బ్యాంకాక్‌లో గీతూ రాయల్ అలాంటి పని .. సమంత తరహా ప్రాణాంతక వ్యాధి.. అసలేం జరిగిందంటే?
జీవితంలో ఎన్నో కష్టనష్టాలను తట్టుకుని కెరీర్‌లో ఓ స్థాయికి వచ్చిన తర్వాత సినీతారలు ఊహించని అనారోగ్యానికి గురవుతున్నారు. నాటి బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో నటీనటులు అనారోగ్యం బారినపడి కెరీర్‌ను అర్థాంతరంగా ముగిస్తున్నారు. వీరిలో కొందరు కోలుకుని తారాపథంలో దూసుకెళ్లగా, మరికొందరు ఈ రేసులో ఓడిపోతున్నారు. ఒకవేళ అనారోగ్యానికి గురైనా కొందరు ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక.. చెబితే కెరీర్ దెబ్బతింటుందనే భయంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ బాంబు పేల్చారు. గత 5 నెలలుగా ఓ అనారోగ్య సమస్యతో తాను బాధపడుతున్నానని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు.
బిగ్‌బాస్ షోకు రివ్యూలు చెబుతూ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన గీతూ రాయల్.. ఆ పాపులారిటీతోనే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. చిత్తూరు యాసతో ఆమె వదిలే పంచ్ డైలాగ్‌లకు విజిల్స్ పడాల్సిందే. బిగ్‌బాస్‌లో తన తెలివితేటలతో టైటిల్ రేసులో నిలిచినా అనూహ్యంగా మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయినా తిరిగి బిగ్‌బాస్ 7 బజ్ షోకు యాంకర్‌గానూ వ్యవహరించి తన స్కిల్స్ చూపింది. కెరీర్‌లో ఎదుగుతున్న వేళ తనకున్న హెల్త్ ఇష్యూస్ గురించి బయటచెప్పి గీతూ షాకిచ్చింది.

గీతూ రాయల్ ఆరోగ్యం బాలేదని, ఆసుపత్రిలోనూ చేరిందని నేరుగా అక్కడికే వెళ్లి వీడియో తీసి పోస్ట్ చేశాడు యాంకర్ ధనుష్. బ్యాంకాక్ వెళ్లినప్పుడు వెరైటీగా వుంటుందని బొద్దింకలు, పిట్టలతో చేసిన డిషెస్‌ను ట్రై చేసినట్లుగా గీతూ అతని చెప్పింది. ఈ కారణంగా తనకు అనారోగ్య సమస్యలు వచ్చాయని తెలిపింది.
అనారోగ్యం, ఇతర కారణాల వల్ల విజయవాడ, తిరుచానూరు వెళ్లి అమ్మవారిని కూడా దర్శించుకోలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాతి నుంచి తనను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని తెలిపింది. కోట్లలో ఒకరిగా వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తనకు వచ్చిందని .. రెండేళ్ల పాటు చికిత్స తీసుకోవాల్సి వుంటుందని తన పరిస్ధితిని వివరించింది. సరైన తిండి, నిద్ర లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని గీతూ రాయల్ చెప్పింది.

కొద్దిరోజుల క్రితం అగ్ర కథానాయిక సమంత తాను ''మయోసైటిస్'' అనే వ్యాధి బారినట్లు సంచలన ప్రకటన చేసి అభిమానులకు, సినీ ప్రపంచానికి షాకిచ్చింది. ఆ తర్వాత మయోసైటిస్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలేంటీ ఆ వ్యాధి.. ఎందుకు వస్తుంది.. దాని లక్షణాలేంటీ అనేది ఒకసారి పరిశీలిస్తే : మయోసైటిస్ అనేది ఒకరకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీని కారణంగా శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. క్రమంగా ఈ వ్యాధి శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. రోజువారీ పనులు చేసుకునేందుకు, నడవటానికి సాయపడే కండరాలలో వాపు, నొప్పి , బలహీనపడటం వంటి సమస్యలు ఎదురవుతాయని వైద్యులు తెలిపారు.
ఈ మయోసైటిస్ ఐదు రకాలని.. అవి పాలిమయోసైటిస్, డెర్మటోమయోసైటిస్, నెక్రోటైజింగ్ మయోపతి, ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్, జువైనెల్ ఫామ్స్ ఆఫ్ మయోసైటిస్. మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్ధ గాడి తప్పడం వల్ల ఈ సమస్య వస్తుందని .. బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా దానితో అదే యుద్ధం చేస్తూ వుంటుందని డాక్టర్లు వెల్లడించారు. మయోసైటిస్‌కు ఖచ్చితమైన చికిత్స లేదని.. కొన్ని రకాల స్టెరాయిడ్స్‌తో పాటు యోగా, పోషకాహారం వ్యాధిని అదుపులో వుంచుతాయని నిపుణులు తెలిపారు.


Click it and Unblock the Notifications











