Bigg Boss Telugu 6: అందరూ ఒకవైపు ఆదిరెడ్డి మరోవైపు.. శ్రీసత్యతో శ్రీహాన్ రొమాంటిక్ త్యాగాలు

బిగ్ బాస్ ఈసారి ఆటను చాలా తెలివిగా కొనసాగిస్తున్నాడు అని చెప్పవచ్చు. మధ్యలో టాస్కులు కేవలం అక్కడి వరకే ప్రభావం చూపకుండా ఫైనల్స్ లో కూడా ఎంతో కొంత ప్రభావం చూపించే విధంగా టెస్టులు పెడుతున్నాడు. ఇక ఈసారి ప్రైజ్ మనీ విషయంలో కూడా బిగ్ బాస్ చాలా లాజిక్స్ ఉపయోగిస్తున్నాడు. ఇక ఎవిక్షన్ పాస్ విషయంలో కూడా దాదాపు అదే తరహాలో ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఎలక్షన్ పాస్ కు సంబంధించిన గేమ్ హైలెట్ కాబోతోంది. ఆ వివరాలలోకి వెళితే..

ఎవిక్షన్ పాస్ వద్దని అనిపిస్తుంది

ఎవిక్షన్ పాస్ వద్దని అనిపిస్తుంది

బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఎవిక్షన్ పాస్ ను గెలుచుకునే ఒక అమూల్యమైన అవకాశం ఇవ్వబోతున్నాడు. ఏ ముగ్గురైతే ముందుగా ఒక్కో స్లాట్నీ కొనుక్కుంటారో వారు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కు పోటీపడే అవకాశం పొందుతారు. ఇక ఈ పాస్ విషయంలో ఆదిరెడ్డి vs ఇంటి సభ్యుల మధ్యలో కూడా చాలా భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవిక్షన్ పాస్ వద్దని అనిపిస్తుంది అని ఆదిరెడ్డి ఓపెన్ గా చెప్పేసాడు.

నా టాస్క్ ఏమిటి అంటే..

నా టాస్క్ ఏమిటి అంటే..

ఇక ఇనయా మరోసారి కలుగజేసుకొని మీరు ఎప్పుడూ వాడతారు అనేది ఇంపార్టెంట్ కాదు. బిగ్ బాస్ అనేది ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దాంట్లో పాల్గొనాలి కదా అని ఆమె ఆదికి కౌంటర్ ఇచ్చింది. ఇక ఆది చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. నా టాస్క్ ఏమిటి అంటే ఈ టాస్క్ ఆడకూడదు అనేది కూడా ఒక టాస్క్ అని ఆన్సర్ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

నువ్వు విన్నర్ కాకపోతే

నువ్వు విన్నర్ కాకపోతే

శాడిస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే నువ్వు విన్నర్ కాకపోతే వేరేవాడు డబ్బులతో నువ్వు ఈ వీక్ ఉంటున్నావు అని ఫైమాకు ఆన్సర్ ఇచ్చాడు. దీంతో అతను చాలా సైలెంట్ గా వెనుకబడినట్లు అనిపిస్తోంది. అలాగే ఎవిక్షన్ పాస్ పాస్ ఉన్నోళ్లకి ఇంకొక రిస్క్ కూడా ఉంది అని శ్రీహాన్ నవ్వుతూ చెప్పాడు. ఇక ఆదిరెడ్డి కూడా ఫైమా బజార్ నొక్కడంతో ఆమెకు ఒక సలహా ఇచ్చాడు. నువ్వు పాస్ ఎప్పుడు వాడతావ్ అనేది బిగ్ బాస్ నిర్ణయం. కానీ అప్పుడు ఆడియన్స్ ఓట్లు వేయరు అని చెప్పాడు.

నిర్ణయాలు మనం మార్చలేము

నిర్ణయాలు మనం మార్చలేము

ఇక రేవంత్ తనదైన శైలిలో మరో విధంగా స్పందించాడు. ఈ గేమ్ లో ఉంటేనే కదా అక్కడి వరకు వెళ్లేది అని పాస్ గురించి ఏదో చెబుతూ వెళ్ళాడు. ఆది రెడ్డి అయితే అందరి నిర్ణయాలు మనం మార్చలేము అని అన్నాడు. సెల్ఫ్ డెసిషన్ అని ఆది చాలా ఓపెన్ గా చెప్పాడు. ఇక రేవంత్ బజర్ కూడా నొక్కాడు. ఇక రేవంత్ అయితే పరిస్థితిని బట్టి బిహేవ్ చేయాలని అనుకుంటాడు అని ఆదిరెడ్డి తన రివ్యూ ఇచ్చాడు.

శ్రీ సత్య కోసం శ్రీహాన్ త్యాగం మాటలు

శ్రీ సత్య కోసం శ్రీహాన్ త్యాగం మాటలు

ఇక శ్రీహన్ కూడా బజార్ నొక్కాడు. మరోవైపు శ్రీహన్ బజార్ నొక్కగానే శ్రీ సత్య రాజకీయాలు మొదలుపెట్టింది. ఎవరికోసం నువ్వు వాడినా కేవలం ఒక వారం మాత్రమే ఉంటారు అని ఆమె చెప్పడంతో ఒకవేళ నీకోసం వాడినా నువ్వు వారం రోజులు ఉంటావు కదా.. అది నాకు లక్ష యాభై వేల కంటే ఎక్కువ అని పులిహోర కలిపేసాడు. దీంతో శ్రీ సత్య షాక్ అయినట్లు భావాలు చూపించింది. 1,50,000 అయినా రెండు లక్షలైనా సరే నువ్వు నాతో ఉంటావు అంటే ఆ అమౌంట్ లో కట్ చేసినా ఓకే అని శ్రీహన్ స్పందించిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక శ్రీ సత్య కూడా ఏమీ అనాలో తెలియక సిగ్గుపడిపోయింది. మరి వీరి మధ్య ట్రాక్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X