Bigg Boss Telugu 6: రేవంత్ ను ఇమిటేట్ చేసిన ఫైమా.. కోడిలా ఇనయా, ఫన్నీగా టాస్కులు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ ఇప్పటికి 69 రోజులు 70 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. అంటే దాదాపుగా ఈ సీజన్ చివరి దశకు చేరుకున్నట్లే అని తెలుస్తోంది. తాజాగా శనివారం ఎలిమినేట్ అయిన బాలాదిత్యతో మొత్తం 10 మంది ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందన్న విషయం తెలిసిందే. ఆదివారం మరొకరి ఎలిమినేషన్ తర్వాత హౌజ్ లో 10 మంది (21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ) మాత్రమే మిగులుతారు. ఆదివారం ఎలిమినేషన్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

10 వారాలు పూర్తి చేసుకున్న 6 సీజన్..
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్లు అడుగు పెట్టగా ఇప్పటికి 10 వారాలు పూర్తి చేసుకుంది. ఈ పది వారాల్లో తాజాగా ప్రసారమైన శనివారం ఎపిసోడ్ లో బాలాదిత్య ఎలిమినేషన్ తో 10 మంది బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. పదోవారం డబుల్ ఎలిమినేషన్ కారణంగా ఇవాళ అంటే నవంబర్ 13న మరొకరు ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌజ్ వీడనున్నారు.

చిన్నప్పటి ఫొటోలు చూపించి..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ నవంబర్ 13 ఆదివారం నాటి ఎపిసోడ్ రెండో ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఈ ప్రోమోలో ఈ వారం రెండో ఎలిమినేషన్ గురించి చూపించారు. ఆదివారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులతో నాగార్జున గేమ్స్ ఆడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ప్రోమోలో చిన్నప్పటి ఫొటోలు చూపించి వారు ఎవరో గుర్తు పట్టాలని నాగార్జున చెప్పారు.

నాలుక బయటపెట్టి పాడమని..
ఆ చైల్డ్ హుడ్ ఫొటో చెప్పాలంటే పక్కనున్న బెల్ కొట్టాలి. అయితే బెల్ కొట్టిన తర్వాత సరైనా ఆన్సర్ చెప్పకపోతే.. వాళ్లకు ఇచ్చిన టాస్క్ చేయాలని నాగార్జున తెలిపారు. ఒకరి చిన్నప్పటి ఫొటో ఇచ్చారు. రేవంత్ బెల్ కొట్టి శ్రీసత్య అని చెప్పాడు. కానీ అది రాంగ్ అని చెప్పిన నాగార్జున నాలుక బయటపెట్టి తెలుగు పాట పాడాల్సిందిగా చెప్పాడు. దీంతో రేవంత్ అలాగే నాలుకబయట పెట్టి పట్టుకుని పాడి నవ్వించాడు.

రేవంత్ ను ఇమిటేట్ చేస్తూ..
తర్వాత శ్రీహాన్ చిన్నప్పటి ఫొటో ఉంచారు. ఆ ఫొటో చూసిన ఫైమా బెల్ కొట్టబోతుంటే అది ఊడి కిందపడుతుంది. తర్వాత ఫైమాకు ఫొటో సరిగ్గా కనబడకపోయేసరికి మానిటర్ దగ్గరికి వెళ్లి చూసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆ ఫొటో ఉండదు.. నాగార్జున కనిపించేసరికి అయ్యో సార్.. అని ఫైమా అంటే.. ఆ పాపం అని నాగార్జున సెటైర్ వేశారు. దీంతో ఇమిటేషన్ చేస్తావా అని అడిగితే.. రేవంత్ లా ఇమిటేట్ చేసి చూపిస్తుంది ఫైమా.

8వ ఎక్కం చెప్పని వాసంతి..
ఫైమా బాగా చేసిందని మెచ్చుకున్నారు నాగార్జున. తర్వాత వాసంతికి పనిష్ మెంట్ కిందా గొడ కుర్చీ వేసి 8వ ఎక్కం చెప్పాలని నాగార్జున అన్నారు. దీంతో ఇవాళ తేలదు అని రేవంత్ కౌంటర్ వేశాడు. తర్వాత అలాగే గోడ కుర్చీ వేసి వాసంతి 8వ టేబుల్ చెబుతుంది. కానీ చివర్లో తప్పు చెబుతుంది. దీంతో అందరూ నవ్వుతారు. తర్వాత ఇచ్చిన ఫొటో రేవంత్ అని కీర్తి.. రాజ శేఖర్ అని ఇనయా చెబుతుంది.
కోడిలా ఇనయా సుల్తానా..
ఇద్దరు రాంగ్ అవ్వడంతో పనిష్ మెంట్ ఇస్తాడు హోస్ట్ నాగార్జున. ఇనయాకు కోడి లాగా జంప్ చేస్తూ పాట పాడాలని చెప్పాడు నాగార్జున. చివరిగా ఎలిమినేషన్ ప్రాసెస్ లో వాసంతి అండ్ మెరీనా ఉంటారు. వారి చేతుల్లోని ఫ్లవర్ ను వాళ్ల ముందు ఉన్న వాటర్ లో ముంచమంటారు. అలా చేశాకా వారిలో ఎవరి ఫ్లవర్ రెడ్ గా మారితే వారు ఎలిమినేట్ అయినట్లు చెబుతాడు నాగార్జున. అయితే ఆదివారం డబుల్ ఎలిమినేషన్ కింద వాసంతి కృష్ణన్ హౌజ్ నుంచి బయటకు వెళ్లనుందని టాక్.


Click it and Unblock the Notifications











