Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Bigg Boss Telugu: ఈ వారం కెప్టెన్ అతడే.. అతనికి హ్యాండ్ ఇచ్చిన ఇనయా.. షాకింగ్ ట్విస్ట్
బిగ్ బాస్ మొత్తానికి ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలతో ముందుకు సాగుతోంది. మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ సరికొత్త టాస్కులతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరవుతోంది. అందరు కూడా వారి శక్తికి మించి పోరాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఐదవ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం బలమైన కంటెస్టెంట్స్ కూడా పోటీ పడుతున్నారు. ఇక ఇప్పుడు ఫైనల్ రౌండ్ లో ముగ్గురు మిగిలారు. ఆ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఆ వివరాలలోకి వెళితే..
ఒక్క అడుగు దూరంలో
కెప్టెన్ టాస్క్ లో కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్న ఇంటి సభ్యులలో సూర్య ఆదిత్య రేవంత్ బిగ్ బాస్ కు చివరి టాస్క్ ఇస్తున్నట్లు తెలియజేశారు. పోటీదారులు కెప్టెన్ గా అర్హత సాధించేందుకు వీలైనంత ఎక్కువమంది ఇంటి సభ్యుల మద్దతును అందుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ దండలు వారికి నచ్చిన వారిపై వేస్తారో వారే కెప్టెన్ గా ఈ వారం ఎంపిక అవుతారు అని బిగ్ బాస్ వివరణ ఇచ్చినట్లు సుదీప తెలియజేసింది.
రాజు ఎక్కడున్నా రాజే
ఇక మొదట ఈ ముగ్గురు పోటీదారులలో ఒక్కొక్కరికి ఒక్కో దండా అయితే వచ్చింది. ఇక రాజు ఎక్కడున్నా రాజే అనే మాటతో గీతూ సూర్య పై ప్రశంసలు కురిపించింది. అతనికి మొదట దండ వేసిన ఆమె రాజ్యం ఇస్తే అతను ఎలా ఎలుతాడు అనేది చూడాలి అనిపిస్తుంది అని తన వివరణ ఇచ్చింది. ఇక ఇక మెరీనా అయితే రేవంత్ కు సపోర్ట్ చేసింది.
రేవంత్ కు సపోర్ట్
ఇక అర్జున్ కూడా రేవంత్ కు సపోర్ట్ చేస్తూ కెప్టెన్ అయితే అతని కోపం ఇంకా తగ్గిపోతుంది అని నేను అనుకుంటున్నాను అని తెలియజేశాడు. ఇక కీర్తి కూడా రేవంత్ కు సపోర్ట్ చేస్తూ ముందే కోపాన్ని మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పింది. ఇక ఫైమా అయితే ఎప్పటిలానే ఆదిత్య కు సపోర్ట్ చేసింది. కెప్టెన్సీ పొరపాటులను సరిదిద్దుకోవాలంటే మళ్ళీ కెప్టెన్ అవ్వాలి అని తన వివరణ ఇచ్చింది.
దండ అతనికి హగ్ నాకా
రాజు ఎప్పటికైనా రాజు అనే మాట గీతూ అంటోంది ఆ రాజుకు రాజ్యము ఉంటేనే అతను రాజు అయినట్లు లెక్క అనేది నేను అనుకుంటున్నాను అని సూర్య తెలియజేశాడు. ఇక రాజశేఖర్ కూడా అతనికి సపోర్ట్ చేయగా ఆ తర్వాత ఊహించని విధంగా ఇనయా రేవంత్ కు సపోర్ట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఆమె సైలెంట్‌గా సూర్యకు వచ్చి కౌగిలించుకుంది. దీంతో దండ అతనికి హగ్ నాకా అని అతను సెటైర్ వేశాడు.
ఆ మాట వద్దు
ఇక చివరికి ఇనయా కూడా రాజు ఎక్కడున్నా రాజు అంటూ సూర్య గురించి మాట్లాడుతూ ఉండడంతో తక్కువదండలు రావడంతో సూర్య ఆ మాటను తట్టుకోలేకపోయాడు. ఇక రాజు ఎక్కడున్నా రాజు అనే మాట వద్దు అని అనేశాడు. ఇక తర్వాత శ్రీహన్ కూడా రేవంత్ కు సపోర్ట్ చేశాడు. ఇక నీ పొజిషన్లో నేను ఉంటే ఆట మరోలా ఉండేది అంటూ చంటి రేవంత్ కు చెప్పాడు. ఇక అర్థమైంది అంటూ రేవంత్ ఏదో అనుకుంటూ ఎమోషనల్ గా వెళ్ళిపోయాడు.
|
కెప్టెన్ అతనే
ఇక ఫైనల్ గా ఈవారం క్యాప్టెన్ గా ఎవరు ఎంపిక అవుతారు అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. దాదాపు ఎక్కువ స్థాయిలో మద్దతు అందుకున్నట్లు రేవంత్ మెడలో దండలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అతనే ఈ వారం కెప్టెన్ అయినట్లుగా తెలుస్తోంది. హౌస్ లో చాలా కోపంగా ఉండే కంటెస్టెంట్లలో రేవంత్ ఒకరు. మరి అలాంటి వ్యక్తికి ఇప్పుడు కెప్టెన్ బాధ్యత వచ్చిన తర్వాత ఏ విధంగా నడుచుకుంటాడో చూడాలి.