Bigg Boss Telugu 6: ఫైనల్ ఎపిసోడ్ కోసం అగ్ర హీరో.. రేటింగ్స్ బ్రేక్ చేసేలా బిగ్ ప్లాన్?
బిగ్ బాస్ తెలుగు 6 మొదటి నాలుగు వారాల వరకు రేటింగ్స్ సరిగా అందుకోలేదు. మధ్యలో కూడా చాలా వరకు రేటింగ్స్ తగ్గాయి. నాగార్జున ఆదివారం వచ్చినా కూడా ఏమాత్రం మార్పులు లేకపోవడంతో బిగ్ బాస్ మధ్యలోనే ఆగిపోతుంది అనే విధంగా అనుమానాలు అయితే వచ్చాయి. కానీ మళ్ళీ నిలదొక్కుకునే విధంగా సరికొత్త టాస్కులు మొదలుపెట్టారు. అంతేకాకుండా కంటెస్టెంట్స్ అందరికీ కూడా బిగ్ బాస్ హెచ్చరిక చేశాడు. దీంతో మళ్ళీ షో ట్రాక్ లోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ కోసం ఒక స్టార్ హీరోని రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలలోకి వెళితే..

క్లిక్కయిన ఫ్యామిలీ ఎమోషన్స్
బిగ్ బాస్ రేటింగ్స్ ఇటీవల కాలంలో చాలావరకు తగ్గినట్లు అనిపించింది. అయితే ఈ వారం ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ కావడంతో మళ్ళీ పాత పద్ధతుల్లోనే రేటింగ్స్ ట్రాక్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా గట్టిగానే పోరాడుతున్నారు. ఒకవైపు ఎమోషన్స్ చూస్తూనే మరొకవైపు ఆటను కూడా గట్టిగానే కొనసాగిస్తున్నారు దీంతో ప్రేక్షకులు ఆదరణ కూడా పెరుగుతుంది.

మొదట్లోనే షాక్
నిజానికి బిగ్ బాస్ 6వ సీజన్ మొదలుపెట్టినప్పుడే అతి పెద్ద షాక్ తగిలింది. ఈసారి మొదటి ఎపిసోడ్ కు గతంలో కంటే చాలా తక్కువగా రేటింగ్స్ వచ్చాయి. అసలు ఫస్ట్ ఎపిసోడ్ అంటేనే ఊహించని స్థాయిలో రేటింగ్స్ వస్తుంటాయి. కానీ ఈసారి 6వ సీజన్ కు మాత్రం అతి దారుణంగా రేటింగ్స్ రావడంతో నిర్వాహకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ట్రాక్ లోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు.

బిగ్ బాస్ ఫైనల్ ప్లాన్
అయితే ఫైనల్ ఎపిసోడ్స్ ను మరింత ఉత్కంఠ భరితంగా మార్చే విధంగా బిగ్ బాస్ ప్రణాళికలు రచిస్తున్నాడు అనిపిస్తోంది. ఈసారి ఫ్యామిలీ ఎమోషనల్ వీక్ అయితే బాగానే నడిచింది. ఇక బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్స్ లలో వెంకటేష్, చిరంజీవి వంటి హీరోలు ముఖ్య అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే.

బాలయ్యపై ఫోకస్
అయితే ఈసారి వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక సరికొత్త అగ్ర హీరో ను రంగంలోకి దింపబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ అనే ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇప్పటికే నందమూరి బాలయ్య ఆహా ఓటీటీ షో అన్ స్టాపబుల్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోకు కూడా ఆయన వస్తే రేటింగ్స్ కూడా ఒక్కసారిగా పెరుగుతాయి అని చెప్పవచ్చు.

బాలయ్య బిజీగా..
బిగ్ బాస్ షో కోసం ప్రత్యేకంగా నిర్వాహకులు బాలకృష్ణను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు ఆహా షో తో పాటు మరొకవైపు అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నారు. అలాగే వీర సింహారెడ్డి కూడా విడుదలకు సిద్ధమవుతోంది. కాబట్టి ఆ సినిమాకు సంబంధించిన చివరలో కూడా కొంత వర్క్ అయితే ఉంటుంది. కాబట్టి బాలయ్య చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. మరి స్టార్ మా నిర్వాహకులు కోరినట్లుగా ఆయన బిగ్ బాస్ షోలోకి అడుగు పెడతారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











