Bigg Boss Telugu 6: మరింత రెచ్చగొడుతున్న గీతూ.. నల్ల చేపతో బిగ్ బాస్ న్యూ ట్విస్ట్!

బిగ్ బాస్ చేపల చెరువు టాస్క్ లో భాగంగా ఇస్తున్న మరో ఛాలెంజ్ షీల్డ్ వార్ అని ఈ టాస్క్ లో నాలుగు జంటలు పోటీ పడతాయి అని తెలియజేశారు. ఇక జంటల వెనకాల వైపు ఉన్న టబ్ లలో ఇతర కంటెస్టెంట్స్ నీళ్లు పోయకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి మధ్యలో తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే..

శ్రీహన్ మీద టార్గెట్

శ్రీహన్ మీద టార్గెట్

రేవంత్ ఈ ఛాలెంజ్ లో సంచాలకుడిగా ఉంటూ జస్ట్ వన్ ఇంచ్ తేడాలో సూర్య టీమ్ వాళ్ళు గెలిచారు అని చెప్పాడు. ఇక వాసంతి అయితే శ్రీహన్ మీద టార్గెట్ చేసింది. అతనికి మన మీద చాలా ఉంది అంటూ రేవంత్ తో చెప్పింది. ఒక్కసారి టార్గెట్ అనేది లోపలికి రాకూడదు అని రేవంత్ కూడా ఆమెతో చెప్పాడు.

తప్పకుండా ఏటాక్ చేస్తారు

తప్పకుండా ఏటాక్ చేస్తారు

మరోవైపు సూర్య తప్పకుండా ఏటాక్ చేస్తారు అని ఈసారి ఎంతమందిని అడ్డుకుంటావని సూర్య కూడా అన్నాడు. ఇక నా టార్గెట్ ఆదిత్య అని శ్రీ సత్య చెప్పింది. మరోవైపు బాలదిత్యా కూడా తనదైన శైలిలో ప్లాన్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మెరీనా కూడా స్టార్టింగ్ లో శ్రీ సత్య ఒకలా ఉందని ఇప్పుడు మరోలా ఉంది అని కామెంట్ చేసింది.

ఆటలోకి ఒక నల్ల చేప

ఆటలోకి ఒక నల్ల చేప

ఇక ఈ రౌండ్ ఇంతటితో పూర్తయిందని బిగ్ బాస్ కూడా చెప్పాడు. అయితే ఈ టాస్క్ లో భాగంగా ఆటలోకి ఒక నల్ల చేప వచ్చింది అని బిగ్ బాస్ కూడా చెప్పాడు. ఇక రెండు జంటల బాస్కెట్లను స్వాప్ చేసే శక్తి ఉంటుంది అని కూడా చెప్పడంతో గీతు రాయల్ ఆటను ఒక్కసారిగా చేంజ్ చేసే హక్కును దక్కించుకున్నట్లు అనిపిస్తోంది.

కంటిన్యూ చేయండి బిగ్ బాస్

కంటిన్యూ చేయండి బిగ్ బాస్

ఇక నేను రేవంత్ ఇనయా, శ్రిహాన్, శ్రీ సత్య మధ్యలో స్వాప్ చేద్దామని అనుకుంటున్నాను అంటూ గీతు చెప్పింది. ఇక ఆడటం చేతకాని తనం అని అంటారు అని రేవంత్ కూడా తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ఈ గేమ్ కంటిన్యూ అవ్వాలి అప్పుడు చెప్తాను అంటూ ఇనయా కౌంటర్ ఇచ్చింది. కంటిన్యూ చేయండి బిగ్ బాస్ అంటూ కూడా అని అడిగింది.

ఈ ఫైర్ కోసమే

ఈ ఫైర్ కోసమే

ఈ ఫైర్ కోసమే బిగ్ బాస్ స్వాప్ చేసింది అంటూ గీతు కూడా తెలియజేసింది. ఇక ఇప్పటినుంచి నేను కామ్ గా ఉన్నాను. ఇక బరిలో దిగితే ఎలా ఉంటుందో చూపిస్తాను అని కూడా గట్టిగా ఆవేశాన్ని చూపించింది. కానీ నేను బరిలోకి దిగిన తర్వాతనే స్వాప్ చేశాను బిగ్ బాస్ అనే గీతు మరోసారి మంట మండే విధంగా మాట్లాడింది.

గీతూ వర్సెస్ రేవంత్

పక్కోళ్ళ గేమ్ చెడగొట్టి కంటెంట్ తీసుకురావాలి అంటే ఏం ఉండదు అని రేవంత్ కూడా రెచ్చగొట్టాడు. పక్కనోళ్ళతో కూడా గేమ్ ఆడించేదే మజా అని గీతూ చెప్పిందే. గీతూ తో మాట్లాడి కూడా వేస్ట్ అని రేవంత్ అనడంతో అందుకే మాట్లాడొద్దు అని కూడా ఆమె కౌంటర్ ఇచ్చింది. మరి ఈ మాటల తూటాలు బిగ్ బాస్ లో ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X