రం రోహిత్ 4, శ్రీసత్య 5వ స్థానంలో ఉన్నట్లు టాక్ వినిపించింది. ఇక ఆరో స్థానంలో రాజ్, 7వ ప్లేస్ లో ఫైమా ఉన్నట్లు తెలిసింది.

  రోజురోజుకీ పెరిగిన గ్రాఫ్..

  రోజురోజుకీ పెరిగిన గ్రాఫ్..

  ఫైమా వద్ద ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఫ్రీ పాస్ ను ఉపయోగించిందో లేదో తెలియదు గానీ, రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అది ఇంక కన్ఫర్మ్ మాత్రం కాలేదు. ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా రాజ్ నామినేషన్లలో లేకపోవడంతో అతనిపై అందరి దృష్టి చాలా తక్కువగా ఉండింది. కానీ రాజ్ మాత్రం తొలి రోజు నుంచి తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. హౌజ్ లో అందరి కంటే అతని గ్రాఫ్ మాత్రం రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది.

  మోడల్ గా ఎంటరై..

  మోడల్ గా ఎంటరై..

  బిగ్ బాస్ హౌజ్ లో మొదట్లో సైలెంట్ గా ఉన్న రాజశేఖర్ తర్వాత తన మాటలను అందరి ముందు ఉంచాడు. మాట్లాడేది తక్కువైనా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడని హౌజ్ మేట్స్ తోపాటు హోస్ట్ నాగార్జున కూడా చాలాసార్లు మెచ్చుకున్నాడు. గతవారం కూడా చెక్ అమౌంట్ టాస్క్ లో తన తెలివి ఉపయోగించే.. నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. అలాగే వాళ్ల మదర్ ని బిగ్ బాస్ హౌజ్ లో చూడాలన్న కోరికను కూడా నెరవేర్చుకున్నాడు. మోడల్ గా ఎంటర్ అయిన రాజ్ అందరిచేత మంచి వ్యక్తి అనిపించుకున్నాడు. రాజ్ గనుక ఎలిమినేట్ అయి బయటకు వెళ్తే మాత్రం మరో మంచి వ్యక్తిగా, పాజిటివ్ టాక్ తో బిగ్ బాస్ హౌజ్ ను వీడినట్లేనని చెప్పవచ్చు.

  English summary
  Bigg Boss Telugu 6 Season Host Nagarjuna Eliminated Model Rajashekar On 12th Week Elimination.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X