Bigg Boss Telugu 6 Finale: డబ్బుతో రవితేజ ఆఫర్.. ఆసక్తిగా మూడవ కంటెస్టెంట్ ఎలిమినేషన్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఊహించని మలుపులతో ఇన్ని రోజులు ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ కూడా అదే తరహాలో కొనసాగింది. ఈ చివరి ఎపిసోడ్లో ఐదు మంది మిగిలిన ఒక్కొక్కరిని నాగార్జున బయటకు పంపించారు. ఇక ప్రత్యేకంగా కొంతమంది స్టార్స్ కూడా గెస్ట్ లుగా వచ్చారు. అయితే మాస్ మహారాజ్ రవితేజ మూడవ కంటెస్టెంట్ ను బయటకు పంపించేందుకు హౌస్ లోకి అడుగుపెట్టాడు. అంతేకాకుండా అంతకంటే ముందు వారికి బ్రీఫ్ కేస్ తో ఒక మంచి ధమాకా ఆఫర్ కూడా ఇచ్చాడు. ఆ ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే..

 లోపలికి వెళ్లిన రవితేజ

లోపలికి వెళ్లిన రవితేజ

బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో మాస్ మహారాజా తోపాటు ధమాకా హీరోయిన్ శ్రీలీల కూడా ప్రత్యేక గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇద్దరు కూడా మొదట ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేశారు. ఇక తర్వాత మరొకరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకురావాలి అని రవితేజను హౌస్ లోకి పంపించారు. అంతేకాకుండా డబ్బు ఉన్న ఒక సూట్ కేసు కూడా అతనికి ఇచ్చి పంపించారు.

ధమాకా ఆఫర్

ధమాకా ఆఫర్

మాస్ మహారాజ్ రవితేజ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్ అందరితో కూడా డాన్స్ చేస్తూ వారిని ఎంతగానో ఉత్తేజపరిచారు. అందరిని కూర్చోబెట్టిన మాస్ మహారాజ్ వారి ముందు ఒక సూట్ కేసులు పెట్టి ఇందులో ఆఫర్ ఉంది అని అదొక దమకా ఆఫర్ అని డబ్బు ముగ్గిరిలో ఒకరు ఇది తీసుకొని హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు అని రవితేజ ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా తెలిపాడు.

డబ్బుని రిజెక్ట్ చేసిన కంటెస్టెంట్స్

డబ్బుని రిజెక్ట్ చేసిన కంటెస్టెంట్స్

అయితే మొదటినుంచి కూడా విన్నర్ రేవంత్ తో పాటు శ్రీహన్ అలాగే కీర్తి కూడా ముగ్గురు కూడా ఆ డబ్బు మీద ఆశ లేదు అని చెప్పేసారు. ముఖ్యంగా రేవంత్ అయితే నాకు టైటిల్ మీదే ఆశ ఉంది అని అన్నాడు. అలాగే శ్రీహాన్ కూడా అవసరం లేదు అని చెప్పాడు. ఇక వారి తల్లిదండ్రులు కూడా ఆడియన్స్ కోసం నువ్వు గెలవాలి అని డబ్బు తీసుకొని రావద్దు అని చెప్పారు.

 కీర్తి ఏలిమినేట్

కీర్తి ఏలిమినేట్

అలాగే కీర్తి డబ్బు తీసుకోమని వారి స్నేహితులకు కూడా చెప్పారు. కానీ ఆమె డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇక మరొక ఆఫర్ కూడా ఇస్తున్నాము అని ఈసారి ప్రైజ్ మనీ లో 30% ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పినా కూడా కీర్తి మాత్రం ఒప్పుకోలేదు. ఇక ఫైనల్ గా రవితేజ కీర్తిని తీసుకుని మరొక సూట్ కేసులు కూడా హౌస్ లో నుంచి బయటకు తీసుకువచ్చారు.

నవ్వుతూ వచ్చిన కీర్తి

నవ్వుతూ వచ్చిన కీర్తి

ఇక కీర్తి బయటకు వచ్చేటప్పుడు చాలా స్పోటివ్ గా మాట్లాడుతూ బయటకు వచ్చింది. ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు అని ఇద్దరు గెలవాలని ఉంది కానీ ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ప్రజలకు కూడా చాలా ధన్యవాదాలు అని ఎమోషనల్ గా తెలియజేసింది. అంతేకాకుండా నాగార్జున కూడా నువ్వు చాలా స్ట్రాంగ్ గర్ల్ అని ఆమెకు గ్రాండ్ గా గుడ్ బై చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X