Bigg Boss Telugu 6 Finale: ఈసారి 21 మంది కాదు.. మొత్తం 22 అంటూ కన్నీళ్ళు పెట్టించిన నాగ్
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఫైనల్ దశకు చేరుకుంది. ఇక ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా కొనసాగింది. అయితే ముందు రోజే ఎపిసోడ్ జరగడంతో ఫైనల్ విన్నర్ ఎవరో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముందుగా నాగార్జున అదిరిపోయే సాంగ్స్ తో అయితే ఎంట్రీ ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ సాంగ్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా సాంగ్ తో కూడా ఎంతగానో కట్టుకున్నాడు.
కేవలం ఫైనల్ ఎపిసోడ్లో నాగార్జున ఎంటర్టైన్ చేయడమే కాకుండా కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఎమోషనల్ టచ్ ఇచ్చాడు అనే చెప్పాలి. ఈ సీజన్లో పాల్గొన్న ప్రతి కంటెస్టెంట్ ను కూడా ఫైనల్ ఎపిసోడ్ కు హాజరయ్యారు ఇక ఒక్కొక్కరు వారి అనుభవాలను కూడా తెలియజేసుకున్నారు. నాగార్జున కూడా వారు చేసిన అల్లరి గురించి.. చేసిన తప్పుల గురించి కూడా ఎంతో చక్కగా వివరణ ఇచ్చాడు.

అయితే బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తం ఫైనల్ జర్నీని ఒకసారి చూపించాడు. ఇక వీడియోలో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎంతో ఎమోషనల్ బాండింగ్ తో ఉన్న సీన్స్ చూసి నాగార్జున కూడా ఎమోషనల్ అయ్యాడు. అంతేకాకుండా మిగతా కంటెస్టెంట్స్ కూడా కంటతడి పెట్టుకున్నారు ముఖ్యంగా వాసంతి అయితే నాకు బిగ్ బాస్ ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చింది అని బయటకు వెళ్లిన తర్వాత కూడా ఈ 20 మంది ఫ్యామిలీ నాతో ఉంటారు అని ఆశతో ఉంటున్నాను అని చెప్పింది. అయితే వాసంతి అలా చెప్పడంతో ఈ సీజన్ 21 మంది మాత్రమే కాదు 22 మంది అని.. అది నేను కూడా అని చెప్పడంతో అందరూ కూడా మరింత సంతోషపడ్డారు. నాగర్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ కూడా తన ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసిన విధానం అందరిని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ గా రేవంత్ నిలిచాడు.


Click it and Unblock the Notifications











