twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: గుండెను పిండేసిన బిగ్ బాస్.. నడవలేని స్థితిలో శ్రీసత్య తల్లి.. భయం కలిగించిన రేవంత్

    |

    బిగ్ బాస్ లో మళ్ళీ ఎమోషనల్ ఫ్యామిలీ సీన్స్ హైలెట్ కాబోతున్నాయి. ప్రతి సీజన్లో కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులను కలుసుకునే విధానం ఎంతో ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఎన్నో రోజులు ఇంట్లో వాళ్లకు దూరంగా ఉంటూ ఓపికతో ఉండే కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ ఒక్కసారిగా కుటుంబ సభ్యులను ఇంట్లోకి రప్పిస్తూ బాధ పెడుతూ ఉంటాడు.

    అందరూ కూడా వారి తల్లిదండ్రులను బంధువులను చూడగానే ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ ఒక్కొక్కరి కుటుంబ సభ్యులను చూపిస్తూ సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళ్తే..

     ఐ లవ్ యు

    ఐ లవ్ యు

    ముందుగా ఈరోజు ఫైమా తల్లిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చారు. ఇక సత్య అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్న విధానం పై స్పందిస్తూ నాకు కూడా ఇంగ్లీష్ నేర్పించు అని ఫైమా తల్లి అడిగింది. ఇక ఐ లవ్ యు అనే పదం నేర్పిస్తాను అని చెప్పడంతో ఫైమా తల్లి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇక ఫైమా కాకుండా ఎవరు మీ ఫెవరేట్ ప్లేయర్ అని అడిగినప్పుడు అందరూ నా ఫేవరెట్ ప్లేయర్స్ అంటూ ఫైమా తల్లి వివరణ ఇచ్చింది.

    నిన్ను చూస్తేనే భయం వేస్తుంది

    నిన్ను చూస్తేనే భయం వేస్తుంది

    ఇక శ్రీహన్ అయితే సరదాగా మా అందరి కన్నా మీరు బాగా ఆడుతున్నారు అని సెటైర్ వేశాడు. ఇక రేవంత్ ను చూసి.. ఫైమా తల్లి నిన్ను చూస్తేనే భయం వేస్తుంది అని చెప్పింది. అయితే పక్కనే ఉన్న శ్రీహాన్ మీరు కనుక ఈ ఆటలో ఉండి ఉంటే మరో వారం మిమ్మల్ని నామినేట్ చేసేవాడు అని సరదాగా జోక్ చేశాడు. ఇక నేను చేసిన వంటకాన్ని తిను అంటూ ఫైమా మాత్రమే తల్లికి తినిపించింది.

    తన తల్లిని పైకి ఎత్తుకొని

    తన తల్లిని పైకి ఎత్తుకొని

    ఇక ఫైమా మదర్ ఇచ్చిన హావభావాలకు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో నవ్వుతూ కనిపించారు. ఇక బయట నేను వెళుతుంటే చాలామంది పలకరిస్తున్నారు అని చెప్పడంతో ఫైమా కూడా ఎంతగానో సంతోషించింది. ఇక ఫైమా తల్లి అందరితోనూ డాన్స్ కూడా చేసింది. ఫైమా చివరికి తన తల్లిని పైకి ఎత్తుకొని మరి తిప్పేసిందే.

    నడవలేని స్థితిలో శ్రీ సత్య తల్లి

    నడవలేని స్థితిలో శ్రీ సత్య తల్లి

    ఇక తర్వాత శ్రీ సత్య మా మమ్మీ కూడా నడుస్తూ ఉండే బాగుండేది అని చెప్పడంతో ఆమెకు సోను అనే సౌండ్ వినిపించింది. ఇక నడవలేని స్థితిలో వీల్ చేయిర్ లో తల్లి రావడంతో శ్రీ సత్య ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంది. ఇంకా శ్రీ సత్య తండ్రి కూడా రావడంతో ఆమె ఒక్కసారిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. ఇక శ్రీ సత్య తల్లికి భోజనం కూడా తినిపించింది.

    పిచ్చిపిచ్చి నామినేషన్లు

    ఇక శ్రీ సత్య నామినేషన్ల గురించి మాట్లాడింది. నువ్వు కూడా పిచ్చిపిచ్చి నామినేషన్లు వేస్తున్నావు అని ఆమెకు తండ్రి సరదాగా కౌంటర్ ఇచ్చాడు. ఇక తల్లిదండ్రులు వెళ్లిపోయే సమయంలో శ్రీ సత్య మరింత బాధపడుతూ కనిపించింది. తండ్రి వెళ్ళిపోతూ తన కూతురి నుదుటిపై ముద్దు కూడా పెట్టాడు. మొత్తంగా ఈరోజు బిగ్ బాస్ ఊహించని స్థాయిలో ప్రేక్షకులను కంటతడి పెట్టించబోతున్నట్లు అనిపిస్తుంది.

    English summary
    Bigg boss telugu 6 faima mother and sri satya mother emotional entry
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X