Bigg Boss Telugu 6: బయటపడిన బిగ్ బాస్ భారీ మోసం.. వాళ్లిద్దరూ కనిపించకపోవడంతో విమర్శలు
బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా దీన్ని మన వాళ్లు భారీ స్థాయిలో ఆదరిస్తున్నారు. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా హిందీలోకి చాలా ఏళ్ల క్రితమే వచ్చిన ఇది విజయవంతం అయింది. దీంతో దేశంలోని చాలా భాషల్లోకి పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఆరేళ్ల క్రితం తెలుగులోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఇప్పటికే కొన్ని సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌తో ప్రారంభం అయింది. మొదటి రోజు మొత్తం 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ భారీ మోసం ఒకటి బయట పడింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

ఆరు సీజన్లు.. నేషనల్ రేంజ్ రికార్డ్
బిగ్ బాస్ షో చాలా అనుమానాల మధ్య తెలుగు బుల్లితెరపైకి పరిచయం అయింది. అసలు ఇలాంటి వాటిని మన వాళ్లు ఎంకరేజ్ చేస్తారా? ఇక్కడ ఇది క్లిక్ అవుతుందా? ఇలా అనుకుంటోన్న పరిస్థితుల్లో ఈ షోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను నడిపించారు. వీటికి నేషనల్ రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్ దక్కి రికార్డులు నమోదయ్యాయి.

ఆరో సీజన్ అంగరంగ వైభవంగానే
మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దీంతో ప్రతి సంవత్సరం ఈ షో కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఆరో సీజన్‌ను సెప్టెంబర్ 4 ఆదివారం గ్రాండ్‌గా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌తో ఈ సీజన్‌ను మొదలు పెట్టేశారు. ఇది అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది.

మొదటిరోజే 21 మంది వచ్చారుగా
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రికార్డు స్థాయిలో 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు హౌస్‌లోకి ప్రవేశించారు.

ఈ సారి అందరూ అలాంటి వాళ్లు
బిగ్ బాస్ ఆరో సీజన్‌పై ఉన్న అంచనాలకు అనుగుణంగానే నిర్వహకులు పాపులర్ కంటెస్టెంట్లనే ఎంపిక చేసుకున్నారు. బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి పెద్దపీట వేశారు. వీళ్లంతా చాలా రోజులుగా క్వారంటైన్‌లో ఉండి వచ్చారు. హౌస్‌లోకి ప్రవేశించిన వారిలో 11 మంది లేడీస్, 10 మంది మెన్స్ ఉన్నారు.

తొలిరోజే షాకిచ్చిన బిగ్ బాస్ టీమ్
బిగ్ బాస్ ఆరో సీజన్‌పై ఏ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. దీనికితోడు కంటెస్టెంట్ల విషయంలోనూ ఎన్నో రకాల వార్తలు రావడంతో ఇది తరచూ ట్రెండ్ అవుతూ వచ్చింది. అయితే, ప్రీమియర్ ఎపిసోడ్‌లో 21 మందిని హౌస్‌లోకి పంపించడంతో ముందు అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత మాత్రం ఓ విషయంపై బిగ్ బాస్ ప్రియులంతా నిరాశగా ఉండిపోయారు.

ఇద్దరికి అవకాశం ఇస్తామని చెప్పి
ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ ఆరో దానిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సారి ఈ సీజన్‌లోకి ఇద్దరు కామన్ కంటెస్టెంట్లను కూడా తీసుకు వస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. దీనికోసం ఓ స్పెషల్ ప్రోమోను కూడా వదిలారు. సాక్షాత్తూ అక్కినేని నాగార్జునే దీన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ మోసం.. విమర్శల వర్షం
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి కామనర్స్‌ను కూడా తీసుకొస్తామని నిర్వహకులు చెప్పారు. కానీ, ప్రీమియర్ ఎపిసోడ్‌లో వచ్చిన 21 మందిలో అందరూ సెలెబ్రిటీలే ఉన్నారు. దీంతో షో నిర్వహకులు కామన్ కంటెస్టెంట్ల విషయంలో అందరినీ మోసం చేసినట్లు అయింది. దీనిపై బిగ్ బాస్ ప్రియులు గుర్రుగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా టీమ్‌పై తెగ విమర్శలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











