Bigg Boss Telugu 6: నామినేషన్ రచ్చ షురూ.. రేవంత్ తగ్గించుకుంటే మంచిది అంటూ ఫైమా సెటైర్

బిగ్ బాస్ లో అసలు ఆట ఈ రోజు నుంచి మొదలు కాబోతోంది. ఇక ఎవరెవరు నామినేషన్ లో నిలుస్తారు అలాగే మొదట ఇంట్లో నుంచి వెళ్లిపోయేది ఎవరు అనే విషయం ఆసక్తిగా మారుతుంది. ఎందుకంటే దాదాపు అందరూ కూడా హౌస్ లో ఉండాలి అని ఎంతో పట్టుదలతో ఉన్నారు. ఇక లేటెస్ట్ గా నామినేషన్ కు సంబంధించిన ఒక స్పెషల్ ప్రోమో కూడా విడుదల చేశారు. ఇక నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగింది అందరిలో ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేశారు అనే వివరాల్లోకి వెళితే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

నామినేషన్ ప్రక్రియ

నామినేషన్ ప్రక్రియ

బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న మొదటి నామినేషన్ అంటూ బిగ్ బాస్ ప్రతి ఒక్కరికి కూడా నామినేషన్ ప్రక్రియ గురించి వివరణ ఇచ్చారు. ఎవరైతే ఉండకూడదు అనుకుంటున్నారో వారి పేర్లను ముద్రించి దాన్ని ఫ్లషౌట్ చేయాలి అని వివరణ ఇచ్చాడు. నిర్మొహమాటంగా మీరు అనుకుంమ వారిని ఎందుకు నామినేట్ చేస్తున్నారో తెలియజేయాలి అని బిగ్ బాస్ తెలియజేశారు.

యాటిట్యూడ్ వైబ్

యాటిట్యూడ్ వైబ్

ముందుగా రేవంత్, ఫైమా మా మీద ఫోకస్ చేశాడు. ఆమె పని చేయడం తాను ఎప్పుడు చూడలేదని అన్నాడు. అందుకు ఫైమా కూడా సమాధానం ఇచ్చింది. నేను పని చేసేటప్పుడు మీరు రాలేదేమో అని సమాధానం చెప్పడంతో నేను ఇంట్లో లేనేమో నాకు ఆ విషయం తెలియదేమో అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక వాసంతి అయితే శ్రీ సత్యను నామినేట్ చేస్తూ యాటిట్యూడ్ వైబ్ అనే నాకు అనిపించిందని ఒక కారణం చెప్పింది.

నన్నే అంటున్నాడు

నన్నే అంటున్నాడు

అర్జున్ కూడా ఫైమాను నామినెట్ చేస్తూ ఆమె గ్రూప్ లో ఉంటూ కామెడీ చేస్తోంది కానీ పెద్దగా పనులు చేసినట్లు అనిపించడం లేదు అని కారణం చెప్పాడు. ఇక మరొకరితో నేను ఏదో మాట్లాడుతూ ఉంటే నన్నే అంటున్నాడు అని ఆ కారణం చెప్పి నామినిట్ చేయడం కూడా అర్థంలేనిది అంటూ అర్జున్ తన వివరణ అయితే ఇచ్చాడు. పైమాకూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

అందరి ఫోకస్ రేవంత్ పైనే

అందరి ఫోకస్ రేవంత్ పైనే

ఇక ఈసారి కంటెస్టెంట్లలో అందరి ఫోకస్ కూడా ఎక్కువగా రేవంత్ పైనే ఉన్నట్లు అనిపిస్తోంది. సుదీప, వాసంతి, ఫైమా, కీర్తి ఇలా అందరూ కూడా రేవంత్ ను నామినేట్ చేశారు. అతను ఒక మాటకారి అంటూ ఫైమా సెటైర్ కూడా వేసింది. నువ్వు గట్టిగా మాట్లాడితే లేదు కానీ అవతలి వాళ్ళు మాట్లాడితే తప్పు వచ్చింది అని ఫైమా చెప్పడంతో నా వాయిసే అంత అంటూ.. మీ గురించి నా వాయిస్ మార్చుకోలేను అని రేవంత్ గట్టిగా చెప్పాడు.

ఓపిక పట్టి పట్టి చచ్చిపోయాను

ఓపిక పట్టి పట్టి చచ్చిపోయాను

ఇక రేవంత్ మరో స్ట్రాటజీతో ఆరోహిని నామినేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆమెపై ఏదో చెబుతూ ఉండగా ఇలాంటి బాద్నామములు నేను తీసుకోను అని గట్టిగానే మాట్లాడింది. ఇక ఆరోహి అలా మాట్లాడుతుండగా రేవంత్ నీది అయిపోయింది కదా మాట్లాడకు అని మరో కౌంటర్ ఇవ్వగా అందుకు ఆరోహి సీరియస్ అయ్యింది. ఇప్పటివరకు ఇప్పటివరకు ఓపిక పట్టి పట్టి చచ్చిపోయాను అని నేను 20 మార్కుల ప్రశ్న అడిగితే 2000 మార్కుల జవాబు చెప్తాను అని వివరణ ఇచ్చింది.

వెటకారం తగ్గించుకుంటే మంచి


ఇక చివరలో ఏమైనా మాట్లాడాలా అంటూ ఫైమా అడగడంతో కాస్త ఎటకారం తగ్గించుకుంటే బాగుంటుంది అని రేవంత్ అన్నాడు. అందుకు ఫైమా నాకు అలానే ఉంటుంది మీరు ఎటకారం తగ్గించుకుంటే నేను తగ్గించుకుంటాను అని గట్టిగా జవాబు ఇచ్చింది. మరి ఈ నామినేషన్ కూడా ఎంతవరకు వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X