Bigg Boss Telugu 6: బాత్రూమ్ లో రేవంత్.. అంత సేపు ఏం పని అంటూ గీతూ టార్గెట్!
బిగ్ బాస్ ఆరో సీజన్ 52వ ఎపిసోడ్లో గతంలో ఎప్పుడు లేనివిధంగా ఊహించిన ట్విస్ట్ లు క్రియేట్ అయ్యాయి. అసలు బిగ్ బాస్ ఆటను ఏ విధంగా కొనసాగించాలు అనుకుంటున్నాడు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే సంచాలక్ గా ఉండాల్సిన వారు గేమ్ ఆడుతుంటే బిగ్ బాస్ మౌనం వహించడం కొంత ఆచార్యాన్ని కలిగిస్తోంది. ఇక దొరికిందే అవకాశంగా రేవంత్ ను ముప్పు తిప్పలు పెట్టేందుకు గీతూ కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తోంది. ప్రతి విషయంలో కూడా అతనతో విబేధిస్తోంది. ఇక బుధవారం ఎపిసోడ్లోని హైలెట్స్ లోకి వెళ్తే..

రేవంత్ ను రెడ్డి టార్గెట్ చేస్తూ..
గీతూ ప్రతి విషయంలో కూడా రేవంత్ ను రెడ్డి టార్గెట్ చేస్తూ ఉండడం హైలైట్ గా నిలిచింది. ఒక విధంగా ఆట నియమాలను కూడా తప్పుతోంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అనవసరంగా రేవంత్ తో పెట్టుకుంటుంది అని సోషల్ మీడియాలో కూడా గట్టిగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక చేపల చెరువు టాస్క్ లో గీతూ ప్రవర్తిస్తున్న తీరు మాత్రం కాస్త ఓవార్ గానే ఉంది అనిపిస్తుంది.

ఆ మాట అనడం కరెక్ట్ కాదు
గీతూపై రేవంత్ కూడా చాలా కోపంగానే ఉన్నాడు. ఆమె ప్రతిసారి కూడా కావాలని తన టార్గెట్ చేస్తుంది అని కూడా చెప్పుకున్నాడు. ముఖ్యంగా నీయబ్బ అనే పదాన్ని కూడా అతను చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆమెకు ఆ పదం వెనక ఉన్న బాధ తెలియకపోవచ్చు అని నాకు మాత్రం తెలుసు అని ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఆత్రుతగా ఉన్నట్లు ఉందని సూర్యతో రేవంత్ చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్ మొత్తం నామినేట్ చేయవచ్చు
గీతూని నామినేట్ చేయడానికి పెద్దగా కారణాలు లేవని కేవలం ఆ ఒక్క మాటతోనే ఆమెను ఈ సీజన్ మొత్తం నామినేట్ చేయవచ్చు అని రేవంత్ సూర్యతో చెప్పాడు. ఇక తనతో పెట్టుకున్నప్పుడు ఏమాత్రం తగ్గేది లేదు అంటూ కూడా అతను గట్టిగానే హెచ్చరికలు చేశాడు. ఇక అదే విషయాన్ని సూర్య గీతతో చర్చించాడు. తనను కావాలని రేవంత్ టార్గెట్ చేస్తున్నాడు అని.. ఇప్పటికీ కూడా తనపై కోపం ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది.

రేవతి కారణంగానే
రేవతి కారణంగానే తను టాస్క్ లో ఓడిపోయాను అని ఇప్పటికి కూడా తనను టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఏమాత్రం తగ్గను అన్నట్లుగానే గీతూ ఆదిరెడ్డితో చెప్పుకొచ్చింది. అయితే చేపలను ఎక్కడ దొంగిలిస్తారో అని రేవంత్ అయితే వాటిని టీషర్టు లోపల దాచుకొని చాలా జాగ్రత్త పడుతూ ఉన్నాడు. ఇక రేవంత్ బాత్రూంలో కూర్చున్న కూడా చాలా సేపు అక్కడే ఉండిపోయాడు.

బాత్రూమ్ లో ఎందుకు ఉన్నాడు?
అయితే రేవంత్ బాత్రూంలో ఎక్కువసేపు ఉండడంతో అతని అంతసేపు లోపల ఎందుకు ఉన్నాడు అని గీతు కామెంట్ చేసింది. అంతేకాకుండా మిగతా వాళ్ళు వెళ్లకూడదా అని వెళ్లి పిలువు అని సూర్యతో చెప్పుకొచ్చింది. ఇక సూర్య వెళ్లే డోర్ కొట్టడంతో రేవంత్ అప్పుడే నిద్రలేచినట్లు కనిపించాడు. బాత్రూంలో పడుకున్నావా అంటూ సూర్య అడిగాడు. అంతే కాకుండా రేవంత్ పరిస్థితిని చూసి అతను నవ్వుకున్నాడు.


Click it and Unblock the Notifications











