Bigg Boss 6: మొదటి రోజే భారీగా ఖర్చు చేయబోతున్న నిర్వాహకులు.. బిగ్ ప్లాన్!

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మొదలవుతుంది అన్నప్పుడు అనుకున్నంతగా సక్సెస్ కాదేమో అని అనుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఈ రియాలిటీ షో నాగార్జునతో 5 సీజన్స్ వరకు విజయవంతంగా కొనసాగింది. ఇక రాబోయే 6వ సీజన్ పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈసారి మొదటి ఎపిసోడ్ కోసమే నిర్వాహకులు భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సెప్టెంబర్ 4 నుంచి

సెప్టెంబర్ 4 నుంచి

బిగ్ బాస్ గడిచిన 5 సీజన్స్ కూడా భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ మొదట హోస్ట్ గా ఆ తర్వాత నాని రెండవ హోస్ట్ గా షోను ఎక్కడికో తీసుకువెళ్లారు అయితే మూడో సీజన్ నుంచి నాగార్జున విజయవంతంగా బిగ్ బాస్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఓటీటిలో కూడా నాన్ స్టాప్ షోగా బిగ్ బాస్ కు మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 4న 6వ సీజన్ గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.

 అందుకే అడిగినంత ఇస్తున్నారు

అందుకే అడిగినంత ఇస్తున్నారు

ఈసారి బిగ్ బాస్ కోసం నిర్వాహకులు భారీ స్థాయిలోనే ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన ఐదు సీజన్స్ కు కూడా పెట్టిన పెట్టుబడికి కూడా మంచి రేటింగ్స్ అందుకుంటూ లాభాలను గడించారు. అందుకే ఎన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అయిన బిగ్ బాస్ నిర్మాణ సంస్థ మాత్రం ఖర్చుకు ఏ మాత్రం వెనుక పడకుండా ఈ షోను కొనసాగిస్తోంది. అలాగే కంటెస్టెంట్స్ అందరికీ కూడా అడిగినంత పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.

 గ్యాప్ ఇవ్వకూడదు అని..

గ్యాప్ ఇవ్వకూడదు అని..


బిగ్ బాస్ 4వ సీజన్ అత్యధిక స్థాయిలో రేటింగ్స్ అందుకుని మంచి గుర్తింపు అయితే అందుకుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే అత్యధిక రేటింగ్ అందుకోవడం విశేషం. ఇక ఇప్పుడు 6వ సీజన్ కూడా అదే తరహాలో ఉండాలి అని మొదటి ఎపిసోడ్ నుంచే నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఐదో సీజన్ మధ్యలో కాస్త రేటింగ్ తగ్గినప్పటికీ చివరి క్షణంలో పుంజుకుంది. కానీ ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ విషయంలో నిర్వాహకులు గ్యాప్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు.

రెండు గంటలకు పైగా..

రెండు గంటలకు పైగా..

అయితే 6వ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే నిర్వాహకులు ఊహించని టాస్కులను మొదలు పెట్టబోతున్నారు. ఇక మొదటి ఎపిసోడ్ దాదాపు రెండు గంటలకు పైగానే ఉంటుందట. అయితే ఈ క్రమంలో ఎంట్రీ ఇచ్చే ప్రతి కంటెస్టెంట్ కూడా ఏదో ఒక డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. అంతేకాకుండా ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ తో షోలో హైలెట్ కాబోతున్నారు.

ఫస్ట్ ఎపిసోడ్ కోసమే భారీగా ఖర్చు

ఫస్ట్ ఎపిసోడ్ కోసమే భారీగా ఖర్చు

బిగ్ బాస్ 6వ సీజన్ కోసం నిర్వాహకులు గతంలో ఎప్పుడు లేనివిధంగా రెండు కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి హౌస్ లో అత్యధిక టెక్నాలజీతో కెమెరాలను ఫిక్స్ చేయబోతున్నారు. ఇక మొదటి ఎపిసోడ్ లో ప్రత్యేకంగా డాన్స్ చేసే అగ్ర హీరోయిన్స్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు. కాబట్టి వారికి కూడా భారీ స్థాయిలోనే ఫీజులు అందబోతున్నాయి. మరి మొత్తంగా ఈసారి బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ ఏ స్థాయిలో రేటింగ్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X