Bigg Boss Telugu 6: బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో ఒళ్ళు మరచి పోరాటం.. ఫస్ట్ కెప్టెన్ ఎవరంటే?

21 మందితో మొదలైన బిగ్ బాస్ షో తొలివారం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. కొంతమంది కావాలని కెమెరాలకు ఫోకస్ కావాలి అని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రణాళికలు ఏమి వర్గం కావడం లేదు. ఇక మరికొందరు తొలి కెప్టెన్ గా నిలవాలి అని గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో తొలి వారం బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్ గా నికిచేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకరికొకరు తోడుగా ఉంటేనే మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ముగ్గురు కెప్టెన్సీ పోటీదారులు కోసం మిగతా హౌస్ మెంట్స్ కూడా పోటీ పడబోతున్నారు ఇక లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమో కూడా వైరల్ గా మారుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

కెప్టెన్సీ పోటీదారులలో క్లాస్ సెక్షన్లో ఉన్న గీతుకు ఆదిరెడ్డి నేహా చౌదరి అలాగే మా సెక్షన్ లో ఉన్న మెరీనా రోహిత్ ఆర్ జె సూర్య బాలాదిత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. ఇక ఈ రెండు గ్రూపులలో ఎవరు ఇచ్చిన టాస్కులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారో వారిలో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక గ్రూపులలో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కెప్టెన్సీ కోసం రంగంలోకి దిగి టాస్కులను ఛాలెంజింగ్ ఆడబోతున్నారు.

Bigg boss telugu 6 first captaincy task bigg fight between contestants

ఇక టాస్క్ లు జరిగేటప్పుడు గొడవలు ఏ రేంజ్ లో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొందరు అయితే ఒళ్ళు మరిచి బరిలో దుకుతున్నారు. ఇక మొదటివారం కెప్టెన్సీలో భాగంగా మొదటి బండి ఆటను బిగ్ బాస్ మొదలుపెట్టారు. కొన్ని నీళ్లల్లో ఉన్న నెంబర్లను తీసుకొని బండికి అంటించాల్సి ఉంటుంది. అయితే ఎవరు కూడా చేతులు పెట్టకూడదు ఆ నీళ్లలో మొహం పెట్టి నోటితో ఆ నెంబర్లను తీయాల్సి ఉంటుంది.

అయితే రేవంత్ మధ్యలో చేతులు పెట్టి తీస్తున్నాడు అని ఫైమా గట్టిగా అరిచేస్తూ అసలు చేతులతో తీయకూడదు అని హెచ్చరిక చేసింది. మరోవైపున నేత చౌదరి కూడా ఈ పోటీలో గట్టిగానే తన గొంతును వినిపించింది. ఎవరికి వారు ఏమాత్రం తగ్గకుండా పోటీలో పాల్గొన్నారు. ఇక మధ్యలో వచ్చిన మెరీనా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నెహ చౌదరి పై ఒక్కసారిగా విరుచుకుపడింది. తప్పుగా గేమ్ ఆడవద్దు అని ఆ నెంబర్లను కింద పడేయాలి అని విరుచుకుపడింది. ఇక వీరిలో కెప్టెన్ ఎవరు అవుతారు అనేది ఈరోజు క్లారిటీ వస్తుంది. మొత్తానికి అయితే బాలాదిత్యా మొదటి కెప్టెన్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి రెండో వారం ఆట ఏ విధంగా కొనసాగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X