Bigg Boss Telugu 6: రేవంత్ కు చుక్కలు చూపించిన గీతూ.. నల్లచేపతో ఊహించని ట్విస్ట్!
బిగ్ బాస్ 6వ సీజన్ 56వ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరమైన ట్విస్ట్ లతో కొనసాగింది. గలాట గీతూ ఆలోచించిన విధానానికి మిగతా హౌస్ మెంట్స్ దిమ్మతిరిగి పోయింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా కొత్త తరహా గేమ్ ఆడిన గీతూ చేపల చెరువు టాస్క్ లో తన శత్రువులకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ టాస్క్ లో ఆమె తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇక పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

రేవంత్ పడుకుంటే..
ప్రతీసారి కెప్టెన్సీ టాస్క్ లో బలంగా పోరాడేందుకు ప్రయత్నం చేసుకుంటూ వచ్చిన గీతూ ఈసారి రేవంత్ కారణంగా మొదటి రౌండ్ లోనే నిష్క్రమించింది. దీంతో అతనిపై ఆమె గట్టిగానే పగ పెంచుకుంది. ఇక అర్ధరాత్రి రేవంత్ పడుకుంటే అతని నుంచి చేపలను దొంగిలించాలని డిసైడ్ అయ్యింది. ఇక మధ్యలో మెరినా ఆమె ఆడుతున్న గేమ్ కరెక్ట్ కాదని కామెంట్ చేసింది.

అందరికి కౌంటర్ ఇవ్వాలని
ఇక మెరినా - బాలదిత్యా జంటగా ఉండి చాలెంజ్ లలో పాల్గొన్నారు. ఇక వారు గీతూ గేమ్ కరెక్ట్ కాదని చెప్పడంతో వారిపై కూడా ఆమె పగ పెంచుకునే ప్రయత్నం చేసింది. ఏ మాత్రం తగ్గకుండా గీతూ అందరికి కౌంటర్ ఇవ్వాలని అనుకుంది. అవసరం అయితే రూల్స్ ని బ్రేక్ చేయాలని కూడా ఆమె మొండిగా ప్రవర్తించడం హౌస్ మెంట్స్ ని ఆశ్చర్యాన్ని కలిగించింది.

అంతా నా ఇష్టం అన్నట్లు
గీతూ - ఆదిరెడ్డి సంచాలక్ గా ఉంటూ టాస్క్ ను కొనసాగించారు. ఈ ట్విస్ట్ తోనే హౌస్ మెంట్స్ కి సగం మ్యాటర్ అర్ధమయ్యింది. తప్పకుండా గీతూ ఎదో ఒకటి చేస్తుందని అనుకున్నారు. చేపల చెరువు టాస్క్ లో సంచాలక్ గా ఉన్న గీతూ గేమ్ ను పర్యవేక్షించాలి కానీ ఆమె కూడా చేపలను ఏరుకుంటు కనిపించింది. అదేంటని అడిగితే అంతా నా ఇష్టం అన్నట్లు దాబాయించింది.

దిమ్మతిరిగిపోయింది
మరో సంచాలక్ గా ఉన్న ఆదిరెడ్డి సంచాలక్ గా ఉండి నువ్వు ఇలా గేమ్ ఆడడం కరెక్ట్ కాదని ఎంత చెప్పినా కూడా నా గేమ్ నన్ను అడనివ్వు అని చెప్పింది. ఇక ఆమె తీరుపై హౌస్ మెంట్స్ కు దిమ్మతిరిగిపోయింది. ఇక ఈ విషయంలో బిగ్ బాస్ నుంచి కూడా ఎలాంటి నోటీస్ రాకపోవడం మరో షాకింగ్ విషయం.

ఛాన్స్ దొరికినప్పుడల్లా
ఇక రేవంత్ కూడా గీతూ విషయంలో గోడవపడుతూనే ఉన్నాడు. ఇక అతనిపై ఛాన్స్ దొరికినప్పుడల్లా గీతూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక పూల్ లోకి రేవంత్ మైక్ ధరించి దూకడంతో 10 చేపలను జరిమానగా విధించింది. రేవంత్ అయితే గీతూ తీరుపై వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. ఇక గీతూ అంపైర్ లా ఉన్నప్పటికీ బాల్ పట్టుకుంది అని బాలదిత్యా గట్టి కౌంటర్ ఇచ్చాడు.

నల్లచేపతో బిగ్ ట్విస్ట్
ఇక చివరలో అయితే గీతూ నల్ల చేపతో మరో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. నల్ల చేప ఎవరికైతే దొరికిందో వారికి స్వాప్ చేసే శక్తి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ముసి ముసిగా నవ్వుకుంటూ వచ్చిన గీతూ నల్లచేప లోపల నుంచి తీసుకు వచ్చిన గీతూ.. రేవంత్- ఇనయ/ శ్రీహాన్- శ్రీసత్య జంటల్ని స్వాప్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆటలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక మళ్ళీ రేవంత్ తన నోటికి పని చెప్పాడు. అయినప్పటికీ గీతూ గేమ్ చెంజర్ అన్నట్లు కొనసాగుతోంది. మరి రాబోయే టాస్క్ లో ఇంకా గీతూ ఎలా మాట్లాడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











