Bigg Boss Nominations: 13వ వారం నామినేషన్ లిస్ట్ లీక్.. ఆ ఇద్దరు తప్ప అంతా.. వాళ్ల మధ్య భీకర ఫైట్

తెలుగు బుల్లితెరపై సంచలనాలను సృష్టిస్తూ దేశంలోనే నెంబర్ వన్ షో అనిపించుకుంటూ హవాను చూపిస్తోంది బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ రియాలిటీ షోకు ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. దీంతో ఇది కూడా చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 13వ వారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? ఎవరు నామినేట్ అయ్యారు? చూద్దామా!

క్రమంగా పెరుగుతోన్న రెస్పాన్స్

క్రమంగా పెరుగుతోన్న రెస్పాన్స్

తెలుగులో బిగ్ బాస్ షోకు మాత్రమే అన్నింటి కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంటుంది. ఇది సీజన్ సీజన్‌కు పెరుగుతూ వచ్చింది. కానీ, ఆరోది మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. మరీ ముఖ్యంగా ఆరంభంలో దీనికి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. అయితే, ఇది ఇప్పుడు చివరి దశకు చేరడంతో స్పందన పెరుగుతోంది. ఫలితంగా రేటింగ్ కూడా క్రమక్రమంగా పెరుగుతోంది.

షో నుంచి వాళ్లంతా ఎలిమినేట్

షో నుంచి వాళ్లంతా ఎలిమినేట్

గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, ఒక్కోసారి డబుల్ ఎలిమినేషన్ పెట్టడం వల్ల ఇద్దరేసి కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనా, రాజశేఖర్‌లు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

ఊహించని ఎలిమినేషన్స్ వల్ల

ఊహించని ఎలిమినేషన్స్ వల్ల

ప్రస్తుతం నడుస్తోన్న ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఎన్నో ట్విస్టులతో సాగాయని తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇందులో టాప్ ప్లేయర్లు అనుకున్న వాళ్లు చాలా మంది ఎలిమినేట్ అయిపోయారు. ఫలితంగా నామినేషన్స్ టాస్కులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పదమూడో వారం నామినేషన్స్ టాస్కు మీద అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి.

13వ వారం నామినేషన్ టాస్కు

13వ వారం నామినేషన్ టాస్కు

ఆరో సీజన్‌లో నామినేషన్స్ టాస్కును కొత్తగా డిజైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పదమూడో వారానికి సంబంధించి.. ఒక కంటెస్టెంట్ తాను నామినేట్ చేసే ఇద్దరు సభ్యులను కెనాన్ (ఫిరంగి) దగ్గరకు తీసుకెళ్లి.. వారి ముఖాన్ని స్టాండ్‌పై పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు వారిపై రంగు వస్తుంది. అలాగే, అందుకు తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుందని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ చెప్పాడు.

వాళ్ల మధ్య భారీ స్థాయి ఫైట్స్

వాళ్ల మధ్య భారీ స్థాయి ఫైట్స్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కూడా నామినేషన్స్ టాస్కులు అన్నీ గొడవలతో ఎంతో రచ్చ రచ్చగా సాగుతున్నాయి. ప్రతి వారం కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడిది చివరికి చేరడంతో గొడవలు ఎక్కువ కనిపించాయని తెలిసింది. ముఖ్యంగా ఆది రెడ్డి, రేవంత్ మధ్య భీకరమైన మాటల యుద్ధం సాగిందట. అలాగే, మరికొన్ని గొడవలూ జరిగాయట.

ఈసారి ఆ ఆరుగురు నామినేట్

ఈసారి ఆ ఆరుగురు నామినేట్

తాజాగా ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లోని పదమూడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసినట్లు తెలిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారని సమాచారం. అందులో రోహిత్, ఫైమా, కీర్తి భట్, రేవంత్, ఆది రెడ్డి, శ్రీ సత్యలు ఈ వారానికి గానూ నామినేషన్‌లో ఉన్నట్లు తెలిసింది.

అతడు ఎలా మిస్ అయ్యాడో!

అతడు ఎలా మిస్ అయ్యాడో!

ప్రస్తుత సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పదమూడు మంది ఎలిమినేట్ అవడంతో ఇప్పుడు 8 మందే మిగిలారు. అందులో ఇనాయా సుల్తానా ఈ వారం కెప్టెన్ కావడంతో నామినేషన్ తప్పించుకుంది. ఆమెతో పాటు శ్రీహాన్ కూడా సేఫ్ అయ్యాడని తెలిసింది. దీంతో అతడెలా తప్పించుకున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X